సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ ఉన్న కారులో చిక్కుకున్న మూడేళ్ల బాలుడు... చివరికి..!!
భారత్‌లో ఇటీవల కాలంలో అధునాతన సౌకర్యాలు, మెరుగైన భద్రతా ఫీచర్‌లతో కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని సమయాల్లో అధునాతన సౌకర్యాలు, భద్రతా ఫీచర్లు ఎంత ప్రయోజనం కలిగిస్తాయో కొన్నిసార్లు అంతే భయానక పరిస్థితులను సృష్టిస్తాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఇందుకు ఉదాహరణ.
కార్లలో చిన్నారులు చిక్కుకుపోవడం కొత్త విషయం కాదు. ఇలాంటి సందర్భాల్లో పాత తరం కార్లు అయితే చిన్నారులను రక్షించడం చాలా సులభం.. అవే అధునాతన భద్రతా ఫీచర్లు కలిగిన కార్లు అయితే నిర్ణీత సమయంలో చిన్నారులను బయటకు తీసుకురాకుంటే ఊహించని పరిణామాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా సెంట్రల్ లాకింగ్ వ్యవస్థ వచ్చాక.. ఇటువంటి ఘటనలు అధికం అవుతున్నాయి.

తాజాగా ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. వోక్స్‌వ్యాగన్ టి-రాక్ కారులో ఓ బాలుడు చిక్కుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లోని లుథియానాలో జరిగింది. కారు యాజమాని ఈ పరిస్థితిని భయంకర ఘటనగా పేర్కొన్నాడు. అందుకు సంబంధించి వివరాలను తన ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేశాడు.
లుథియానాకు చెందిన సుందర్‌దీప్ వోక్స్‌వ్యాగన్ టి-రాక్ కారును కలిగి ఉన్నాడు. సాయంత్రవేళలో తన భార్య, బిడ్డ కోసం ఎదురుచూస్తున్నాడు. అంతలో మరో కుమారుడు సుందర్‌దీప్ చేతిలో ఉన్న తాళాలు తీసుకొని కారులోపలికి వెళ్లాడు. అనంతరం కార్లు డోర్లు మూసుకున్నాడు. ఆ వాహనం సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను కలిగి ఉండడంతో అన్ని డోర్లు లాక్ చేయబడ్డాయి. కారు డోర్లు మూసుకుపోయినట్లు గుర్తించిన సుందర్‌దీప్ వెంటనే వాహనం వద్దకు వెళ్లాడు.

కారులోపల చిక్కుకుపోయిన తన కుమారుడితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కారు తాళానికి ఉన్న అన్‌లాక్ బటన్‌ను నొక్కాలని సూచించాడు. అయితే సుందర్‌దీప్ కుమారుడు గందరగోళానికి గురైయ్యాడు. ఏం చేయాలో తెలియక లాక్ బటన్‌ను ఎక్కువసార్లు నొక్కేశాడు. దీంతో కారులో ఉన్న భద్రతా అలారం మోగడం ప్రారంభించింది.
దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. కారులో ఉన్న బాలుడు ఏడవడం ప్రారంభించాడు. దీంతో స్థానికులు కారు చుట్టు చేరారు. సుందర్‌దీప్‌కు ఏం చేయాలని అర్థం కాలేదు. కాసేపు ఆలోచించి.. ఆ ప్రాంతానికి సమీపంలో టైర్ పంక్చర్ వేసే దుకాణం ఉందని గుర్తుచేసుకున్నాడు.

వెంటనే అందులో పనిచేసే వ్యక్తిని కారు అద్దాలు పగలగొట్టేందుకు స్లడ్జ్‌హామర్ తీసుకురావాలని కోరాడు. స్లడ్జ్‌హామర్‌తో చాలా సార్లు ప్రయత్నించి కారు అద్దాలను పగలగొట్టాడు. లోపలున్న కుమారుడు వద్ద నుంచి కారు తాళాలు తీసుకొని అన్‌లాక్ చేశాడు. వెంటనే కుమారుడిని బయటకు తీసుకొచ్చాడు. దీంతో కథ సుఖాంతం అయింది.
ఈ భయానక ఘటనకు సంబంధించిన వివరాలను ఫోటోలతో సహా సుందర్‌దీప్ తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అత్యవసర సమయాల్లో కారు అద్దాలను పగలగొట్టేందుకు, సీట్‌బెల్ట్ కట్ చేసేందుకు అవసరమైన పరికరాలను కారులో ఉంచానని, కానీ ఈ అత్యవసర సమయంలో పనికి రాలేదని తన ట్వీట్‌లో తెలిపాడు.
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కార్ల అద్దాలను పగలగొట్టడం చాలా కష్టం. అంత్యంత భద్రతను ఇవి కలిగి ఉంటాయి. భారత్‌లో ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి. విదేశాల తరహాలో కార్లలో చిన్నారులు, పెంపుడు జంతువులను విడిచిపెడుతున్నారు. అటువంటి సమయాల్లో AC పనిచేయకుంటే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది.
కారు అద్దాలను మూసివేసి, AC కూడా ఆఫ్ చేసి ఎండలో పార్కింగ్ చేస్తే.. గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్ కారణంగా.. కేవలం 10 నిమిషాల్లో కారులోపలి ఉష్ణోగ్రత 20 డిగ్రీలు పెరుగుతుంది. అనంతరం గంట సమయంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుతుంది. ఫలితంగా లోపల ఉన్నవారికి ఊపిరి అందని పరిస్థితి ఏర్పడుతుంది.
పెద్దవారితో పోలిస్తే చిన్నారుల శరీర ఉష్ణోగ్రత వేగంగా మారుతుంది. తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తిని చిన్నారులు కోల్పోతారు. అనంతరం హీట్ స్ట్రోక్‌కు గురవుతారు. కొన్నిసార్లు వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కారులోపల విడిచిపెట్టిన పెంపుడు జంతువులకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజ్‌మహల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో ఉన్న పెంపుడు కుక్క మరణించిన ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications








