ఇక ఈ కార్లకు 40 శాతం జీఎస్టీ.. కానీ ధరలు పెరగవు ? ఎందుకో తెలుసా?
భారతదేశంలో వాహనదారులకు గుడ్ న్యూస్. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ పన్ను విధానంలో భారీ మార్పులు రాబోతున్నాయి. చిన్న కార్లు, బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉండగా.. పెద్ద,లగ్జరీ కార్లపై 40 శాతం పన్ను విధించనున్నారు. అయితే, ఈ 40 శాతం పన్ను కూడా చాలామందికి లాభదాయకం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఏ వాహనాలకు ఎంత పన్ను వర్తిస్తుంది, దీని వల్ల ధరలు ఎలా మారతాయో ఇప్పుడు చూద్దాం.
జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ప్రకారం, సెప్టెంబర్ 22 నుంచి భారతదేశంలో జీఎస్‌టీ (GST) నిబంధనలు మారనున్నాయి. దీనిలో భాగంగా చిన్న కార్లు, బైక్‌లపై జీఎస్‌టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అయితే, పెద్ద కార్లకు 40% పన్ను విధించనున్నట్లు ప్రకటించారు. 40% పన్ను అంటే ధరలు పెరుగుతాయని చాలామంది అనుకుంటున్నారు. కానీ నిజానికి చాలా కార్ల ధరలు తగ్గుతాయి.

ఈ కొత్త పన్ను విధానం ప్రకారం, 1200 సీసీ, 4000 మి.మీ కంటే ఎక్కువ పొడవు ఉన్న పెట్రోల్ కార్లు, 1500 సీసీ, 4000 మి.మీ కంటే ఎక్కువ పొడవు ఉన్న డీజిల్ కార్లు, అలాగే 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లపై 40% పన్ను వర్తిస్తుంది.
ఏ కార్లకు 40% జీఎస్‌టీ?
కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని రకాల కార్లకు 40% జీఎస్‌టీ వర్తిస్తుంది. పెట్రోల్, పెట్రోల్ హైబ్రిడ్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లలో ఇంజిన్ కెపాసిటీ 1200 సీసీ కంటే ఎక్కువగా ఉంటే, పొడవు 4000 మిమీ కంటే ఎక్కువగా ఉంటే వాటిపై 40% పన్ను ఉంటుంది. అలాగే, డీజిల్, డీజిల్ హైబ్రిడ్ కార్లలో ఇంజిన్ కెపాసిటీ 1500 సీసీ కంటే ఎక్కువగా ఉంటే, పొడవు 4000 మిమీ కంటే ఎక్కువగా ఉంటే వాటిపై కూడా 40% పన్ను ఉంటుంది.

ప్రస్తుత పన్నులు vs కొత్త పన్నులు
ఇప్పటివరకు పెద్ద కార్లపై 28% జీఎస్‌టీతో పాటు 22% వరకు సెస్ పన్ను కూడా ఉండేది. మొత్తం మీద 50% వరకు పన్ను పడేది. కొత్త నిబంధనల ప్రకారం సెస్ పన్నును తీసేసి, జీఎస్‌టీని 40%కి మార్చారు.
అంటే, ప్రస్తుతం 50% పన్ను చెల్లిస్తున్న కారుకు, ఇకపై కేవలం 40% పన్ను మాత్రమే కట్టాలి. దీనివల్ల దాదాపు 10% పన్ను తగ్గుతుంది. అందుకే చాలా పెద్ద కార్ల ధరలు తగ్గుతాయి.

ఏ కంపెనీల కార్లు ఈ జాబితాలో ఉన్నాయి?
40% జీఎస్‌టీ పన్ను జాబితాలో కొన్ని ప్రముఖ కంపెనీల కార్లు ఉన్నాయి. మారుతి గ్రాండ్ విటారా, విక్టోరియస్, ఎర్టిగా, ఇన్విక్టో, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, రూమియన్, ఇన్నోవా, ఫార్చ్యూనర్ వంటి వాటి ధరలు తగ్గుతాయి.
అలాగే టాటా హారియర్, సఫారి, మహీంద్రా స్కార్పియో, ఎక్స్‌యూవీ700, హ్యుందాయ్ క్రెటా, అల్కజార్, కియా సెల్టోస్, కేరెన్స్ వంటి కార్ల ధరలు కూడా తగ్గుతాయి. ఈ పన్ను మార్పులు లగ్జరీ కార్ల ధరలను కూడా కొంత వరకు తగ్గించగలవు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








