రూ. కోటి విలువైన ఈవీ పరికరాల దొంగతనం.. ఎంతకు అమ్మారో తెలిస్తే నోరెళ్లబెడతారు.!!

ఈజీ మనీ ధ్యేయంగా రూ. కోటి విలువైన ఎలక్ట్రిక్‌ వాహనాల పరికరాల చోరీకి పాల్పడ్డారు కొందరు దుండగులు. వీరి వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు(Robbery In Electric Vehicle Charging Stations). వీరి వయసు కేవలం 8 నుంచి 11 ఏళ్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్‌ కూడా ఉంది. అదేంటంటే..

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(Electric Vehicles In India) వినియోగం పెరుగుతోంది. ఇందుకు అనుగుణంగా ఈవీ సెగ్మెంట్‌లో అనేక స్టార్టప్‌లు సైతం పుట్టుకొచ్చాయి. ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారుచేస్తున్నాయి. మేక్‌ ఇన్‌ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీలు విస్తరించాయి.

Boys-Committed-Theft-At-EV-Charging-Stations

భారత్‌లో ఈవీ(Electric Vehicles)లకు అలాంటి డిమాండ్‌ ఉంది. ఈ వాహనాల ధర ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ స్కూటర్ల ధర రూ. 50 వేల పైనే ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈవీల తయారీకి వాడే ముడి సరుకు ధర కూడా లక్షల్లోనే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో చండీగఢ్‌లోని ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్లలో భారీ దొంగతనానికి పాల్పడ్డారు ఐదుగురు చిన్నారి దొంగలు.

చండీగఢ్‌లో త్వరలో ప్రారంభించబోయే ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల నుంచి రూ. కోటి విలువైన ఈవీ పరికరాలను దొంగిలించారు. ఐదుగురు 8 నుంచి 11 ఏళ్ల మధ్య వయస్సు గల అబ్బాయిలే కావడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ ఖరీదైన పరికరాలను ఇద్దరు స్క్రాప్‌ డీలర్లకు విక్రయించారు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. రూ. కోటి విలువైన ఈ పరికరాలను కేవలం రూ. 6000 కు అమ్మేశారు.

Boys-Committed-Theft-At-EV-Charging-Stations

ఎలక్ట్రిక్ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల(Electric Vehicle Charging Stations)లో చోరీ సంగతి పోలీసుల దృష్టికి చేరడంతో విచారణ చేపట్టారు. ఈ బాలురు మాల్‌ను విక్రయించిన ఇద్దరు స్క్రాప్‌ డీలర్ల అరెస్ట్‌తో ఈ కేసును ఛేదించారు. వారిపై కేసు నమోదు చేశారు. దొంగతనానికి పాల్పడిన వారు మైనర్లు కావడంతో వారిని కౌన్సిలింగ్‌కు పంపించారు.

చోరీ చేసిన వస్తువుల్లో ఏడు మదర్‌బోర్డులు, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు, ఎలక్ట్రిక్ మీటర్లు, ఇనుప కవర్లు మరియు ఛార్జర్‌లు ఉన్నాయి. బాలురు చాలా చిన్నవారు కాబట్టి వారిని జువైనల్ హోంలో ఉంచలేమని పోలీసులు పేర్కొన్నారు. పోలీసుల సిఫారసుపై వారిని పాఠశాలలో చేర్పించనున్నారు. ఈ మేరకు బాలుర తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్లు డీఎస్పీ చరణ్‌జిత్‌ సింగ్‌ విర్క్‌ పేర్కొన్నారు.

Boys-Committed-Theft-At-EV-Charging-Stations

కాగా ఈ చోరీ ఘటన సెక్టార్ 42 లేక్ మరియు పామ్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన EV ఛార్జింగ్ స్టేషన్‌లలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ చోరీ ఘటనలో స్క్రాప్‌ డీలర్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. టెక్నాలజీ సాయంతో వీరు ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా వెల్లడైంది.

సీసీ కెమెరాల సాయంతో పోలీసులు నిందితులను గుర్తించగలిగారు. చోరీ సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో బాలురు.. భోజనం చేసేవారని పోలీసులు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన రూ. లక్షల విలువైన సొత్తును కేవలం రూ. 150 నుంచి రూ. 200 మధ్య విక్రయించేవారని విచారణలో వెల్లడైంది.

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2024, 18:17 [IST]
English summary
5 minor boys committed theft equipments at ev charging stations in chandigarh worth rs 1 crore
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+