అమీర్ 'సత్యమేవ జయతే'కు స్పాన్సర్ చేయనున్న స్కొడా
ఈ టెలివిజన్ షో వచ్చే నెల ఆరవ తేదీ నుండి (మే 6, 2012) నుండి స్టార్ నెట్‌వర్క్‌లోని వివిధ ఛానెళ్లలో ప్రసారం కానుంది. ఈ టెలివిజన్‌కు దేశవ్యాప్తంగానే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది వీక్షకులు ఉన్నారు. ఒక్క భారతదేశంలోనే ఇది 40 లక్షల మంది వీక్షలకు చేరవచ్చని అంచనా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవరించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టిని ఆకట్టుకోవాలని స్కొడా భావిస్తోంది.
దీని గురించి స్కొడా మార్కెటింగ్ హెడ్ కమల్ బసు మాట్లాడుతూ.. సత్యమేవ జయతేకు స్పాన్సర్‌గా వ్యవహరించటం తమకెంతో గర్వంగా ఉందని, ఈ షో భారతీయుల మదిని ఆకట్టుకుంటుందని అన్నారు. దశాబ్ధ కాలంగా ఇండియాలో ఉన్న తమకు సరైన సమయంలో ఓ మంచి అవకాశం దక్కిందని, ఇది తమ కస్టమర్ల మనస్సులలో స్కొడా విలువలను మరింత బలపరుస్తుందని అన్నారు.
అలాగే, అమీర్ ఖాన్ చేస్తున్న ఈ మొట్టమొదటి టెలివిజన్ షో ద్వారా స్టార్ నెట్‌వర్క్ సామర్థ్యం కూడా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అమీర్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవరిస్తున్న సత్యమేవ జయతే అనే టెలివిజన్ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే వివిధి టెలివిజన్ ఛానెళ్లలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications









