ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

Written By:

విమానం కూలిపోయిందనే వార్త వినగానే గుండెల్లో ఏదో భారంగా అనిపిస్తుంది. 100 మంది వెళుతున్న విమానం కూలిపోయిందనే వార్త వినగానే అందులో మన సంబంధీకులు లేకున్నా కూడా కళ్లెమ్మట నీళ్లు తిరగడం ఖాయం. విమానయానం రంగం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతున్నప్పటికీ విమాన ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

అసలు విమానాలు కూలిపోవడానికి గల అతి ముఖ్యమైన మరియు మెయిన్ రీజన్స్ ఏంటి అనే దాని గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ఆరా తీసారా....? ఇవాళ్టి విమానాలు సెక్షన్ ద్వారా ప్లేన్ క్రాష్ కు కారణమయ్యే అతి ముఖ్యమైన రీజన్స్ తెలుసుకుందాం రండి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

2016 డిసెంబర్ నెలలో మాత్రమే ఐదు విమాన ప్రమాదాలు జరిగాయి. తాజాగ 84 మంది సైనికులతో వెళుతున్న రష్యా విమానం కుప్పకూలిపోయింది. భారీ స్థాయిలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా వీటన్నింటికి కూడా కేవలం ఐదు మాత్రమే ముఖ్య కారణాలుగా ఉన్నాయి.

http://www.planecrashinfo.com/

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

ప్రతి విమాన ప్రమాదం అనంతరం ఇన్వెస్టిగేషన్ అధికారులు అందించే నివేదికలో పైలట్ నిద్రలేమి కారణం, ఎక్కువ ఎత్తులో సిగ్నల్స్ అందకపోవడం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపం ఇలా ఏదో ఒక కారణం చెప్పి ఫైల్ క్లోజ్ చేస్తుంటారు.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

విమాన ప్రమాదాలను నివారించడానికి చాలా వరకు ఎయిర్ లైన్స్ సంస్థలు ఈ అంశాల పరంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తుంటాయి.

1. పైలట్ తప్పిదం

1. పైలట్ తప్పిదం

ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రమాదాల్లో సగానికి పైగా పైలట్ల తప్పిదం ద్వారానే జరుగుతున్నాయి. గణాంకాల ప్రకారం ఈ కారణం చేత జరిగే ప్రమాదాల రేటు అధికంగా ఉంది. ముఖ్యంగా పైలట్లలో ఆత్మస్థైర్యం లేకపోవడం. ప్రమాదాకర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాలు, సాంకేతిక లోపాలను నివారించడంలో విఫలం చెందడం, ల్యాండింగ్ మరియు టేకాఫ్ సమయంలో జరిగే తప్పిదాల వలన ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

అనుభవ లేమి మరియు సైకలాజికల్ సమస్యల ద్వారా కూడా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. విమానం నడుపుతున్న సమయాల్లో ఎదురయ్యే క్రిటకల్ సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం చెందడం మరియు మానసిక సమస్యలతో భాదపడే వారు విమానాలను ప్రమాదాల పాలు చేస్తుంటారు (మానసిక సమస్యత భాదపడిన పైలట్ ఇంజన్ ఆఫ్ చేయడం ద్వారా 1987 లో టోక్యోలో విమాన ప్రమాదం జరిగింది).

02. మెకానికల్ దోషాలు

02. మెకానికల్ దోషాలు

విమాన ప్రమాదానికి కారణమయ్యే రెండవ ముఖ్య దోషం మెకానికల్. ఇప్పటి వరకు జరిగిన మొత్తం ఏవియేషన్ ప్రమాదాల్లో 22 శాతం వరకు మెకానికల్ సమస్యల ద్వారా సంభవించాయి. సమస్యాత్మక వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు పైలట్ తీసుకునే తప్పు నిర్ణయాలు కూడా విమాన ప్రమాదానికి కారణమవుతున్నాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

విమానంలోని ఇంజన్‌లు రెండు ఫెయిల్ కావడం, సాంకేతిక వ్యవస్థలు పనితీరు పూర్తిగ స్తంభించిపోవడం కూడా కారణమవుతున్నాయి. చిన్న చిన్న పక్షులు ఇంజన్‌లోకి దూసుకెళ్లి సాంకేతిక లోపాన్ని సృష్టించడం ద్వారా కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

03. వాతావరణం

03. వాతావరణం

ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల్లో వాతావరణం అనుకూలించకపోవడం వలన 12 శాతం ప్లేన్ క్రాషెస్ సంభవించాయి. ఇందుకు దివంగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని ఒక ఉదాహరణంగా తీసుకోవచ్చు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా ప్రమాదాలు సంభవిస్తాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

ప్రతికూల వాతావరణంలో భాగంగా భారీ ఉరుములు, మెరుపులు, తుఫాన్, వీపరీతమైన గాలుల వంటివి కూడా విమాన ప్రమాదానికి కారణమవుతున్నాయి.

