Just In
- 9 hrs ago
మహీంద్రా కార్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ; ఏ కార్‌పై ఎంతో చూసెయ్యండి
- 19 hrs ago
బిఎండబ్ల్యు ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. ఫీచర్స్ & పర్ఫామెన్స్
- 21 hrs ago
డ్యుకాటి మోన్స్టర్ ఉత్పత్తి ప్రారంభం; త్వరలో భారత మార్కెట్లో విడుదల!
- 22 hrs ago
భారత్‌లో టి-రోక్ కారుని రీలాంచ్ చేయనున్న ఫోక్స్‌వ్యాగన్; ఈసారి ధర ఎక్కువే..
Don't Miss
- News
బీజేపీలోకి మెగాస్టార్ మిథున్ చక్రవర్తి -ప్రధాని మోదీ తొలి సభలోనే సంచలనం -బెంగాల్ సీఎం అభ్యర్థి?
- Movies
బీజేపీలో చేరిన డిస్కో డ్యాన్సర్.. ప్రధాని మోదీతో మిథున్ చక్రవర్తి కలిసి..
- Sports
ఐపీఎల్ 2021 షెడ్యూల్ వచ్చేసింది.. వేదికల్లో హైదరాబాద్‌కు దక్కని చోటు !
- Finance
ట్విట్టర్ సీఈవో 15 ఏళ్ల క్రితం తొలి ట్వీట్‌కు రూ.కోట్లు
- Lifestyle
ఈ వారం మీ జాతకం ఎలా ఉందో ఇప్పుడే చూసెయ్యండి... మీ లైఫ్ కు సరికొత్త బాటలు వేసుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
కూటి కోసం కోటి విద్యలు అన్నది లోకోక్తి. సమాజంలో ప్రజలు జీవనోపాధి కోసం ఎన్నెన్నో పనులు చేస్తుంటారు. అంతే కాకుండా కొంతమంది చేసే పని వల్ల సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌కు చెందిన 21 ఏళ్ల అమ్మాయి తన కుంటుంబం కోసం ఆటో డ్రైవర్ గా మారింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ 21 ఏళ్ల అమ్మాయి ఆటో డ్రైవర్ కావడం ద్వారా తన తండ్రికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం ఈ అమ్మాయి జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాకు చెందినది. ఆమె పేరు బంజీత్ కౌర్. ఆమె తండ్రి స్కూల్ బస్ డ్రైవర్ .

బంజీత్ కౌర్ తండ్రి కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగం కోల్పోయాడు. ఉపాధి కోల్పోవడంతో వారి జీవితం చాలా కష్టతరం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే తన తండ్రికి సహాయం చేయడానికి బంజీత్ కౌర్ ఆటో నడపాలని నిర్ణయించుకుంది.
MOST READ:మళ్ళీ లాంగ్ డ్రైవ్‌లో కనిపించిన అజిత్.. ఈ సారి ఎక్కడికెళ్లాడో తెలుసా

న్యూస్ ఏజెన్సీ ANI బెంజీత్ కౌర్ తో మాట్లాడుతూ, నాన్న పాఠశాలలో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఈ కారణంగా, తన తండ్రి బస్ డ్రైవర్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన తరువాత, అతను ఆటోరిక్షాను నడపడం ప్రారంభించాడు. కానీ తగినంత ఆదాయం లేదు. ఈ కారణంగానే నేను నా తండ్రితో కలిసి ఆటోరిక్షాను నడపాలని నిర్ణయించుకున్నాను.

బంజీత్ కౌర్ ఆమె ఆటో నడుపుతున్నప్పటికీ, తాను డిఫెన్స్ లో చేరాలనుకుంటున్నట్లు, కావున ప్రస్తుతం సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేట్ చదువుతున్నట్లు తెలిపింది. అంతే కాకుండా ప్రస్తుతం ఆటోరిక్షా నడపడం కేవలం పార్ట్‌టైమ్ జాబ్ అని చెప్పింది.
MOST READ:కొత్త హోండా వెజెల్ ఎస్యూవీ టీజర్ విడుదల

సమాజంలో నేటి యువతరం బాలికలు ఎంత కష్టతరమైనదానినైన ఎదుర్కోవడానికి సిద్ధంగా తయారవ్వాలని బంజీత్ కౌర్ చెప్పారు. ఈ నిర్ణయం చాలా మందిని ప్రభావితం చేస్తుందని, బంజీత్ కౌర్ కుటుంబం చాలా సంతోషించింది.

దీని గురించి బంజీత్ కౌర్ తండ్రి మాట్లాడుతూ, ప్రతి రంగంలో బాలికలు బాగా రాణించగలరని ఆమె తండ్రి సర్దార్ గోరఖ్ సింగ్ అన్నారు. వారు కోరుకున్న ఏ వృత్తిని అయినా ఎంచుకోవచ్చు. తమకు ఇష్టమైన రంగంలో రాణించినట్లైతే ప్రతి ఒక్కరూ 100% విజయాన్ని తప్పకుండా పొందవచ్చని చెప్పారు.
MOST READ:3 కి.మీ ట్రక్కుని రివర్స్ గేర్‌లో నడిపిన డ్రైవర్.. ఎందుకనుకుంటున్నారా, అయితే ఇది చూడండి

కరోనా మహమ్మారి కారణంగా కరోనా లాక్ డౌన్ సమయంలో నేను ఉద్యోగం కోల్పోయినప్పుడు, నా కుమార్తె నాకు ఆటో రిక్షా నేర్పించమని కోరింది. నేను ఆమెకు సహాయం చేశానని ఆమె చెప్పాడు. పిల్లలు ఇష్టమైన వాటిని నేర్పించడానికి తల్లి తంతులు తమ వంతు కృషి చేయాలనీ చెప్పారు. అప్పుడే వారు అన్ని రంగాలలోనూ రాణించగలరు.