మనవళ్ల కోసం 50 ఏళ్ల నాటి Jawa Motorcycle ను కొత్తగా పునరుద్ధరించి గిఫ్ట్‌గా ఇచ్చిన బామ్మ

కొంతమంది తమ వాహనాలను కేవలం రవాణా సాధనంగానే ఉపయోగించవచ్చు. కానీ కొందరికి వాటితో భావోద్వేగమైన బాండింగ్‌ ఉంటుంది. మరికొందరు తమ మునుపటి తరాల వారి జ్ఞాపకార్థంగా భద్రంగా దాచుకుంటారు. ఆ అనురాగంతోనే ఇక్కడ ఓ 82 ఏళ్ల బామ్మ.. తన మనవళ్లకు 50 ఏళ్ల క్రితం(Jawa Motorcycle) బైక్‌ను కొత్తగా మార్చి ఇచ్చింది.

కాలం గడుస్తున్న కొద్దీ దేశీయ మార్కెట్లోకి కొత్త మోడల్‌ బైక్‌లు, కార్లు వస్తున్నాయి. అయితే సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఎంత అధునాతనమైన బైక్‌లు వచ్చినప్పటికీ పాత కాలం నాటి వాహనాలకు ఉన్న క్రేజ్‌ వేరు. పాత కాలం నాటి కొన్ని బ్రాండ్లను అధునాతనంగా మార్చి ఇప్పటికీ విక్రయిస్తున్నారంటే వాటి క్రేజ్‌ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

Jawa-Motorcycle-Restored

వింటేజ్‌ బైక్‌లను చూసుకుంటే జావా(Jawa Motorcycles) మోటార్‌సైకిల్స్‌కి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. స్టైల్‌, ప్యాషన్‌, డిగ్నిటీ లుక్‌లో వింటేజ్‌ లుక్‌ను ప్రతిబింబిస్తూ బైక్‌ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఓ 82 ఏళ్ల బామ్మ తన భర్త జ్ఞాపకార్థం ఇప్పటికీ ఆ బైక్‌ను అపురూపంగా చూసుకుంటున్నారు. ఇప్పుడు తన మనవళ్ల కోసం ఆ బైక్‌ను కొత్తగా పునరుద్ధరించారు.

ఇటీవల, 50 ఏళ్ల క్రితం నాటి జావా మోటార్‌సైకిల్‌కు సంబంధించిన భావోద్వేగమైన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ స్టోరీ కొన్ని సంవత్సరాల క్రితం మరణించిన తన తాతగారికి చెందిన జావా మోటార్‌సైకిల్‌ను రీమోడలింగ్ ఎలా చేశారో వివరిస్తుంది. ఓ బామ్మ(82) తన మనవళ్లకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్న తన భర్త బైక్‌ను పూర్తిగా పునరుద్ధరించడానికి మెకానిక్‌ షాప్‌కు తీసుకువస్తుంది.

Jawa-Motorcycle-Restored

ఈ ప్రత్యేకమైన జావా మోటార్‌సైకిల్‌ను 82 ఏళ్ల అమ్మమ్మ తమ వద్దకు తీసుకువచ్చారని వీడియోలో వ్యక్తి పేర్కొన్నాడు. 50 ఏళ్ల క్రితం ఈ బైక్‌ను తన భర్త కొనుగోలు చేశారని.. ఆయన చనిపోయాక జ్ఞాపకార్థం బైక్‌ను ఇంట్లోనే ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది, ఆమె తన మనవళ్లకు ఈ బైక్‌ను గిఫ్ట్‌గా ఇవ్వాలని నిర్ణయించుకుని నట్, బోల్ట్‌లను పూర్తిగా పునరుద్ధరించేందుకు షాప్‌కు తీసుకువచ్చారు.

అయితే ఎప్పుడో పాత కాలం నాటి బైక్‌ను పునరుద్ధరించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని మీకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు.. ఆ బైక్‌తో ఆ పెద్దావిడ పెనవేసుకున్న అనుబంధం ముఖ్యమైనది. జావా కొత్త బైక్‌ ధర కంటే ఈ బైక్‌ మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ దీంతో ఆమెకున్న అనుబంధంతో పోలిస్తే ఖర్చు చాలా తక్కువ.

Jawa-Motorcycle-Restored

82 ఏళ్ల అమ్మమ్మ తన మనవళ్లతో బైక్‌ను తీసుకుని షాప్‌కి రావడంతో ఇది వారికి ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఈ బైక్‌ను పునరుద్ధరించిన తర్వాత కొన్నాళ్ల పాటు సక్రమంగా పనిచేస్తుందని మెకానిక్‌ పేర్కొన్నారు. అయితే జావా మోటార్‌సైకిల్‌ పాత కండిషన్ పరిశీలిస్తే.. బైక్ దాని ఛాసిస్‌ పూర్తిగా నలిగిపోయి కనిపిస్తుంది. ఇక ఈ బైక్‌ మరమ్మతులను మీరు వీడియోలో చూడవచ్చు.

వీల్‌ బేరింగ్‌లు, ఇంజిన్ మరియు ప్రధాన హ్యాండిల్‌బార్ వంటి బైక్‌లోని వివిధ భాగాలపై టెక్నీషియన్స్‌ పనిచేశారు. ఈ జావా మోటార్‌సైకిల్‌కు సంబంధించిన విడిభాగాలను సేకరించేందుకు వారు దేశవ్యాప్తంగా పలు విక్రేతలను సంప్రదించి, వారితో కనెక్ట్ అయినట్లు వీడియోలో పేర్కొన్నారు. బైక్‌లో చాలా భాగాలు బాగా తుప్పు పట్టడంతో వాటిని రీక్రోమ్‌ చేశారు. వాటిని వెల్డింగ్‌ చేసి, కొత్త పెయింటింగ్‌ వేశారు.

Jawa-Motorcycle-Restored

స్టిక్కర్లు లేకపోవడంతో వారు ట్యాంక్‌పై జావా లోగోను చేతితో పెయింట్ చేయాల్సి ఉంటుందని వీడియోలో తెలిపారు. అలాగే, వారు బైక్‌లో మరికొన్ని క్రోమ్ భాగాలను ఇన్‌స్టాల్ చేశారు. అవి వాస్తవానికి ఫ్యాక్టరీ నుంచి తీసుకున్న క్రోమ్ భాగాలు కాదు. చివరగా, ఈ పునరుద్ధరించబడిన బైక్‌కు మరింత లూక్‌ రావడానికి సరికొత్త టాన్ లెదర్ సీటును జత చేశారు.

చివరగా గోల్డ్‌ రేకులు, బాటిల్‌ గ్రీన్‌ పెయింట్‌తో పెయింట్‌ చేసిన భాగాన్ని బఫ్‌ చేసి పాలిష్‌ చేశారు. ఫైనల్‌గా కొత్తగా పునరుద్ధరించిన జావా మోటార్‌సైకిల్‌ను 82 ఏళ్ల బామ్మ ఇంటికి డెలివరీ చేశారు. పాత కాలం నాటి బైక్‌ కొత్త లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించడంతో ఆ కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలారు. అనంతరం ఆ బైక్‌కు పూజలు చేశారు.

More from DriveSpark

Article Published On: Wednesday, October 4, 2023, 17:44 [IST]
English summary
82 year old grandma restored her husband s jawa motorcycle and gifted to grandchildren
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+