80 ఏళ్ల తరువాత మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

చిన్న తనంలో మెర్సిడెస్ బెంజ్ కారును కొనాలనే తన చిరకాల కోరికను ఓ రైతు 88 ఏళ్ల వయస్సులో తీర్చుకున్నాడు. బ్రాండ్ న్యూ మెర్సిడెస్ కారును కొనుగోలు చేసి ఇది నా చిన్ననాటి కోరిక అని చెబుతూ తమిళనాడుకు చెందిన ద

By Anil Kumar

"కలలు కనండి... ఆ కలలను కష్టపడి సాకారం చోసుకోండి" ఇవి మిస్సైల్ మ్యాన్ ఏ.పీ.జ్ అబ్దుల్ కలాం గారు అన్నమాటలు. పలకడానికి చాలా సులభంగానే ఉంటాయి. కానీ దీనిని నిజం చేయడం అంత సులువేమీ కాదు. కానీ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని కష్టపడితే ఫలితం ఖచ్చితం అంటున్నాడు ఈ 88 ఏళ్ల భారత రైతు.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

చిన్న తనంలో మెర్సిడెస్ బెంజ్ కారును కొనాలనే తన చిరకాల కోరికను ఓ రైతు 88 ఏళ్ల వయస్సులో తీర్చుకున్నాడు. బ్రాండ్ న్యూ మెర్సిడెస్ కారును కొనుగోలు చేసి ఇది నా చిన్ననాటి కోరిక అని చెబుతూ తమిళనాడుకు చెందిన దేవరాజన్ మురిసిపోయాడు.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

దేవరాజన్ తనకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నపుడు ఓ మెర్సిడెస్ బెంజ్ కారును చూశాడు. చచ్చేలోపు ఖచ్చితంగా మెర్సిడెస్ కారును కొనాలని అప్పట్లోనే తనకు తాను ప్రమాణం చేసుకున్నాడు. ఖచ్చితంగా ఏ మోడల్ కారో గుర్తుంచుకోలేకపోయాడు గానీ తనకు తాను చేసుకున్న ప్రామిస్‌ను ఇవాళ నిజం చేశాడు.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

ప్రపంచం చాలా ముందుకెళ్లిపోయింది, తనతో పాటు మరో మూడు తరాలు ముందుకొచ్చేశాయి. ఎంత కష్టపడినా తన చిరకాల కోరికను సాకారం చేసుకోలేకపోయాడు. తన జీవితం మొత్తం ఎద్దుల బండ్లు మరియు సైకిల్ మధ్యనే గడిచిపోయింది.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

ఎన్నేళ్లు కష్టపడినా కూడా త్రీ-పాయింట్ మెర్సిడెస్ లోగో ఉన్న ఆ కారును మరిచిపోలేదు, దానిని కొనాలనే కోరిక అలాగే బలంగా మదిలో నాటుకుపోయింది. సుమారుగా 80 ఏళ్లు గడిచిన తరువతా దేవరాజన్ చెన్నైలోని ట్రాన్స్ కార్స్ మెర్సిడెస్ బెంజ్ డీలర్ వద్ద తన డ్రీమ్ కారు మెర్సిడెస్ బి-క్లాస్ కొనుగోలు చేశాడు.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

దేవరాజన్ చిన్ననాటి డ్రీమ్ గురించి తెలుసుకున్న మెర్సిడెస్ బెంజ్ షోరూమ్ నిర్వాహకులు, "మీ కల నిజమయ్యింది" అనే అక్షరాలు మరియు మెర్సిడెస్ లోగో ఉన్న స్పెషల్ కేకుతో దేవరాజన్ గారిని ఆశ్చర్యపరిచారు.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ కారు 1.6-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ మరియు 2.2-లీటర్ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల టుర్భో-ఛార్జ్‌డ్ డీజల్ ఇంజన్‌లతో లభ్యమవుతోంది. పెట్రోల్ ఇంజన్ 136బిహెచ్‌పి పవర్ మరియు డీజల్ ఇంజన్ 122బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ కొనుగోలు చేసిన రైతు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఆశకు వయస్సు లేదని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణ. ప్రతి మనిషిలో దేవరాజన్ గారి లాంటి తపనం ఉంటే ఎలాంటి కలలనైనా సాకారం చేసుకోవచ్చు. కలలను కనడం తప్పుకాదు వాటిని సాకారం చేసుకోలేకపోడమే తప్పు. మనసు పెట్టి ప్రయత్నిస్తే ఎలా కలలైనా సాధ్యమవుతాయని దేవరాజన్ నిరూపించాడు.

Most Read Articles

English summary
Read In Telugu: 88-Year-Old Indian Farmer Buys Mercedes-Benz To Fulfil Childhood Dream
Story first published: Saturday, July 7, 2018, 13:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X