ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

భారతీయ రోడ్లపై వాహనం నడపడానికి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. ఇందులో ప్రధానంగా వాహనం రైడ్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరి, కావున ప్రజా రహదారిపై వాహనం నడపాలంటే లైసెన్స్ ఉండాలి. ఆలా లేకుండా వాహనం నడపడం చట్ట రీత్యా నేరం.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

వాహనాలను మైనర్లు నడపడం కూడా చట్ట రీత్యా నేరంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ అక్కడక్కడా, ఇప్పటికి మైనర్లు వాహనాలు నడపడం చూస్తూనే ఉంటాము. మైనర్లు బైక్స్ నడపడానికి వారి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయస్సులోనే డ్రైవింగ్ నేర్పిస్తారు. ఆ సమయంలోనే ఆరు హైస్కూల్ మరియు ఇంటర్ కి హాజరయ్యే సరికే బైకులు మరియు స్కూటర్లు తీసుకెల్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

చాలా మంది పిల్లలు మితిమీరిన వేగంతో మరియు నిర్లక్ష్యంతో వాహనాన్ని నడుపుతారు. ప్రమాదకరమైన డ్రైవింగ్ విపత్తులకు దారితీస్తుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను పబ్లిక్ రోడ్డుపై వాహనం నడపడానికి అనుమతించకూడదు. మైనర్లు డ్రైవింగ్ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ తప్పు తల్లిదండ్రులదే అవుతుంది. కావున జరిమానా మరియు జైలు శిక్ష వంటి కూడా తల్లిదండ్రులకే వర్తిస్తాయి.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

ఇవన్నీ ఇలా ఉండగా ఇలాంటి సంఘటన ఒకటి మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘంటనలో ఒక స్కూటర్ పై ఏకంగా 7 మంది ప్రయాణిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియో కూడా అందుబాటులో ఉంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగింది.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

సాధారణంగా ఒక స్కూటర్ పై ఇద్దరు వెళ్ళవచ్చు. ఆలా కాకుంటే ఇంకొకరు అంటే ముగ్గురు వెళ్ళవచ్చు. అయితే ఇక్కడ ఉన్న వీడియోలో మాత్రం 7 మంది ప్రయాణిస్తున్నారు. ఇది చూడటానికి కొత్త ఆశ్చర్యంగా ఉన్న చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. ఈ సంఘటన జరిగిన తరువాత పోలీసులు ఆ మైనర్స్ యొక్క తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

ఈ మైనర్స్ లో ఒకడు సాహసం చేయడానికి వారి తండ్రి హోండా యాక్టివా స్కూటర్‌ని తీసుకున్నట్లు తెలిసింది. ఆ పిల్లవాడు స్కూటర్ తీసుకుని హైవే మీద ఈ సాహసం చేసారు. ఇక్కడ కనిపించే పిల్లలు ఎవరూ హెల్మెట్ ధరించలేదు. రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులు ఈ వీడియో తీశారు.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఒక్కోసారి చాలా వైరల్ అవుతుంది. వీడియో మీరు చూసినప్పుడు ఆరు ఎంత ప్రమాదకరమైన రైడింగ్ చేస్తున్నారో తెలుస్తుంది. ఇంతమందితో రైడింగ్ చేస్తున్న సమయంలో పొరపాటున బ్యాలెన్స్ తప్పితే ఊహకందని ప్రమాదం జరుగుతుంది.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

సిసిల మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను పోలీసులు గమనించి, స్కూటర్‌ను గుర్తించడానికి పోలీసులు బృందాన్ని సిద్ధం చేశారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల సాయంతో స్కూటర్ యజమానిని గుర్తించడంలో పోలీసులు విజయం సాధించారు. వీడియో సాక్ష్యాల ఆధారంగా, యాక్టివా స్కూటర్ యజమానికి పోలీసులు రూ. 40,000 జరిమానా విధించారు మరియు నిబంధనలను ఉల్లంఘించినందుకు మరియు ప్రజా రహదారులపై ప్రమాదకరంగా డ్రైవ్ చేసినందుకు అతనిపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

పోలీసులు స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు మరియు కోర్టు విచారణకు హాజరు కావాలని స్కూటర్ యజమానికి చెప్పారు. నేరం రుజువైతే, కోర్టు ఆ వ్యక్తిని మూడేళ్ల పాటు జైలుకు పంపే ఆవకాశం కూడా ఉంటుంది. లైసెన్స్ లేకుండా చట్టవిరుద్ధంగా రైడ్ లేదా వాహనాలు నడిపే మైనర్ల తల్లిదండ్రులకు కూడా నియమాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

గతంలో కూడా తమ పిల్లలకు మోటారు వాహనాలు నడపడానికి అనుమతిచ్చిన తల్లిదండ్రులకు పోలీసులు భారీ జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో నియమాలను ఉల్లంఘించిన పిల్లల తల్లితండ్రులని పంపిన సందర్భాలు కోకొల్లలు. మైనర్లను నడపడం చట్టవిరుద్ధం మరియు అందువల్ల ఏ బీమా పాలసీ పరిధిలోకి రాదు.

మైనర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనం ఇచ్చే ముందు, దాని గురించి ఒక్క సారి ఆలోచించాలి. పిల్లలకు భద్రత మరియు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలి. లేకపోతే తల్లిదండ్రులు భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

ఒక స్కూటర్‌పై 7 మంది రైడింగ్[వీడియో].. ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం

ఇటీవల హైదరాబాద్ నగరంలో ఒక మైనర్ బాలుడు స్కూటర్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డాడు. అయితే ఆ బాలుడు ద్రియే చేస్తున్న స్కూటర్ ఎలక్ట్రిక్ కావున అతనికి ఎలాంటి జరిమానా విధించలేదు, కానీ వారికి ఇలాంటి పబ్లిక్ రోడ్డులో రైడింగ్ ప్రమాదమని హెచ్చరించి, ఇలాంటి సంఘటనలకు మళ్ళీ పాల్పడవద్దని వారిని అక్కడనుంచి పంపేశారు. దీని గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
7 underage riders caught riding one activa scooter in public roads details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X