ADAS ఫీచర్‌తో 2023 లో లాంచ్‌ అయిన కార్లు ఇవే.. సేఫ్టీ పరంగా వీటికి తిరుగే లేదు.!!

ఆటోమొబైల్‌ రంగంలో భారత్‌ వృద్ధిని సాధిస్తోంది. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ, అధునాతన ఫీచర్లతో కొత్త వాహనాలు భారత మార్కెట్లోకి అడుగుపెడుతున్నాయి. రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఆటో మేకర్లు తమ కార్లలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లను ప్రవేశపెడుతున్నారు. స్టాండర్డ్‌ ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి ఫీచర్లు వీటిలో ప్రధానమైనవి,

ఈ క్రమంలో భారత మార్కెట్లో మొట్టమొదటిసారిగా 2023 లో రూ. 30 లక్షల కంటే తక్కువ ధర (ఎక్స్-షోరూమ్) కలిగిన కార్లు ADAS(Advanced Driver Assistance System) ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రధాన సేఫ్టీ ఫీచర్‌గా అడాస్‌ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. ADAS ఫీచర్‌ కలిగిన టాప్‌ 7 కార్ల జాబితాను ఈ కథనంలో మీరు చూడవచ్చు.

MG-Hector

MG Hector/Hector Plus Facelift: ADAS ఫీచర్‌తో 2023 ప్రారంభంలో MG హెక్టర్ మరియు MG హెక్టర్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. ఇది ADASతో సహా మెరుగైన సౌకర్యం, సౌలభ్యం మరియు సేఫ్టీ ఫీచర్లతో ఆకర్షణీయమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చాయి. ఈ SUV రెండు వెర్షన్లలో, ADAS పూర్తిగా లోడ్ చేయబడిన Savvy Pro ట్రిమ్‌లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

Honda City: ఈ ఏడాది మార్చిలో అప్‌డేటెడ్‌ హోండా సిటీ మార్కెట్‌లోకి విడుదలైంది. గతంలో హోండా సిటీ హైబ్రిడ్‌లో మాత్రమే ADAS ఫీచర్‌ను ఇప్పుడు హోండా సిటీలో కూడా చూడవచ్చు. దీని ADAS యూనిట్‌లో ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్‌, లేన్ కీప్ అసిస్ట్ మరియు లీడ్ కార్ డిపార్చర్ అలర్ట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Honda-Elevate

Honda Elevate: కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో హోండా ఎలివేట్ గట్టి పోటీనిస్తోంది. ఇది ADASతో సహా కొన్ని అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. అయితే ఈ ఫీచర్‌ను హోండా SUV యొక్క టాప్-స్పెక్ ZX ట్రిమ్‌లో మాత్రమే చూడవచ్చు. ఎలివేట్‌లోని ADAS సూట్ అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్‌ వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది.

Hyundai Venue And N Line: 2023 లో ఫేస్‌లిఫ్టెడ్ వెన్యూ మరియు వెన్యూ ఎన్ లైన్ ADAS టెక్నాలజీతో లాంచ్‌ అయ్యాయి. SX (O) మరియు N8 వంటి పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్‌లలో మాత్రమే ఈ ADAS ఫీచర్‌ ఉంది. దీని ADAS టెక్నాలజీలో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ మరియు వెహికల్ ఎగ్జిట్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Hyundai-Verna

6th Gen Hyundai Verna: ఈ ఏడాది ప్రారంభంలో వెర్నా ఫేస్‌లిఫ్ట్‌ విడుదలైంది. భారత మార్కెట్లో ADAS ఫీచర్‌తో విడుదలైన మొదటి హ్యుందాయ్ కార్లలో వెర్నా ఒకటి. SX(O)లో CVT మరియు SX(O) టర్బో వేరియంట్‌లలో మాత్రమే ADAS ఫీచర్‌ను హ్యుందాయ్‌ మోటార్స్ అందిస్తుంది. ఇందులో కొలిషన్‌ అవాయిడెన్స్‌, లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు హై-బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Kia Seltos Facelift: 2023 సంవత్సరం మధ్యలో ఫేస్‌లిఫ్టెడ్ కియా సెల్టోస్ లాంచ్‌ అయింది. సెల్టోస్‌లో టాప్-స్పెక్ GTX+ మరియు X-లైన్ వేరియంట్‌లలో ADAS టెక్నాలజీని పరిచయం చేశారు. SUV యొక్క ADAS సూట్‌లో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, రియర్ ట్రాఫిక్ అలర్ట్ మరియు హై-బీమ్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లను అందిస్తోంది.

Kia-Seltos

Tata Harrier And Safari Facelifts: 2023 అక్టోబర్‌లో టాటా హారియర్ మరియు సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లు లాంచ్‌ అయ్యాయి. ఈ రెండు SUVల టాప్-స్పెక్ అడ్వెంచర్+A వేరియంట్‌లో ADAS ఫీచర్‌ను చూడవచ్చు. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), రియర్‌ ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ ఇంకా లేన్ ఎగ్జిట్ వార్నింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది.

Tata-Safari-Harrier

More from DriveSpark

Article Published On: Wednesday, December 27, 2023, 16:46 [IST]
English summary
7 cars with adas technology launched in india 2023 under rs 30 lakhs
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+