ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘనలో మహిళ రికార్డు.. ఏకంగా 270 చలాన్లు, పోలీసులు షాక్‌.!!

ట్రాఫిక్‌ నిబంధనలు(Traffic rules Violations) ఉల్లంఘిస్తే పోలీసులు జరిమానాలు విధించడం షరా మామూలే. అయితే సాధారణంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ఇలా చలాన్లు చూసి ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే కొందరిపై పదుల కొద్దీ జరిమానాలు ఉంటాయి. కాగా ఈ కేసుల్లో ఎక్కువగా యువకులే కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి అందరికీ షాక్‌ ఇచ్చింది.

ట్రాఫిక్‌ నిబంధనల కేసు(Traffic Challans On Woman)లో ఓ యువతిపై పది కాదు ఇరవై కాదు ఏకంగా 270 చలాన్లు ఉన్నాయి. ఈ చలాన్ల పేరిట ఏకంగా ఆమెపై రూ. 1.36 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. ఓ మహిళపై ఇన్ని వందల జరిమానాలు ఉండటంతో పోలీసులు అవాక్కవుతున్నారు.

Traffic-Rules-Violations-On-Woman

రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్లలో మరణాల తీవ్రతలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలు ఎక్కువగా కారణాలవుతున్నాయి. ఈ క్రమంలో ట్రాఫిక్ ఉల్లంఘనల సంఖ్యను తగ్గించేందుకు ట్రాఫిక్‌ రూల్స్‌ను పాటించని వాహనదారులపై జరిమానాలు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో ఈ తరహా సంఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరైతే అదే పనిగా వందల సంఖ్యలో జరిమానాలకు పాల్పడుతున్నారు.

ఈ క్రమంలో బెంగళూరులో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ మహిళకు పోలీసులు దాదాపు 270 జరిమానాలు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ పెనాల్టీ ఛార్జీల మొత్తం విలువ రూ. 1.36 లక్షలు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. హోండా యాక్టివా స్కూటర్‌పై ఓ మహిళ వరుస ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతుండగా.. ఈ క్రమంలో ఆమెపై పోలీసులు భారీగా జరిమానా విధించారు.

Traffic-Rules-Violations-On-Woman

హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకపోవడం, ముగ్గురితో కలిసి ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు.. రాంగ్ రూట్‌లో కూడా ప్రయాణిస్తూ సీసీ కెమెరాలకు చిక్కింది. ఇందుకు సంబంధించిన సమాచారం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఒక మహిళపై ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే తొలిసారి అని సమాచారం.

అదే సమయంలో, భారత్‌లో గరిష్ఠ జరిమానాలు విధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. బెంగళూరుకే చెందిన ఓ హోండా యాక్టివా వినియోగదారు రూ. 3.04 లక్షల విలువైన ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో ఇలాంటి సంఘటనలు పోలీసులకు నిత్యం తలనొప్పిగా మారాయి. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ కొందరు ఇలా తరచూ ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఇలా ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి.

చలాన్లు ఉన్నప్పటికీ చాలా మంది రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ పోలీస్‌ శాఖ.. ట్రాఫిక్‌ చలాన్ల పేమెంట్లపై భారీగా డిస్కౌంట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతేడాది, ఈ ఏడాది ట్రాఫిక్‌ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం డిస్కౌంట్లు ప్రకటించడంతో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. కోట్లలో ఆదాయం సమకూరింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, April 13, 2024, 12:20 [IST]
English summary
270 traffic violations challans on bengaluru woman check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+