సొంత డబ్బుతో అతిచిన్న వయసులో రోల్స్ రాయిస్ కారు కొన్న యువకుడు.. దీని రేట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..!
కలలు అందరు కంటారు. కానీ కొంతమంది మాత్రమే వాటిని నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే 'కృష్ణ అరోరా'. ఇతని పేరు చెప్పగానే పెద్ద వయస్సు గల వాడు అని అనుకున్నారా.. కానీ కాదు. ఇతని వయస్సు కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. ఈ యువకుడు ఒక వ్యాపారవేత్త. కృష్ణ అరోరా మోటివేషనల్ స్పీకర్, నెట్‌వర్క్ మార్కెటర్, లీడర్‌షిప్ కోచ్, అలాగే 'అచీవర్స్ క్లబ్' వ్యవస్థాపకుడు. ఈ యువ పారిశ్రామిక వేత్తకు ఎప్పటి నుంచో ఖరీదైన రోల్స్ రాయిస్ కారుని కొనుగోలు చేయాలని ఉండేది. దాని కోసం ఎంతో కష్టపడి సొంత డబ్బులతో తాజాగా తన డ్రీమ్ కారును కొనుగోలు చేశాడు. ఒక యువకుడు 25 ఏళ్ల వయసులో అత్యంత ధనవంతులు, పెద్ద వ్యాపారవేత్తలు కొనుగోలు చేసే ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసి కృష్ణ అరోరా ఇప్పుడు వార్తల్లో నిలిచాడు.
తన సొంత డబ్బుతో రోల్స్ రాయిస్ లగ్జరీ కారును కొనుగోలు చేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా ఆ యువకుడు ఖ్యాతి గడించాడు. సాధారణంగా రోల్స్ రాయిస్ అందరికీ కార్లను విక్రయించదు. సాధారణ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయలేరు. కంపెనీ తన కారును ప్రముఖ సెలబ్రిటీలు,క్రికెటర్లు, ధనవంతులు సమాజంలో స్టేటస్ కలిగిన వారికి మాత్రమే విక్రయిస్తుంది. అలాంటిది ఒక 25 ఏళ్ల యువ వ్యాపారవేత్తకు అందించడం పెద్ద విశేషం.

కృష్ణ అరోరా రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారును కొన్నాడు. ఇటీవల దుబాయ్‌లోని షోరూమ్‌లో తన తండ్రి, తల్లితో కలిసి ఈ కొత్త కారు డెలివరీని అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కృష్ణ అరోరా స్వయంగా తన యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేయగా, ఇప్పుడు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అతి పిన్న వయసులో సొంత డబ్బులతో ఖరీదైన కారును కొనడంపై నెటిజన్లు అతనికి సెల్యూట్ చేస్తున్నారు.
అతి చిన్న వయసులోనే కొత్త రోల్స్ రాయిస్ కారును అందుకున్నందుకు అతని తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. ఇదిలా ఉంటే యువ వ్యాపారవేత్త బ్లాక్ కలర్ ఘోస్ట్ కారును కొన్నాడు. దీని ధర రూ.6.95 కోట్ల నుంచి రూ.7.95 కోట్ల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. కృష్ణ అరోరా ఈ కారు ఇంటీరియర్‌ను తన అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేయించాడు. ఈ కారును చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్లుగా ఉంది.

కృష్ణ అరోరా కొన్నటువంటి రోల్స్ రాయిస్ ఘోస్ట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.. ఇది 6.75-లీటర్ ట్విన్ టర్బో V12 పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ అత్యధికంగా 571 ps పవర్, 850 nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే దీనిలో 8 స్పీడ్ ఆటోమెటిక్ గేర్‌బాక్స్‌ను ఐచ్చికంగా అందించారు. ఇది లీటర్‌కు దాదాపు 6.33 కి.మీల వరకు మైలేజ్‌ను ఇస్తుంది.
కొత్త రోల్స్ రాయిస్ ఘోస్ట్ కేవలం 4.8 సెకన్లలో 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కి.మీగా ఉంటుంది. ఈ లగ్జరీ కారులో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఇది ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. దూర ప్రాంతాల పర్యటన కోసం ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి ఈ కారులో 490-లీటర్ కెపాసిటీ గల స్పేస్ కూడా ఉంది.

కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ప్రయాణికుల భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సెంట్రల్ లాకింగ్, హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 1300W ఆడియో సిస్టం ఇంకా మరిన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో రోడ్డుపై వెళ్తుంటే అందరి చూపు దీనిపైనే ఉంటుంది.


Click it and Unblock the Notifications








