2022 బడ్జెట్‌లో రైతులకు అండగా 400 వందే భారత్ ట్రైన్లు
కేంద్ర ఆర్థిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ఎట్టకేలకు 2022 బడ్జెట్‌ను విడుదల చేశారు. దేశ ప్రయోజనాల కోసం, వివిధ రంగాల్లో డిజిటలైజేషన్‌ను ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ బడ్జెట్ ఉందని పలు వర్గాల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్‌లో ప్రకటించిన ప్రాజెక్టులన్నీ దాదాపు దిగ్విజయంగా పూర్తవుతాయన్న అంచనాలు ప్రజల్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా రైల్వే శాఖ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. వచ్చే మూడేళ్లలో 400 కొత్త వందే భారత్ ట్రైన్లను తయారు చేస్తామని వెల్లడించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ప్రాజెక్టు కింద అందుబాటులోకి రానున్న ఈ ట్రైన్‌లు ఎనర్జీ ఎఫీషియెంట్‌గా ఉంటాయని తెలిపారు. 'వన్ స్టేషన్- వన్ ప్రోడక్ట్' విధానంతో ఈ ట్రైన్‌ల ద్వారా రైతులు, చిన్న వ్యాపారులకు చాలావరకు అండగా ఉంటుందని కూడా తెలిపారు. ఈ ట్రైన్లు తక్కువ ఇంధనంతో నడిచేవిగా రూపొందించబడతాయి.

ఇవన్నీ కూడా దాదాపు 2000 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నాయి. ఇందులో వినియోగదారులకు కావాల్సినన్ని సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. దీనికి కావలసిన సేఫ్టీ కెపాసిటీ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. అదే విధంగా వచ్చే మూడేళ్లలో 100 కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

ప్రస్తుతం భారతదేశంలో రైల్వే పార్శిల్ రంగం కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉంది. అయితే దీనిని మరింత విస్తరించడానికి ఇప్పుడు 2022 బడ్జెట్ ప్రతిపాదనలు ఎంతగానో ఉపయోగపడతాయి. దేశంలో పెద్ద కంపెనీలకు అతీతంగా దేశంలోని ప్రధాన నగరాల్లోని ప్రతి ప్రాంతంలోని చిన్న వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను రైలులో తీసుకెళ్లేలా ప్రోత్సహించేందుకు "వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్" ప్రాజెక్ట్ రూపొందించబడింది.

వీటితోపాటు రైల్వే ద్వారా పోస్టల్ పార్సిల్ సేవలనూ అందిస్తామని చెప్పారు. తద్వారా కొత్త బిజినెస్ ఏరియాలకు ఈ సేవలు గణనీయంగా ఉపయోగపడుతాయని దీనిద్వారా తెలిపారు. కావున త్వరలో పోస్టల్ సేవల కోసం రైల్వేలనూ ఉపయోగించనున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. పీఎం గతి శక్తి కింద ఈ భారీ ప్రణాళిక ఉందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.

భారతదేశంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రైన్లను స్టీల్‌తో తయారు చేశారు. అయితే ఈ వందే భారత్ రైళ్లను లైట్ వెయిట్ అల్యూమినియంతో తయారు చేయనున్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. తద్వారా రైల్వే కోచ్‌లను భారత సంప్రదాయంగా ఉపయోగిస్తున్న స్టీల్‌ను పక్కన పెట్టి అల్యూమినియం లోహాన్ని వినియోగించనుంది. స్టీల్ కంటే ఈ అల్యూమినియం ద్వారా కోచ్‌లను తయారు చేయడం ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని.

వందే భారత్ కింద అందుబాటులోకి రానున్న ట్రైన్లు 16 కోచ్‌లను కలిగి ఉంటాయి. అంచనాల ప్రకారం ఈ 16 కోచ్‌ల తయారీకి సుమారు రూ. 106 కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అందులోనూ ఇప్పుడు లైట్ వెయిట్ అల్యూమినియంతో 16 కోచ్‌ల సెట్‌ను తయారు చేయడానికి అదనంగా మరో రూ. 25 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు.

ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే స్టీల్ కోచ్ కంటే కూడా ఈ అల్యూమినియం కోచ్‌ల వల్ల ఇందన వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ట్రైన్ తయారీకి ఖర్చు ఎక్కువ అయినప్పటికీ, వాటిని వినియోగించడానికి ఖర్చు మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పటికి పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కరోనా సంక్షోభ సమయంలోనూ బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నామని, కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

ప్రస్తుతం వెలువడిన ఈ ప్రణాళికల ప్రకారం 2023 ఆగస్ట్ 15 నాటికి కనీసం 75 రూట్లలో వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. గత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో 2023 నాటికి దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ 75 వందేభారత్ రైళ్లను తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి.

కావున రైతుకు మరియు ఇతర సర్వీసులకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయి, దేశ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా లేదా అనే విషయాలు త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications