60 లీటర్ల డీజిల్‌ నింపమంటే 61 లీటర్లు నింపారు.. అదెలా సాధ్యం, వైరల్‌ అవుతున్న వీడియో

మనం పెట్రోల్‌ లేదా డీజిల్‌ కొట్టించడానికి పెట్రోల్‌ కొట్టించడానికి వెళ్లినప్పుడు లీటర్‌ లేదా రెండు లీటర్ల పెట్రోల్‌ కొట్టిస్తాం. లాంగ్‌ జర్నీ చేసేవాళ్లు, రవాణా వాహనాలకు సంబంధించిన డ్రైవర్లు ఫుల్‌ ట్యాంక్‌ కొట్టిస్తారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వాహనంలో కెపాసిటీకి మించి డీజిల్‌ను నింపారు. అదెలా సాధ్యం.

60 లీటర్ల కెపాసిటీ ఉన్న డీజిల్‌ ట్యాంక్‌లో దాదాపు 61 లీటర్లు (60.970) డీజిల్‌ నింపిన ఘటన ఇటీవల తమిళనాడులోని దిండిగల్‌లో చోటుచేసుకుంది. 60 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్‌ని అంత కంటే ఎక్కువ డీజిల్‌తో నింపడం ఎలా? అక్కడ ఏదైనా పొరపాటు జరిగిందా.? లేక సాంకేతికంగా ఇది సాధ్యమేనా? పూర్తి వివరాల్లోకి వెళితే..

Diesel-Tank-Viral-Video

దిండిగల్ జిల్లా పళని బైపాస్‌లో ఓ పెట్రోల్ బంకు ఉంది, ప్రతి రోజు వేలాది మంది వచ్చి తమ వాహనాల్లో ఫ్యూయెల్‌ను నింపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల అదే ప్రాంతానికి చెందిన అళగరస్వామి తన వ్యాన్‌లో డీజిల్‌ నింపుకొనేందుకు పెట్రోల్‌ బంకు వద్దకు వచ్చాడు.

అనంతరం బంకు సిబ్బందితో తన వ్యాన్‌లో ఫుల్‌ ట్యాంక్‌ డీజిల్‌ నింపమని అడిగాడు. బంకు సిబ్బంది అతని వ్యాన్‌లో డీజిల్ నింపే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తిగా నింపిన తర్వాత స్కీన్‌పై 60.970 లీటర్ల డీజిల్‌ను నింపినట్లు చూపించింది. ఇది చూసి షాక్ తిన్న అళగరస్వామి పెట్రోల్ బంకు సిబ్బందిని ఆరా తీశారు.

Diesel-Tank-Viral-Video

తన వ్యాన్ ఫుల్ డీజిల్ ట్యాంక్ 60 లీటర్లు మాత్రమేనని, ఇప్పుడు 60 లీటర్ల 970 ఎంఎల్ డీజిల్‌తో ఎలా నింపుతారని ప్రశ్నించారు. దీనిపై పెట్రోల్ బంకు సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు. దీంతో పెట్రోలు బంకు ఉద్యోగులు, అళగరస్వామి వర్గీయులకు మద్య వాగ్వాదం జరిగింది. పోలీసులకు సమాచారం అందించారు. ఆ తర్వాత పోలీసులు పెట్రోలు బంకు వద్దకు చేరుకుని ఇరువర్గాలను విడదీశారు.

అక్కడ పెట్రోల్ బంకు యజమానిని, అళగరస్వామిని విచారించగా, పెట్రోల్ బంకు ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారని అళగరస్వామి పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వ్యాన్‌లోని డీజిల్ ట్యాంక్‌ను తొలగించి దానిని కొలవాలని నిర్ణయించారు. అలా చేయగా 60 లీటర్ల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని చూపించింది. దీంతో 60 లీటర్ల కెపాసిటీ ఉన్న డీజిల్ ట్యాంక్ అంతకన్నా ఎక్కువ నింపడం ఎలా అని ఇప్పుడు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

Diesel-Tank-Viral-Video

అయితే డీజిల్ విక్రయాల విషయానికొస్తే, చమురు కంపెనీలు తమ విక్రయ కేంద్రాల పట్ల చాలా కఠినంగా నిర్వహిస్తున్నాయి. డీజిల్‌ విక్రయాల్లో అవకతవకలు జరిగాయో లేదో ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. డీజిల్ విక్రయించే కేంద్రాలపై వారు అనేక ఆంక్షలు విధించారు. అందువల్ల, అక్రమాలకు తక్కువ అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, July 14, 2023, 9:11 [IST]
English summary
61 liter diesel filled in 60 liter tank video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+