ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు: ఇండియన్ ఆర్మీ

రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతమైన శక్తిసామర్థ్యాలు మరోమారు బుుజువయ్యాయి. ఒక్క బైకు మీద 58 మంది సైనికులు కిలోమీటర్ పాటు ప్రయాణించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

By Anil

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అద్భుతమైన పనితీరుకు పెట్టింది పేరు. పవర్ మరియు టార్క్ విషయంలో దీనికి అడ్డొచ్చే మోడల్ గానీ పోటీనిచ్చే మోడల్‌గానీ లేదని చెప్పవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ అద్భుతమైన శక్తిసామర్థ్యాలు మరోమారు బుుజువయ్యాయి. ఒక్క బైకు మీద 58 మంది సైనికులు కిలోమీటర్ పాటు ప్రయాణించి ప్రపంచ రికార్డును నెలకొల్పారు.

ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

ఈ చారిత్రాత్మక రికార్డును బెంగళూరులో ఉన్న యలహంక ఎయిర్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో నవంబరు 19 న జరిగింది. ఇందులో పాల్గొన్నవారిని టోర్నడోస్ అని పిలుస్తారు. మేజర్ బన్నీ శర్మ ఆధ్యక్షతన సుబేదార్ రాంపాల్ సింగ్ బైకును నడిపారు.

Recommended Video

[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

మొత్తం 58 మంది ఇండియన్ ఆర్మీ సైనికులు బైకు మీద సుమారుగా 1200 మీటర్ల మేర ప్రయాణించారు. ఈ రికార్డుతో 2010లో 56 మందితో నెలకొల్పిన రికార్డును బద్దలుకొట్టారు. ప్రపంచ రికార్డుకోసం 500సీసీ కెపాసిటి గల రాయల్ ఎన్ఫీల్డ్ బైకు మీద 58 మంది నిలుచునే విధంగా స్టాండ్ ఏర్పాటు చేశారు.

ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

రికార్డ్ బ్రేకింగ్ రైడ్ నెలకొల్పడానికి ముందు ఆర్మీ బృందం పలుమార్లు ప్రాక్టీస్ చేసింది. తీవ్ర ఉత్కంఠతను రేపిన ఈ రికార్డులో పాల్గొన్న ఆర్మీ వ్యక్తులు బిస్కట్లు మరియు 100మీ.లి నీటిని మాత్రమే తీసుకొన్నారు. తొలి రెండు ప్రయత్నాల్లో విఫలం చెందగా మూడవ ప్రయత్నంలో రికార్డు బ్రేకింగ్ రైడింగ్ సాధ్యమయ్యింది.

ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

ఈ బృందం 1982లో రక్షణ కల్నల్ సిఎన్ రావు మరియు క్యాప్టెన్ జెపి వర్మ సమక్షంలో ఏర్పాటయ్యింది. అప్పటి నుండి ఈ టోర్నడో బృందం 19 ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 మీద ఎన్నో విన్యాసాలు చేసారు.

ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

39 మంది సభ్యులు, ఇద్దరు ఆఫీసర్లు, ఇద్దరు జూనియర్ కమీషనర్ ఉద్యోగులు, 35 మంది జూనియర్ ర్యాంకు ఉద్యోగులు దేశ మరియు ప్రపంచ వ్యాప్తంగా 1000కి పైగా విన్యాసాలు చేశారు. ఇక ప్రస్తుతం వరల్డ్ రికార్డ్ బ్రేకింగ్ కోసం ఉపయోగించిన బైకు విషయానికి వస్తే, ఇది క్యాస్ట్ ఐరన్‌తో నిర్మించిన పురాతణ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500. ప్రస్తుతం ఇది ప్రొడక్షన్‌లో లేదు.

ఒక్క బైకు మీద 58 మందితో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ

ఇందులోని శక్తివంతమైన లాంగ్ స్ట్రోక్ 499సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 22బిహెచ్‌పి పవర్ మరియు 38ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.రాయల్ ఎన్ఫీల్డ్ ఈ బైకుల ప్రొడక్షన్‌ను 2007లో నిలిపివేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Watch 58 Indian Army men riding on a single Royal Enfield motorcycle break a Guinness Book record
Story first published: Tuesday, November 21, 2017, 18:23 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X