వయసు కేవలం నెంబర్ మాత్రమే.. ఖరీదైన జాగ్వార్ F టైప్ స్పోర్ట్స్ కారులో బామ్మ చక్కర్లు
కేరళకు చెందిన 73 ఏళ్ల(73 Year Old Bamma Sports Car) రాధామణి అనే బామ్మ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును నడుపుతూ ఆశ్యర్యపరిచారు. ఈమె స్పోర్ట్స్ కారుని నడిపిన వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఆమె కారుని డ్రైవ్ చేసిన విధానం విజువల్స్ అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆమె డ్రైవింగ్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు.
దేశంలో డ్రైవింగ్ చేసే మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వయసుతో సంబంధం లేకుండా చాలామంది కారు డ్రైవింగ్‌పై ఆసక్తిని కనబరుస్తున్నారు. సాధారణ కార్లు నడిపితే అందులో కొత్త ఏమి ఉండదు. అయితే కొందరు మాత్రం 60 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ కారుని నడుపుతూ వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది ధనవంతుల కుటుంబానికి చెందిన వారు ఫెరారీ, లంబోర్ఘిని వంటి బ్రాండ్లకు చెందిన విదేశీ కార్లను కూడా కలిగి ఉన్నారు.

ఖరీదైన స్పోర్ట్ కార్లు నడిపే మహిళల్లో ఎక్కువ మంది యుక్త వయసుకి చెందిన వారు ఉండటం సర్వసాధారణం. అయితే అందుకు భిన్నంగా కేరళకు చెందిన 73 ఏళ్ల బామ్మ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారును నడుపుతూ ఔరా అనిపించింది. ఈ వీడియోను ఏ2జెడ్ హెవీ ఎక్విప్మెంట్ ఇన్స్టిట్యూట్ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ పేజీలో ఆమెకు సంబంధించిన పూర్తి వీడియోలు గమనించవచ్చు.
ఈ వీడియోలో కనిపించే రాధామణికి డ్రైవింగ్ అంటే అమితమైన ప్రేమ. దీనిని ఒక వ్యసనంలా ఆమె భావిస్తుంది. ఈ వీడియోలో రాధామణి గ్రీన్ కలర్ జాగ్వార్ ఎఫ్-టైప్ స్పోర్ట్స్ కారు డ్రైవర్ సీటులో కూర్చొని ఉండే విజువల్స్ గమనించవచ్చు. ఈమె కోడలుకి కూడా డ్రైవింగ్ అంటే ఇష్టం. తాను జాగ్వార్ స్పోర్ట్స్ కారు డ్రైవ్ చేస్తుండగా.. తన కోడలు బీఎమ్‌డబ్ల్యూ జెడ్ 4 స్పోర్ట్స్ కారు నడుపుతోంది.

ఆమె ఇలాంటి స్పోర్ట్స్ కారుని నడపడం ఇష్టంగా భావిస్తుంది. ఆ పిచ్చియే ఆమెకు ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో ప్రశంసల్నీ గుప్పిస్తోంది. తాజాగా ఆ బామ్మ నడిపిన బీఎమ్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కారు వీడియోకి కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. ఆమె కొత్త వాహనం నడిపిన ప్రతిసారీ ఇలా సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె డ్రైవ్ చేసిన విజువల్స్ ఇంటర్‌నెట్‌లో వైరల్ అవడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
ఈమె కేరళలోని కొచ్చిలోని A2Z డ్రైవింగ్ స్కూల్‌ని స్థాపించింది. ఈ డ్రైవింగ్ స్కూల్‌ను ఆమె భర్త 1970లో నెలకొల్పారు. రాధామణి 30 ఏళ్ల వయసులో కారు నడపడం నేర్చుకుంది. ఆమె డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆమె భర్త పట్టుబట్టడంతో ఆమె డ్రైవింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఆమె పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి ఇది చక్కటి ఉదాహరణ అని ఆమె చెప్పారు.

ప్రస్తుతం ఆమె 11 రకాల కేటగిరీల్లో వాహనాలు నడపడానికి లైసెన్సులు కలిగి ఉన్నారు. ఎక్స్కవేటర్, ఫోర్క్లిఫ్ట్, క్రేన్, రోడ్ రోలర్, ట్రాక్టర్, కంటైనర్ ట్రైలర్ ట్రక్, బస్సు, లారీ మరియు మరెన్నో ఆపరేట్ చేయడానికి ఆమెకు లైసెన్స్‌లను కలిగి ఉంది. కేరళలో హెవీ వెహికల్ లైసెన్స్ పొందిన తొలి మహిళ కూడా రాధామణినే కావడం విశేషం. 2021లో ప్రమాదకర వస్తువుల రవాణాకు లైసెన్స్ పొందిన మహిళగా రికార్డు సాధించారు. 1988లో బస్సు, లారీలకు లైసెన్స్ పొందారు.
ఈ లైసెన్సులన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి కారణం 2004లో జరిగిన ప్రమాదంలో భర్తను కోల్పోయిన తర్వాత స్వయంగా డ్రైవింగ్ స్కూల్ వ్యాపారాన్ని నడపడమేనని ఆమె చెప్పారు. డ్రైవింగ్ స్కూల్ నడపడానికి, యజమానులు లేదా బోధకులు వారు బోధించే వాహనాలకు లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. దీంతో ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌లకు అప్లై చేస్తూ వచ్చారు.
మొదటగా రాధామణికి 1993లో ద్విచక్ర వాహన లైసెన్స్ వచ్చింది. అప్పట్లో తన భర్త తనకు స్కూటర్ కొన్నాడని, అప్పటి నుంచి తాను అన్ని చోట్లా స్కూటర్ నడుపుతూ వచ్చానని రాధామణి తెలిపారు. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆమె కారులో బయటకు వస్తానని చెప్పారు.
ఇక జాగ్వార్ ఎఫ్ స్పోర్ట్స్ కారు 3.0-లీటర్ వి 6 సూపర్‌ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది, ఇది 375 బిహెచ్పి మరియు 460 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడి ఉంటుంది మరియు పవర్ వెనుక చక్రాలకు పంపబడుతుంది.


Click it and Unblock the Notifications








