73 ఏళ్ల వయసులో BMW స్పోర్ట్స్‌ కారును నడిపిన బామ్మ.. భారీ వాహనాలను సైతం అవలీలగా డ్రైవ్‌ చేయగలదట.!!

కేరళకు చెందిన 73 ఏళ్ల బామ్మ స్పోర్ట్స్ కారు నడుపుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. సాధారణంగా భారత్‌లో రోడ్లపై ఖరీదైన లగ్జరీ కార్లను చూడటం సాధారణమే.. కానీ వాటిని ఎక్కువగా యువకులు నడుపుతుంటారు. కానీ ఓ ప్రముఖ కంపెనీకి చెందిన సూపర్‌ స్పోర్ట్స్‌ కారును ఓ బామ్మ నడపడం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తోంది.

కేరళలో రాధామణి అనే 73 ఏళ్ల బామ్మ(73 Year Old Woman BMW ).. చాలా ఖరీదైన BMW Z4 స్పోర్ట్స్ కారును నడుపుతున్న వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. రాధామణి.. కొచ్చిలోని A2Z డ్రైవింగ్ స్కూల్ యజమాని. ఈ డ్రైవింగ్ స్కూల్‌ను 1970లో ఆమె భర్త ప్రారంభించారని రాధామణి చెబుతోంది. ఆమె భర్త 2004లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో రాధామణి డ్రైవింగ్ స్కూల్ నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు.

73-Year-Old-Grandma-Driving-BMW-Z4-Sports-Car

అసలు విషయానికొస్తే.. రాధామణి BMW Z4 కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారును కేరళ రోడ్లపై చాకచక్యంగా నడిపారు. వీడియోను పరిశీలించినట్లయితే.. ఆమె ముందుగా మహీంద్రా థార్‌లోకి ప్రవేశిస్తుంది. కాసేపటి తర్వాత మహీంద్రా థార్‌ను ఒక చోట ఆపి, ఆపై BMW Z4 స్పోర్ట్స్ కారు వద్దకు వెళ్లి, తాను కన్వర్టిబుల్ స్పోర్ట్స్ కారును డ్రైవ్ చేయబోతున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

తరువాత, రాధామణి(Old Woman In Kerala Has 11 Driving Licenses) డ్రైవర్ సీట్లో కూర్చుని కారు నడపడం ప్రారంభించారు. విదేశాల్లో ఇది సాధారణ దృశ్యమే అయినప్పటికీ, భారత్‌లో 73 ఏళ్ల మహిళ.. ఇలాంటి స్పోర్ట్స్‌ కారును నడపడం ఇదే తొలిసారి కావడంతో వీడియో నెటిజన్ల మనసును దోచుకుంటోంది. ఆత్మస్థైర్యానికి వయసు అడ్డంకి కాదని నెటిజన్లు పేర్కొంటూ.. బామ్మను అభినందిస్తున్నారు.

73-Year-Old-Grandma-Driving-BMW-Z4-Sports-Car

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రస్తుతం రాధామణి(Old Woman Driving BMW Z4 Sports Car)కి కారు నడపడానికి మాత్రమే కాదు.. ఇంకా 11 రకాల వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందని చెబుతుండటం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. బస్సు, లారీ, రోడ్ రోలర్, క్రేన్ మొదలైన భారీ వాహనాలను సైతం రాధామణి చాకచక్యంగా నడపగలను అని గర్వంగా చెబుతున్నారు.

అయితే 11 రకాల వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ రాధామణికి ఇష్టమైన వాహనం ద్విచక్ర వాహనమట. కొన్నాళ్ల క్రితం రాధామణి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన భర్త తనకు స్కూటర్ కొనిచ్చారని, అప్పటి నుంచి తాను ఎక్కడికి వెళ్లినా ఆ స్కూటర్‌పైనే వెళ్తానని చెప్పుకొచ్చింది. అత్యవసరమైతేనే కారును బయటకు తీస్తానని వెల్లడించింది.

73-Year-Old-Grandma-Driving-BMW-Z4-Sports-Car

కాగా 1993లో రాధామణి మొదటగా ద్విచక్ర వాహనం నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా కూడా రాధామణి గుర్తింపు పొందడం విశేషం. అంతేకాకుండా 2021లో ప్రమాదకరమైన వస్తువులను తీసుకెళ్లేందుకు కూడా ఆమె లైసెన్స్ పొందారు. భర్త మరణించాక డ్రైవింగ్‌ స్కూల్‌ను నడపడానికి బాధ్యతలు తీసుకోవడమే ఇందుకు కారణంగా రాధామణి వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్‌ వ్యాఖ్య: ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా వివిధ రంగాల్లో సాధించాలని తపన పడుతున్న మహిళలకు ఈ 73 ఏళ్ల బామ్మను రోల్ మోడల్‌గా తీసుకోవాలి. ఏదైనా సాధించాలనే తపన ఉంటే వయసు అడ్డంకి కాదని ఆమె ద్వారా స్పష్టమవుతోంది. మహిళ అయి ఉండి ఆత్మస్థైర్యంతో పాటు తనకున్న ప్యాషన్‌తో భారీ వాహనాలతో కలుపుకొని ఏకంగా 11 వాహనాలకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం అందరికీ స్ఫూర్తిదాయకం.

More from DriveSpark

Article Published On: Monday, February 12, 2024, 20:50 [IST]
English summary
73 year old grandma driving bmw z4 sports car video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+