నిండా పాతికేళ్ళు కూడా లేదు.. ఖరీదైన కారు కొనేసాడు - ధర తెలిస్తే షాకవుతారు!

లంబోర్ఘిని పేరు ఎంతోమంది వాహన ప్రేమికులను ఫిదా చేస్తుంది. చాలామందికి ఇలాంటి కారును కొనాలని, ఒక్క సారైనా డ్రైవింగ్ చేయాలనీ.. కలలు కంటూ ఉంటారు. ఇలాంటి కలను 23ఏళ్ల కుర్రాడు నిజం చేసుకున్నాడు. దీనికి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో అన్యదేశ్య కార్లు లేదా సూపర్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇందులో భాగంగానే ఇప్పటికే అనేకమంది యువ వ్యాపారవేత్తలు లంబోర్ఘిని కార్లను కొనుగోలు చేశారు. ఇందులో చాలామంది వయసు 30ఏళ్ళు పైబడిన వారే. వీరిలో కూడా ఎక్కువ భాగం చాలా కష్టపడి తమ డ్రీమ్ కారును సొంతం చేసుకున్నారు. ఇటీవల వెల్లడైన వీడియోలో లబోర్గిని కారు కలిగి ఉన్న 23ఏళ్ల యువకుడిని చూడవచ్చు.

Young Man Bought Expensive Lamborghini Huracan

హేర్ గ్యారేజ్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో 23 సంవత్సరాల యువకుడు 10 నెలల క్రితం 'లంబోర్ఘిని హురకాన్' కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బహుశా భారతదేశంలో లంబోర్ఘిని హురకాన్ కలిగిన అతి చిన్న వయస్కుడు ఇతడే అని తెలుస్తుంది. ఈ కారు కొనుగోలు గురించి ఈ యువకుడు తన అనుభవాలను వెల్లడించడం ఈ వీడియోలో చూడవచ్చు.

నిజానికి 'మృదుల్' అనే యువకుడు ఈ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ యువకునికి లంబోర్ఘిని కారును కొనాలనే ఆలోచన ఉండేది కాదని పేర్కొన్నాడు. అయితే ఒకసారి లంబోర్ఘిని కారు కోసం వెతకడం మొదలుపెట్టాడు. వారికిన్ దగ్గరలోనే లంబోర్ఘిని కారు ఉన్నట్లు గుర్తించి ఆ మరుసటి రోజే లంబోర్ఘిని కారు కొనేశారు. ఎరుపు రంగులో కనిపించే ఈ కారు చూడగానే ఆకర్షించే విధంగా ఉంది.

Young Man Bought Expensive Lamborghini Huracan

స్పోర్టీగా కనిపిస్తున్న ఈ కారు యొక్క బానెట్‌ మీద 'జై శ్రీ రామ్' అనే స్టిక్కర్ ఉండటం కూడా చూడవచ్చు. ఈ కారు ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పొందుతుంది. వీడియోలో దీనిని గమనించవచ్చు. మొదట్లో మృదుల్ లంబోర్ఘిని కారును కొనే సమయంలో తన కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కానీ అతనికి అలాంటి కార్లంటే చాలా ఇష్టం కావడంతో కుటుంబ సభ్యులను ఒప్పించగలిగాడు.

పది నెలల క్రితం మృదుల్ లంబోర్ఘిని హురాకాన్ కారును కొనుగోలు చేశారు. అయితే ఆ 10 నెలల్లో మొత్తం నాలుగు టైర్లను మార్చడు. కారులో మొత్తం 9000 కిమీ వరకు నడిపినట్లు పేర్కొన్నారు. కారుకి చిన్న పంక్చర్ అయితే కూడా యజమాని టైర్లను మార్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనుభవం అతని రెండుసార్లు జరిగినట్లు తెలుస్తోంది. టైర్లు మార్చడానికి ప్రతిసారీ సుమారు అతనికి 2 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

సర్వీస్ ఖర్చు విషయానికి వస్తే.. రూ.4 నుంచి రూ.5 లక్షల మధ్య ఖర్చు అయ్యేట్లు తెలుస్తోంది. ఈ కారు ఫుల్ ట్యాంకుతో 260 కిమీ పరిధిని అందిస్తుందని సమాచారం. అయితే కారు కెపాసిటీని యజమాని ఎప్పుడూ తనికీ చేయలేదని పేర్కొన్నారు. ఈ కారును ఆ యువకుడు రూ. 3 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇతని వద్ద పోర్స్చే కారు కూడా ఉన్నట్లు సమాచారం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, April 13, 2024, 17:30 [IST]
English summary
23 years young man bought lamborghini huracan viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+