04. విధ్వంసం

04. విధ్వంసం

ప్రతి విమానం ప్రమాదాన్ని మీడియా వెంటనే ధ్వంసం క్రింద చిత్రీకరిస్తుంది. కాని ఇలాంటి ప్రమాదాలు కేవలం 9 శాతం వరకు మాత్రమే చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా విమానాలను హైజాక్ చేయడం ద్వారా జరుగుతున్నాయి. ఇందుకు అక్టోబర్ 11 ఒక పెద్ద ఉదాహరణగా చెప్పచ్చు.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

టెర్రరిస్టులు ఇందుకు నాయకత్వం వహిస్తూ ఫలానా ప్రమాదానికి మేమే కారణం అంటూ ప్రకటనలు కూడా చేస్తుంటాయి. టెర్రరిస్టుల ద్వారానే కాకుండా ఆత్మహత్య చేసుకోవాలనే వారు మరియు మానసికంగా భాదపడే వారు తాము ప్రయాణిస్తున్న విమానాన్ని పేల్చేయడానికి ప్రయత్నించడం ద్వారా కూడా విమానాలు ధ్వంసమవుతాయి.

05. ఇతర మానవ తప్పిదాలు

05. ఇతర మానవ తప్పిదాలు

వివిధ రకాల కారణాలతో సంభవించే విమాన ప్రమాదాలు 7 శాతంగా ఉన్నాయి. వీటికి వివిధ రకాల మానవ తప్పిదాలే ముఖ్య కారణాలని చెప్పవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ ఇచ్చే తప్పుడు సమాచారం, సూచనల ద్వారా విమానం పర్వతాలను ఢీ కొనడం, గాలిలోనే పేలిపోవడం వంటివి జరుగుతున్నాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

విమానాల నిర్వహణలో లోపం కారణాలు కూడా మానవ తప్పిదాల క్రిందకే వస్తాయి. ఇంధనం, లోడింగ్ మరియు ఇతర నిర్వహణల్లో అలసత్వం వహించడం కూడా ముఖ్యకారణాలు. కొన్ని సార్లు విమానాన్ని గాలిలోనే చక్కర్లు కొట్టించినపుడు ఇంధన పూర్తిగా అయితే కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

ఇంత వరకూ చూసిన కారణాలను గమనిస్తే విమానం ప్రమాదం చిన్న పక్షి నుండి మానవ మృగాలైన టెర్రరిస్టుల వరకూ ఏదో ఒక కారణం చేత జరగవచ్చు. ఇలాంటి వాటిని ఆపడం దాదాపుగా అసాధ్యమే. కాబట్టి నమ్మకం మీద వెళుతూ ఉండాలి.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

మృదువైన పక్షి ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు...దీని వెనకున్న అసలు మర్మమేంటి...!!

కేవలం ఒక చిన్న పక్షి ఢీ కొనడం వలన పెద్ద పెద్ద విమానాలు కూలిపోతున్నాయి ఎందుకు? ఇది మనందరికి ఒక సాధారణ ప్రశ్నగా ఉండవచ్చు. అవును చిన్న పక్షులు ఢీ కొనడం వలన కూలిపోయిన విమానాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఈ రోజు దీనికి సంభందించి ఎన్నో ప్రశ్నలు మొదలవుతున్నాయి. అయితే దీని వెనుకున్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

ప్లేన్ క్రాష్‌కు కారణమయ్యే కామన్ కారణాలు

లేజర్ కాంతి పడితే విమానాలు కూలిపోతాయా...? ఎంత వరకు నిజం...!!

భయంకరమైన లేజర్ భీమ్ అట్టాక్: కొత్త ముప్పు ఎదుర్కొంటున్న పైలట్ మరియు ప్రయాణికులు

 
English summary
5 Most Common Causes of Plane Crashes
Story first published: Tuesday, December 27, 2016, 16:43 [IST]
Please Wait while comments are loading...

Latest Photos