కారు క్యాబిన్‌లో 7 అడుగుల భారీ కొండచిలువ.. బయటకు తీసేందుకు తిప్పలు, భయపెడుతున్న వీడియో!
ఈ మధ్య కాలంలో పాములు సాధారణంగా జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవతున్నారు. కార్లు, బైకులు వంటి వాహనాల్లో ఉండే వేడిమికి అవి వచ్చి అందులో చేరుతున్నాయి. ఇది గమనించని కొందరు పాము కాటు బారిన పడుతుండగా.. గుర్తించిన మరికొందరు తీవ్ర భయందోళనకు గురవతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా సిటిల్లోనూ పాములు కార్లల్లో వచ్చి చేరుతున్నాయి. కార్లు, బైకుల్లో పాములు ఆశ్రయం పొందిన సంఘటనలు ఇదివరకే మనం ఎన్నో చూశాం. తాజాగా 7 అడుగుల పొడవైన కొండచిలువ హ్యుందాయ్ ఐ10 కారులో తలదాచుకున్న వీడియో వైరల్ అవుతుంది. ఆ వివరాలు ఈ కథనంలో..
కొద్ది రోజుల క్రితం మారుతి సుజుకి స్విఫ్ట్ కారులోకి ఒక చిన్న కొండచిలువ కారులోకి వెళ్లడం మనం చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలో చోటుచేసుకుంది. ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం ఓ బాగా పొడవైన కొండచిలువ హ్యుందాయ్ ఐ 10 కారులోని క్యాబిన్‌లో తల దాచుకుంది. ఇది మనిషి కంటే పొడవుగా సుమారు 7 అడుగుల ఉంది.

ఈ కొండచిలువ హ్యుందాయ్ ఐ10 డ్యాష్ బోర్డు కింద ఏసీ సిస్టమ్‌లోకి ప్రవేశించింది. ఎక్స్ పేజీలో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం హ్యుందాయ్ ఐ 10 ఒక షోరూమ్ వెలుపల పార్క్ చేసి ఉంది. దీనిలో పాము ఉందని గమనించిన తర్వాత దానిని చూసేందుకు చాలామంది కారు చుట్టూ నిలబడటం వీడియోలో చూడవచ్చు. అప్పటికే క్యాబిన్‌లో ఉన్న పాము భయంతో ఏసీ సిస్టమ్‌లోకి మరింత చొచ్చుకు పోయే ప్రయత్నం చేసింది.
ఇందుకోసం ముందుగా కారు డ్యాష్ బోర్డును తొలగించారు. క్యాబిన్‌లోని ఏసీ లోపల ఉన్న పాముని కొండచిలువగా గుర్తించారు. ఇది చాలా పొడవుగా ఉండటంతో రెస్క్యూ చేసే వారికి కాస్త ఇబ్బంది తలెత్తింది. పాము ఫుల్ బాడీ ఏసీ సిస్టమ్‌లోకి వెళ్లింది. కేవలం తోకలో సగం మాత్రమే బయట ఉంది. ముందు దీని తల సరిగ్గా కనిపించ లేదు. కొన్ని ప్రయత్నాల తర్వాత పాము కారు ఏసీ సిస్టమ్‌ని బయటకు తీశారు.

ఆ తర్వాత ఏసీ సిస్టమ్‌లోని భాగాలను ఒక్కొక్కటిగా తొలగించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎయిర్‌బాక్స్‌లో పాము తల ఉన్నట్లు గుర్తించారు. కొన్ని ప్రయత్నాల తర్వాత కొండచిలువను బయటకు తీశారు. బయటకు తీసిన తర్వాత దానిని చూసిన జనాలు భయంతో బెంబెలెత్తి పోయారు. ఈ కొండ చిలువ భారీ ఆకృతితో దాదాపు ఏడు అడుగుల ఎత్తు ఉంటడం గమనించవచ్చు.
అయితే కొండచిలువలు విషపూరితమైనవి కావు. అందువల్ల అవి కరిచినా పెద్ద సమస్య ఉండదు. కానీ వాటికి శారీరక బలం చాలా ఎక్కువ. తన వేటలో ముందుగా జంతువుని ఊపిరి ఆడకుండా గట్టిగా బిగిస్తుంది. ఆ తర్వాత దానిని తినే అలవాటు దీనికి ఉంది. ఇదే పద్ధతిలో చాలా వరకు మనుషులు కూడా తమ ప్రాణాలను కోల్పోయారు.
ఆ తర్వాత హ్యుందాయ్ ఐ10 నుంచి కొండచిలువను బయటకు తీసి బ్యాగులో వేశారు. ముందే చెప్పినట్లు కొండచిలువలు వాహనాల్లో ఆశ్రయం పొందడం ఇదే మొదటిసారి కాదు. కొండచిలువలే కాకుండా ఇతర విష పాములు జనావాసాల్లో వస్తాయి. వీటిలో ఎక్కువగా కట్లపాము, నాగుపాములు ఉంటాయి. కావున వాహనం తీసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడం మంచింది.
ఈ పాముల రక్తం చల్లగా ఉండటం వల్ల అవి వేడి, తక్కువ ఆక్సిజనేటెడ్ ప్రాంతాలను ఇష్టపడతాయి. కార్లు, బైకులలో, ఇంజిన్ వద్ద వేడి ఉత్ఫన్నం అవుతుంది. దీంతో ముఖ్యంగా కొండ, గ్రామీణ పరిసర ప్రాంతాల్లో వర్షాకాలంలో వాహనాలు ఆశ్రయం పొందుతాయి. కావున వాహనాల్లోకి పాములు ప్రవేశించకుండా ఉండాలంటే వాహనాన్ని ఎప్పటికప్పుడు ఆయిల్, గ్రీజుతో శుభ్రం చేయడం, మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం.


Click it and Unblock the Notifications








