కార్లలో ఈ ఫీచర్లు చాలా ఫేమస్.. అయినా కానీ ఉపయోగించరు.. ఎందుకో తెలుసా..?
నేడు మార్గెట్ లో లభిస్తున్న ఆధునిక కార్లలో యుటిలిటీ, కంఫర్ట్, అదనపు సేఫ్టీ ఫీచర్‌లతో పాటు అనేక రకాల ఆప్షన్లతో వస్తున్నాయి. అయితే కొన్ని ఫీచర్లు కార్లలో అందుబాటులో ఉన్నప్పటికీ మనం ఉపయోగించము. ఆధునిక కార్లలో కనీసం ఉపయోగించకుండా ఉన్న టాప్ 5 ఫీచర్ల జాబితా మీకోసం..
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కార్ల కంపెనీలు అధునాతన ఫీచర్లను అందిస్తున్నాయి. ప్రస్తుతం కార్లలో ఉన్న ఫీచర్లను చాలామంది ఉపయోగించుకోవడం లేదు. కొందరికి వాటిపై కనీస అవగాహన కూడా లేదు. డ్రైవర్లు కొన్ని సందర్భాల్లో వీటిని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.

వాయిస్ కమాండ్స్..
ఈ ఫీచర్ చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్న కార్లలో అందుబాటులో ఉన్నప్పటికీ ఎవరూ ఉపయోగించుకోవడం లేదు. వినోదభరితమైన ఫీచర్లను ఆపరేట్ చేసేందుకు వీటిని ఎక్కువగా వాడుకోవచ్చు. వాయిస్ నుంచి ఇచ్చే కమాండ్స్ తో త్వరగా పాటలు ప్లే చేయడం, ఇతర ప్రతిస్పందనలను త్వరగా మానిటర్ చేయవచ్చు. ఈ ఫీచర్ ఊహించిన విధంగా పని చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది కారులో అతి తక్కువగా ఉపయోగించే ఫీచర్‌లలో ఒకటిగా ఉంది.

టచ్ ఆప్షన్స్..
ఆధునిక కార్లలో అతి తక్కువ ఉపయోగించే మరో కార్ ఫీచర్ టచ్(గెస్టర్) ఆప్షన్. ఈ సాంకేతికత కూడా చాలా పాతది. కానీ దీనిని అతి తక్కువగా ఉపయోగిస్తున్నారు. కారులోని సిస్టమ్‌ను చేతితో సంజ్ఞలు చేయడం ద్వారా రిజల్ట్ ని పొందవచ్చు. చాలా సందర్భాలలో క్యాబిన్ లోపల చేతి కదలిక ద్వారా కారును ఆపరేట్ చేయవచ్చు. చాలా మంది వ్యక్తులు దీనిని వాడుకోవడం లేదు. ఈ ఫీచర్ సౌలభ్యం కంటే ఎక్కువ అసౌకర్యాన్ని కలిగించే అవకాశం ఉన్నందున తక్కువగా వాడుకలో ఉంది.

ఆటోమేటిక్ హెడ్‌లైట్స్..
దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ఈ ఫీచర్‌ని మన దేశంలోకి తీసుకువచ్చారు. అయితే దీనిని పూర్తి స్థాయిలో ఎవరు వాడుకోవడం లేదు. భారతదేశంలో తయారవుతున్న కార్లలో ఆటో హెడ్‌ల్యాంప్స్ ఫంక్షన్ ఇప్పటికి అందుబాటులో ఉంది. కారులోని డ్యాష్‌బోర్డ్ చివర ఉంచబడిన లైట్ సెన్సార్‌తో ఇది పనిచేస్తుంది.
ముందుగానే సెట్ చేసిన విధంగా ఆటోమేటిక్ గా హెడ్‌ల్యాంప్‌లను ఆన్, ఆఫ్ చేస్తుంది. వెలుపలి ఉన్న కాంతి ద్వారా హెడ్ లైట్స్ ఆన్ అవుతాయి. చాలా మంది కార్ల యజమానులు తమ కార్లపై ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ గురించి తెలీదు. అయినా కారులోని ఉన్న మాన్యువల్ ఆప్షన్లను ఉపయోగించడానికే ఎక్కువగా ఇష్టపడతారు.

ప్రిలోడెడ్ మ్యాప్..
చాలా మంది తయారీదారులు తమ ఆధునిక కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో ప్రీలోడెడ్ మ్యాప్‌ను అప్ లోడ్ చేయవచ్చు. ఈ ప్రీలోడెడ్ మ్యాప్‌లు Google మ్యాప్స్‌తో సరిపోలక పోవడం వల్ల దీనిని చాలా మంది ఉపయోగించడం లేదు. ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో వంటి స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌లతో, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లలోని మ్యాప్స్ ను ఎక్కువగా వాడుతున్నారు.

హీట్ స్టీరింగ్..
భారత మార్కెట్లో ప్రీమియం సెక్షన్ కార్లలో హీటెడ్ స్టీరింగ్ వీల్స్ రిజర్వ్ చేయబడ్డాయి. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ ఫీచర్ ను వాడుకోవచ్చు. ఇది డ్రైవర్ కి కలిసిరానుంది. భారతీయ వాతావరణాలను తట్టుకునేలా స్టీరింగ్ వీల్ ఆధునిక కార్లలో ఉంటుంది. ఈ ఫీచర్ గురించి చాలా మందికి తెలీదు. ఇలా చాలా ఫీచర్లను మనం ఉపయోగించము. కారు తీసుకునే క్రమంలో బ్రౌచర్ లోని పూర్తి వివరాలు తెలుసుకుని అధునాతన ఫీచర్లను వాడుకోండి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








