38 ఏళ్లనాటి Hero Honda CD100 SS బైక్.. ఇప్పుడు ఎలా తయారుచేశారో చూశారా?

కొందరికి పాత వాహనాలలో ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంటుంది. అందువల్ల ఇటీవల కాలంలో పాత ప్రసిద్ధ చెందిన వాహనాలను రీమోడల్‌ చేస్తున్నారు. 1985 Hero Honda CD100 SS రీమోడల్‌ చేసిన బైక్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హీరో హోండా CD100 SS కారుకు భారత్‌ ఆటోమొబైల్‌ మార్కెట్‌లో ఓ చరిత్ర ఉంది. ఈ ఐకానిక్‌ బైక్‌ను రీమోడల్‌ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. క్లచ్‌ అండ్‌ గేర్‌ యూట్యూబ్‌లో ఈ వీడియోను అప్‌లోడ్‌ చేశారు. ఈ బైక్‌ను పూణేలో రీమోడల్‌ చేసినట్లు వీడియో ఆధారంగా తెలుస్తోంది.

hero honda cd 100 SS Bike

పాత హీరో హోండా CD100 SS బైక్‌ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. రీ మోడల్‌ చేసేందుకు నట్‌ అండ్‌ బోల్ట్‌ స్ట్రిప్‌ డౌన్‌ గ్యారేజీకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. తనకు కావాల్సిన విధంగా బైక్‌ను రీమోడల్ చేయాలని సిబ్బందిని కోరాడు. దీనికి అంగీకరించిన సిబ్బంది.. తొలుత బైక్‌ను విడిభాగాలుగా విడగొట్టారు. అనంతరం ఒక్కో విభాగాన్ని మెరుగుపరుస్తూ వచ్చారు.

ఇంజిన్‌, ఇంధన ట్యాంక్‌, ఛైన్‌ స్పాకెట్‌, హెడ్‌లైట్‌ సహా అన్నిభాగాలను మరమ్మతు చేశారు. అనంతరం బైక్‌లోని పెట్రోల్‌ ట్యాంక్‌కు అనేక రంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. కొత్త ఇంధన ట్యాంక్‌ కోసం ప్రయత్నించినా లభించకపోవడంతో రంద్రాలను మూసివేశారు. తర్వాత బైక్‌ అన్ని భాగాలకు పెయింట్‌ వేశారు. ఇందుకోసం యాజమానికి అనేక రంగులను పంపి, నచ్చినవి ఎంచుకోవాలని కోరారు. దీంతో యాజమాని క్లాసీ వెండి రంగుతో తన బైక్‌ పెయింటింగ్‌ చేయాలని కోరాడు.

hero honda cd 100 SS Bike

అయితే పాతతరం బైక్‌ కావడం వల్ల బైక్‌ స్టిక్కర్లు అందుబాటులో లేవని, అందుకే కొత్త స్టిక్కర్లను రూపొందినట్లు సర్వీస్‌ సెంటర్‌ సిబ్బంది తెలిపారు. అనంతరం నిపుణుడి సమయంలో బైక్‌ అన్ని భాగాలను అమర్చారు. ఇంజిన్‌, కార్బ్యురేటర్‌ మినహా మిగిలిన బైక్‌ భాగాలు అన్ని కొత్తవే ఎంచుకున్నట్లు గ్యారేజీ సిబ్బంది చెబుతున్నారు.

బైక్‌కు కొత్త టైర్లు, సహా రిమ్‌ను కూడా అమర్చారు. ప్రతి క్రోమ్‌ ఎలిమెంట్‌ కొత్తగా కనిపించేలా రీక్రోమ్‌ చేయబడింది. అనంతరం యాజమానికి పంపించారు. అయితే బైక్‌ చూసిన ఎవరైనా.. హీరో హోండా CD100 SS బైక్‌ల ఉత్పత్తిని సంస్థ మళ్లీ ప్రారంభించిందా అనే సందేహం కలగక మానదు. నట్‌ అండ్‌ బోల్ట్‌ గ్యారేజీ సిబ్బంది మెరుగైన పనితీరును కనబరిచారు.

hero honda cd 100 SS Bike

Hero Honda CD100 SS బైక్‌ 97.20cc ఇంజిన్‌ను కలిగి ఉండేది. 8000 rpm వద్ద 7.5bhp శక్తి, 5000 rpm వద్ద 7.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను కలిగి ఉండేది. ఈ బైక్‌ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 12.80 లీటర్లుగా ఉండేది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 8, 2023, 17:24 [IST]
English summary
38 year old hero honda cd 100 ss bike restored video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+