చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

సాధారణంగా డ్రైవింగ్ అంటే మొదట గుర్తొచ్చేది మగవారు మాత్రమే, కానీ దేశం ప్రగతి వైపు పరుగులు తీస్తున్న వేళ ఎందులోనూ మగవారికంటే మేము తక్కువ కాదని నిరూపిస్తున్న మహిళలు ఇప్పుడు సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. ఈ రోజు చిన్న బైక్ డ్రైవ్ చేయడం దగ్గర నుంచి ఏకంగా అంతరిక్షయానం చేయడం వరకు అన్ని రంగాల్లోనూ వారి పాత్ర ఎంతగానో ఉంది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

అయితే స్త్రీలు ఎన్ని రంగాల్లో ప్రవేశించినప్పటికీ, వారి సంఖ్య ఈ రంగాల్లో చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా డ్రైవింగ్ వంటి వాటిలో స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉంది. చిన్నవాహనాల సంగతి ఒకవైపు ఉంచితే, భారీ వాహనాలను నడిపే స్త్రీలను వేళ్ళమీద లెక్కగట్టవచ్చు.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

భారతదేశంలో పెద్ద వాణిజ్య వాహనాలు అనుభవజ్ఞులైన మగ డ్రైవర్లు మాత్రమే సులభంగా నడపబడతాయి. కానీ ఈ రోజుల్లో ఈ వాహనాలు మహిళలు కూడా నడుపుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇది వరకే చాలా వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇదే రీతిలో మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

నివేదికల ప్రకారం ఇటీవల కేరళ రాష్ట్రానికి చెందిన ఒక 24 ఏళ్ల యువతి ఏకంగా పెట్రోల్ ట్యాంకర్ నడుపుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన 'డేవిస్' ట్రక్కును నడుపుతున్నాడు. ఈతని కుమార్తె 'దెలిషా డేవిస్' కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. ఈమె తండ్రి డ్రైవర్ కావున ఈమెకి కూడా చిన్నతనం నుంచి డ్రైవింగ్ పట్ల చాలా ఆసక్తి పెంచుకుంది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

ఇందులో భాగంగానే టు వీలర్ మరియు ఫోర్-వీల్ డ్రైవ్ నేర్చుకున్న తరువాత, ఈమె ఏకంగా ట్రక్ డ్రైవ్ చేయడానికి సంకల్పించుకుంది. ఈమె తండ్రి దాదాపు 42 సంవత్సరాలుగా ఇంధన ట్యాంకర్ నడుపుతున్నాడు, దీని వల్ల ఈమెకి కూడా పెట్రోల్ ట్యాంకర్ డ్రైవ్ చేయాలనే అనుభూతిని పెంచుకుంది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

తన కుమార్తె ఆశయానికి ఏమాత్రం ఆ తండ్రి అడ్డు చెప్పలేదు. ఈ కారణంగానే దెలిషా డేవిస్ గత మూడేళ్ళుగా పెట్రోల్ ట్యాంకర్ నడుపుతోంది. ఓసారి రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా, దెలిషా నడుపుతున్న వాహనం కూడా ఆపారు. డ్రైవింగ్ సీట్లో అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయిన అధికారులు, ఈ విషయం గురించి ఉన్నతాధికారులు సమాచారం అందజేశారు.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

కేరళ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన వాహనాలను నడపడానికి లైసెన్స్ పొందిన ఏకైక మహిళా డ్రైవర్ దెలిషా. ఈ సందర్భంగా మాట్లాడిన దెలిషా, నా ఉత్సాహాన్ని రవాణా శాఖ అధికారులకు తెలియజేసి, డ్రైవింగ్ చేయడానికి భయపడే మహిళలకు డ్రైవింగ్ ఒక ప్రేరణ అని వారిని కోరారు.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

దెలిషా కొచ్చిలోని ఇరుంబనం రిఫైనరీ నుండి మలప్పురం ఎనర్జీ సెంటర్‌కు ఇంధనాన్ని రవాణా చేస్తోంది. ఇరుంబనం నుండి మలప్పురం వరకు దూరం 300 కి.మీ. ఈమె ఈ మార్గంలో వారానికి మూడుసార్లు ప్రయాణిస్తుంది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

ట్యాంకర్ నడపడం నేర్చుకున్నప్పుడు దెలిషా వయసు 16 సంవత్సరాలు. ఆమె 18 సంవత్సరాల వయస్సులో డ్రైవింగ్ లైసెన్స్ మరియు 20 సంవత్సరాల వయస్సులో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ సొంతం చేసుకుంది.

దెలిషా ఉదయం 4 గంటలకు ఇరుబనం రిఫైనరీకి చేరుకొని, అక్కడ ట్యాంకర్ నింపిన తర్వాత, అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 9.30కి తిరూర్‌కు వచ్చి ట్యాంకర్ అన్‌లోడ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి చేరుకుంటుందని తెలియజేసింది.

చదివింది M.com, చేస్తోంది పెట్రోల్ ట్యాంక్ డ్రైవింగ్.. ఇదంతా 24 ఏళ్ల యువతి సాహసం

డ్రైవింగ్ చేస్తున్న ఈ మహిళా చదువుపట్ల కూడా శ్రద్ద వహిస్తోంది. దీనికోసం దెలిషా సాయంకాలం క్లాసులకు హాజరై ఎంకామ్ పరీక్షలు రాశానని, ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపింది. భవిష్యత్ లో తనకి మల్టీయాక్సిల్ వోల్వో బస్సును నడపాలన్నది కల అని దాని కోసం లైసెన్స్ పొందడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఇదంతా కూడా ఆమె తండ్రి ప్రోత్సాహంతో జరిగినట్లు కూడా ఈమె సగర్వంగా తెలిపింది.

Image Courtesy: CRUX

Most Read Articles

English summary
24 Year Old Kerala Girl Drives A Fuel Tanker Truck. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X