24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ఇప్పటి ఆధునిక యుగంలో మహిళలు ఏ రంగంలోనూ తీసిపోరు, డ్రైవింగ్ విషయాని కొస్తే విమానం దగ్గర నుంచి చిన్న మోటార్ సైకిల్ వరకు వీరు సునాయాసంగా డ్రైవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసుకోవాలని అనుకొంటున్నారా అయితే పదండి..

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

మహిళా డ్రైవర్లు నగర రోడ్లపై సాధారణంగా చిన్న చిన్న వాహనాలను నడపడం చూస్తుంటాము, అయితే ఎప్పుడు చెప్పబోయే విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహిళా డ్రైవర్లు హెవీ వాహనాలను నడపడం అనే విషయానికి వస్తే అరుదైన దృశ్యం అవుతుంది. క్యాబ్ లతో సహా ఇతర వాణిజ్య వాహనాల్లో డ్రైవ్ చేసే మహిళా డ్రైవర్లు ఉన్నారు, అయితే ట్రక్కులు మరియు బస్సు వంటి హెవీ వాహనాలను నడపడం కష్టంగా ఉంటుంది.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ముంబైలో మెకానికల్ ఇంజనీర్ చేసిన ప్రతీక్ష దాస్ అనే మహిళ, బస్సు డ్రైవర్ గా మారింది. 24 ఏళ్ల ప్రతీక్ష ఇటీవల మహారాష్ట్రలోని మలాడ్ లోని ఠాకూర్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. ఆమె ఇటీవల బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ కు బస్సు డ్రైవర్ గా నియమితులయ్యారు.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

మాములుగా అయితే ఒక 24 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి స్నేహితులతో కలిసి, సినిమాలకు వెళ్ళడం మరియు బ్యూటీ పార్లర్ లను సందర్శించడం వంటి అన్ని ఇతర పనులు చేస్తారు. రద్దీగా ఉండే ముంబై రోడ్లపై ఎరుపు రంగులో ఉన్న ఆరు టన్నుల భారీ బస్సును హ్యాండిల్ చేయడం ఆమె జీవితంలో అసామాన్యమైన విషయం అని చెప్పవచ్చు.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ప్రతీక్ష ఓ ఇంటర్వ్యూలో హెవీ వాహనాలపై తన ఉన్న ఇష్టాన్ని వ్యక్తం చేసింది. హెవీ వాహనాలను నడపడంలో మంచి అనుభవం సంపాదించాలని తాను కోరుకుంటున్నానని, ఇప్పుడు ఆరేళ్లుగా ఆమె మనసు వీటి మీద ఉందని చెప్పారు. మోటార్ సైకిళ్లతో ఆమె మొదటి డ్రైవింగ్ అనుభవాన్ని ప్రారంభించి ఆ తర్వాత కార్లపై తన శిక్షణ మొదలైంది.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి

ఇప్పుడు ఆమె హెవీ వాహనాలు అయిన బస్సులు మరియు ట్రక్కులు హ్యాండిల్ చేసే విధంగా అనుభవాన్ని సాధించింది. ప్రతీక్ష మొదట మోటార్ సైకిల్ నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు వాహనాన్ని ఎలా ఆపరేట్ చెయ్యాలో నేర్చుకున్నారు. ఆమె మేనమామ మోటారు సైకిలు పై, చిన్న వయసులోనే దాన్ని నడపడం నేర్చుకుంది.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ఆమె 8 వ తరగతిలో ఉండగానే , కేవలం రెండు రోజుల్లో ప్రో వంటి బైక్ ను నడిపిందని, ఇది ఆమె కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.

ఆమె బస్సు డ్రైవర్ ఎలా అయ్యింది? అని అనుకొంటున్నారా. ప్రతీక్ష తన ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ (ఆర్.టి.ఓ) కావాలనుకుంది. ఆర్.టి.ఓ అవ్వాలంటే ఇండివిడ్యువల్ గా హెవీ వెహికల్ లైసెన్సు పొందాల్సి ఉంటుంది.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ఎలా డ్రైవ్ చేయాలో ఆమె నేర్చుకోవడానికి ఇది ఒక పరిపూర్ణ అవకాశంగా భావించింది. ఉద్యోగంలో కొనసాగడం ఆమెకు అంత ఈజీ కాదు. ఇంత పెద్ద వాహనాన్ని నియంత్రించే ఆమె సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు ఆమె ఎత్తును కూడా కామెంట్ చేశారు. అలాగే, ఆమె బస్సులో ఉన్న ఇతరులు తరచుగా ఆమె డ్రైవింగ్ చూసి ఆశ్చర్యపోయారు

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

అయితే, అలా౦టి సమస్యలను అధిగమిస్తూ, ఆమె వాటిని పూర్తిగా విస్మరిస్తూ, తన ఉద్యోగ౦ విషయ౦లో మౌన౦గా కొనసాగుతోంది. ప్రారంభంలో, ఆమె బస్సు తిప్పేటప్పుడు లేదా వీధులు తిరిగే సమయంలో కూడా సమస్యలను ఎదుర్కొంది, అయితే ఆమె నైపుణ్యాల్లో ప్రావీణ్యం ఉంది, ఆమె ఇప్పుడు క్రమం తప్పకుండా బస్సును డ్రైవ్ చేస్తోంది.

24 ఏళ్లకే బెస్ట్ బస్సు డ్రైవర్ గా మారిన మెకానికల్ ఇంజనీర్

ప్రతీక్ష కూడా మోటర్ సైకిల్ రేసర్ గా, ఆసియా రోడ్ రేసింగ్ ఛాంపియన్ షిప్ 2019 లో పాల్గొంది. హోండా, టీవీఎస్ వంటి బైక్ లతో ఆమె అనేక రేసుల్లో పాల్గొంది. గతంలో, ఆమె 2 టీవీఎస్ రేసింగ్ చాంపియన్షిప్ ట్రోఫీలను గెలుచుకుంది మరియు ప్రస్తుతం "ఫాస్టెస్ట్ ఫిమేల్ ఎట్ ఇండియా స్పీడ్ వీక్ డ్రాగ్ రేస్" అనే టైటిల్ హోల్డర్ గా ఉంది.

Most Read Articles

English summary
24 year old mechanical engineer becomes Mumbai’s first woman bus driver. Read in Telugu.
Story first published: Thursday, July 11, 2019, 14:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X