గజిబిజి రోడ్లు...

రవాణా వ్యవస్థలో క్రీయాశీలక పాత్ర పోషిస్తున్న రోడ్లు దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషిస్తున్నాయి. రోడ్ల విస్తరణతో రవాణా ఇంకా ప్రయాణ ప్రక్రియ వివిధ ప్రాంతాలను మమేకం చేస్తోంది. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితుల ఆధారంగా రహదారుల నిర్మాణం ఉంటుంది. ఈ క్రింది ఫోటో శీర్షికలో మీరు చూడబోయే పలు అంతర్జాతీయ రహదారులు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి.

ఈ రహదారులు భిన్నమైన వాతావరణాన్ని కలిగి వైవిధ్యభరతమైన అనుభూతులకులోను చేస్తాయి. వాహనచోదకులు ఈ ప్రాంతాల్లో తమ ఏకాగ్రతను పూర్తిగా డ్రైవింగ్ పైనే ఉంచాల్సి ఉంటుంది. ఉత్కంఠ వాతావరణాన్ని తలిపంచే 6 గజిబిజి రోడ్లను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయంచేయబోతున్నాం.

గజిబిజి రోడ్లు...

విన్స్టన్ చర్చిల్ అవెన్యూ - జిబ్రాల్టర్ (Winston Churchill Avenue - Gibraltar):

ఈ రహదారి మార్గంలో యాక్టివ్ ఎయిర్ పోర్ట్ రన్‌వే ఉంది. ప్లేన్ ల్యాండింగ్ లేదా టేక్ ఆఫ్ సమయంలో 10 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ మార్గంలో ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

గజిబిజి రోడ్లు...

ద లీనా హైవే (The Lena Highway - Russia):

మీకు బురుదలో ప్రయాణించటమంటే ఇష్టమా.. అయితే మీకు లీనా హైవే బెస్ట్ చాయిస్. ఈ జాతీయ రహదారి సైబీరియా, రష్యా వాసులకు సుపరిచితం. శీతా కాలం ఈ రోడ్డు సౌకర్యవంతంగా ఉంటుంది. వర్షా కాలం వచ్చిందంటే చాలు ఈ రోడ్డు బరుదతో కప్పబడి ఆసౌకర్యంగా మారుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుంది.

గజిబిజి రోడ్లు...

కారాకోరమ్ హైవే - పాకిస్తాన్ టూ చైనా (Karakoram Highway - Pakistan to China):

కారాకోరమ్ పర్వత శ్రేణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ రహదారి చైనా- పాకిస్తాన్‌లను కలుపుతుంది. రోడ్డు పొడవు 15,500 అడుగులు. ఈ మార్గంలో ఆక్సిజన్ శాతం తక్కువుగా ఉంటుంది. కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ముష్కరమూకల దాడులు కూడా అధికం.

గజిబిజి రోడ్లు...

జుయోలియాంగ్ టన్నెల్ - చైనా (Guoliang Tunnel - China):

ఈ సొరంగ మార్గంలో ప్రయాణం అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. వాహనచోదకులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

గజిబిజి రోడ్లు...

గేట్ టవర్, ఓసాకా, జపాన్ (Gate Tower, Osaka, Japan):

అభివృద్థి పధంలో ముందుకు దూసుకుపోతున్న జపాన్ రహదారుల నిర్మాణం విషయంలోనూ తన పనితనాన్ని చాటింది. ఓసాకా నగరంలోని ఓ రహదారి గేట టవర్ బిల్డింగ్ లోపల నుంచి చొచ్చుకుపోతుంది. ఆ దృశ్యాన్ని చిత్రంలో మీరు చూడొచ్చు.

గజిబిజి రోడ్లు...

చీసాపీక్ బే వంతెన (Chesapeake Bay Bridge):

అమెరికాలోని మేరీల్యాండ్ ప్రాంతంలో ఉన్న 12 కిలోమీటర్ల వంతెన మార్గం పై ప్రయాణం అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. ఈ మార్గంలో ఏర్పాటు చేసిన రెండు మైళ్ల సముద్ర సొరంగ మార్గం ఉత్కంఠకు తెరలేపుతుంది.

Most Read Articles

English summary
Here are 6 of the most insane roads that auto fans should drive before they die. These roads are so insane that they defy logic....
Story first published: Saturday, February 16, 2013, 16:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X