యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకి వాహన దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. ఈ దొంగతనాలను నిలువరించడానికి పోలీసులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికి దొంగతనాలను పూర్తిగా రూపుమాపలేకపోతున్నారు. వాహన దొంగలు సాధారణంగా ఒంటరిగా పార్క్ చేసిన వాహనాలను ఎక్కువగా దొంగతనం చేస్తుంటారు. అంతే కాకుండా వృద్దులు లేకుంటే మహిళలు కారు నడుపుతున్నప్పుడు వాటిని దొంగతనం చేయడం మరింత సులభం అవుతుందని వాటిని దొంగిలించడానికి ప్రయత్నిస్తుంటారు.

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

వాహన దొంగలు ఎక్కువగా వృద్ధులను లక్ష్యంగా చేసుకుంటారు. దీని వెనుక కారణం ఏమిటంటే, వృద్ధులకు దొంగలతో పోరాడే బలం గాని ఓపిక గాని ఉండదు, కావున వృద్ధులను బెదిరించి కారును దొంగలించుకుపోతారు. అయితే కొంతమంది వృద్దులు దొంగలకు ఏమాత్రం భయపడకుండా పోరాడుతారు.

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

ఇలాంటి సంఘటనకు సంబంధించి ఒక వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో ఒక ఒక వృద్ధుడు యువకుడైన దొంగతో పోరాడి తన కారుని దొంగలించకుండా కాపాడుకుంటాడు.

MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

నివేదికల ప్రకారం ఈ సంఘటన అమెరికాలోని జార్జియాలోని అట్లాంటాలో జరిగినట్లు తెలిసింది. ఈ వీడియోలో ఒక యువ దొంగ 82 ఏళ్ల వ్యక్తి నడుపుతున్న కారుపై మెరుపుదాడి చేస్తున్నట్లు కనిపిస్తుంది.

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

వృద్ధుడిని భయపెట్టి కారును హాయిగా దొంగిలించవచ్చని అనుకున్న దొంగకి చివరికి నిరాశే మిగిలింది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం వృద్ధుడు తన కారును అట్లాంటా దిగువ పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద ఉంచాడు. అదే సమయంలో ఒక దొంగ అక్కడికి వచ్చి ఆ వృద్ధునికి తుపాకీ చూపించి కారు కీని అడుగుతాడు.

MOST READ:ఎట్టకేలకు భారత్‌లో అడుగెట్టిన సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్; ధర & వివరాలు

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

ఆ వృద్దుడికి తుపాకీ చూపించినప్పటికీ 'కీ' ఇవ్వడానికి నిరాకరించాడు. దొంగ కారు డోర్ తీసినప్పుడు ఆ వృద్ధుడు అతన్ని బయటకు నెట్టివేసాడు. దీనితో ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఆ సమయంలో వృద్ధుడు ఒక మల్లయోధునిలాగా కనిపించాడు. ఆ సమయంలో దొంగ లేచి అతని నుండి కీని లాక్కుని కారు వైపు పరిగెత్తుతాడు.

దొంగ కారులో కూర్చున్నాడు కాని కారు ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. కానీ ఆ దొంగ దొరికిపోతామేమో అని భయంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఈ ఘటనలో వృద్ధులకు తీవ్ర గాయాలు కాలేదని తెలిసింది. కానీ దొంగ ఎడమ భుజానికి గాయమైందని స్థానిక పోలీసులు తెలిపారు.

MOST READ:ఒంటరిగా కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాస్క్ అవసరమా? లేదా?.. హైకోర్టు క్లారిటీ

యువకుడితో పోరాడిన 82 ఏళ్ల వృద్ధుడు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు

ఈ సంఘటన జరిగిన ఒక నెల తర్వాత అట్లాంటా పోలీసులు వీడియోను విడుదల చేశారు. ఇది కారును దొంగిలించడానికి ప్రయత్నించిన వారిని గుర్తించడంలో ప్రజలు సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని పోలీసులు తెలిపారు. గత సంవత్సరం, కోల్చెస్టర్ అవెన్యూలోని ఎటిఎం నుండి డబ్బు తీసుకుని వచ్చిన 77 ఏళ్ల వ్యక్తి వద్ద దొంగలించడానికి ప్రయత్నించినా దొంగను ఆ వృద్ధుడు ప్రతిఘటించినందున దొంగ తప్పించుకున్నాడు.

Most Read Articles

English summary
82 Years Old Man Fights With Car Thief To Save His Car From Theft. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X