రూ.19 కోట్లు నొక్కేసిన నటి, వాటితో జల్సాల మీద జల్సాలు
ఆమె చెన్నైకి చెందిన ప్రముఖ నటీమణి. త్వరలోనే జాన్ అబ్రహామ్ నిర్మిస్తున్న మద్రాక్ కెఫే అనే చిత్రంలో కనిపించనుంది. అయితే ఆమె ఇప్పుడు చీటింగ్ కేసులో అరెస్టయి జైల్లో ఊచలు లెక్కపెడుతోంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా..? చెన్నైకి చెందిన నటీమణి లీనా మరియా పౌల్ గురించి. రూ.19 కోట్ల చీటింగ్ కేసులో ఈమెను చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. పట్టుమని పాతికేళ్ల వయస్సు లేని ఈ భామ అప్పణంగా రూ.19 కోట్లు మింగేసి, వాటితో లగ్జరీ లైఫ్ అనుభవిస్తోంది.
లీనా మరియా పౌల్ ఆమె సహజీవన భాగస్వామి చంద్రశేఖర్‌లు చెన్నైలోని కెనరా బ్యాంకులో మోసానికి పాల్పడి రూ.19 కోట్లు నొక్కేశారు. ఇలా నొక్కేసిన డబ్బుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 లగ్జరీ కార్లను కొనుగోలు చేసిన ఈ మద్రాసీ ముద్దుగుమ్మ. మోహన్ లాల్ రెడ్ చిల్లీస్ చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ఈ భామపై చెన్నై పోలీసులు సెక్షన్ 420 (చీటింగ్), 120బి (క్రిమినల్ కాన్స్‌పైరసీ) మరియు 406 (నమ్మకాన్ని వమ్ము చేయటం)ల క్రింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులతో పాటుగా మరో ఆరు అదనపు కేసులను ఆమెపై నమోదు చేసారు. ఈ చీటింగ్ కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేస్తారని తెలుసుకున్న లీన్, చంద్రశఖర్‌లు ఢిల్లీకి చెక్కేసి అక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో మకాం పెట్టారు. ఈ ఫామ్‌హౌస్‌కు వాళ్లు ప్రతినెలా 4 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈమె కొనుగోలు చేసిన కార్లలో రోల్స్ రాయిస్, ఆస్టన్ మార్టిన్, హమ్మర్, టొయోటా ల్యాండ్ క్రూజర్, ల్యాండ్ రోవర్ తదితర లగ్జరీ మోడళ్లున్నాయి. మోసాలతో వచ్చే విలాసాలు కలకాలం ఉండవయా.. అన్నట్లు తప్పు చేసిన వారు ఎప్పటికైనా దొరక్కపోరు.

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
హమ్మర్ ధర సుమారు రూ.1.5 కోట్లు

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
ఆస్టన్ మార్టిన్ కారు సుమారు రూ.1.5 కోట్లు

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
నిస్సాన్ జిటిఆర్ ధర సుమారు రూ.4 కోట్లు

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
రోల్స్ రాయిస్ ధర సుమారు రూ.4.5 కోట్లు

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
టొయోటా ల్యాండ్ క్రూజర్ ధర సుమారు రూ.1 కోటి

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
ల్యాండ్ రోవర్ ధర సుమారు రూ.1 కోటి

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
బిఎమ్‌డబ్ల్యూ ధర సుమారు రూ.55 లక్షలు

రూ.19 కోట్లు నొక్కేసిన 9 లగ్జరీ కార్లు కొనుగోలు చేసిన నటి
మిత్సుబిషి ఇవల్యూషన్ ఎక్స్ ధర సుమారు రూ.50 లక్షలు

Click it and Unblock the Notifications