రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌ను ఒక్క కిక్‌లోనే స్టార్ట్ చేసిన 84 ఏళ్ల తాత.. వైరల్ అవుతున్న వీడియో
రాయల్ ఎన్‌ఫీల్జ్ బుల్లెట్ బైక్ అంటే 1950-60లలోని యువతరానికి మహా క్రేజ్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డుగ్గు డుగ్గు మంటూ రోడ్డు పైన ఆ బైక్ వస్తుంటే.. ఎవరైనా సరే కళ్లగప్పించి చూడాల్సిందే.. కానీ ఆ బైక్‌ను ఎనిమిది పదుల వయసున్న నడుపుతుంటే.. ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయాల్సిందే మీరు..
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఫస్ట్ కిక్‌లో స్టార్ట్ చేయాల్సిందే యూత్‌కి ఒక్కోసారి కష్టమే.. అదే మధ్య వయస్కులు, వృద్ధాప్యంలో ఉన్న వారికి కొంచెం కష్టమే అని సులభంగా అర్థమయ్యే ఉంటుంది. కానీ ఇక్కడ 84 ఏళ్ల వృద్ధుడు వింటేజ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌ను ఈజీగా స్టార్ట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు దాదాపు వందేళ్ల చరిత్ర ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను ఎలాగైనా కొనాలనేది ఈ కాలం యువతకే కాదు.. గత 60-70 ఏళ్ల క్రితం ఉన్న యువతకి కూడా మహా క్రేజ్. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మంచి ఫిజికల్ ఫిట్‌నెస్ ఉన్న యువకులు, పెద్దవారు మాత్రమే ఉపయోగించడం చూశాం.
దీన్ని బట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు బరువైనవే కాకుండా వీటిని స్టార్ట్ చేయడం కొంచెం కష్టమని తెలుసు. అయితే నేటి ఆధునిక కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఎవరైనా ఉపయోగించగలిగే విధంగా తేలికగా మారినప్పటికీ.. ఆ బైక్‌ల గురించి ఆలోచించినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వాటి క్లాస్ లుక్ మరియు అధిక బరువు.

ప్రత్యేకించి, 1950-1970లలో తయారుచేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఇప్పటికీ భారీగా ఉన్నాయి. ఇంకా వీటిని స్టార్ట్ చేయడం కష్టం. కానీ నిజానికి, బైక్ యొక్క ఈ లక్షణాలే వాటిని ఇతర బ్రాండ్ బైక్‌ల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టడమే కాకుండా, చాలా మంది ఈ బైక్‌ల కోసం క్యూలో నించునేలా చేశాయి. అలాగే, కొంతమంది ఇప్పటికీ తమ 50, 60 ఏళ్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను అపురూపంగా దాచుకుంటున్నారు.
ఇందుకు కారణం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల బలమైన నిర్మాణమనే చెప్పవచ్చు. ఇలా ఇప్పటికీ వాడుకలో ఉన్న 1969 నాటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌ను ఓ వృద్ధుడు ఈజీగా స్టార్ట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆశ్చర్యకరమైన విషయమేమంటే ఆ వృద్ధుడి వయసు 84 ఏళ్లు.
ఈ వయసులో కూడా తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకున్న ఈ తాత.. ఈ భారీ బైక్‌ను స్టార్ట్ చేసి చాలా మందిని ఆశ్చర్యపరిచారు. ఒక్క కిక్‌లోనే బైక్ స్టార్ట్ చేస్తున్న ఆ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి రైడర్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో బుల్లెట్ బైక్‌లకు మార్కెట్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అన్నింటికంటే, మనలో చాలా మందికి మొదట బుల్లెట్ బైక్‌లు మాత్రమే తెలుసు. కొంత కాలం తర్వాత రాయల్ ఎన్‌ఫీల్డ్ అనే కంపెనీ దీన్ని తయారు చేస్తోందని తేలింది. ఈ బైక్‌లు 1900 నుండి ఉత్పత్తిలో ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 దాని విలక్షణమైన డిజైన్, నమ్మకమైన పనితీరు, చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఇప్పటికీ ఫేవరెట్‌గా ఉంది.
1969లో బుల్లెట్ 350 సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో మార్కెట్లోకి విడుదలైంది. 1969 మోడల్‌లో ఒకే ఓవర్‌హెడ్ క్యామ్‌షాఫ్ట్ (SOHC) డిజైన్‌తో 346cc ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ అధిక వేగం కోసం రూపొందించబడలేదు. బదులుగా ఇది సౌకర్యవంతమైన క్రూజింగ్ అనుభవం కోసం తగినంత శక్తిని మరియు టార్క్‌ను అందించడానికి తయారుచేశారు.
ఈ క్రమంలో నేటి తరం యువకులు పాతకాలపు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను స్టార్ట్ చేయడానికి కష్టపడుతుండగా, ఈ 84 ఏళ్ల వృద్ధుడు దీన్ని ఈజీగా స్టార్ట్ చేశారు. 1969లో ఈ బుల్లెట్ 350 బైక్ తయారైనప్పుడు ఈ తాత వయసు 30 ఏళ్లు. ఈ వయసులో కూడా తనకున్న శక్తితోనే ఈ బైక్‌ను స్టార్ట్ చేసి వారెవా అనిపించారు.


Click it and Unblock the Notifications








