95 శాతం మందికిపైగా సొంత వాహనాలు లేవు.. కొంతమంది ఎక్కడికెళ్లాలన్నా నడిచే వెళ్తారు!

భారత్‌దేశంలో మూడో అతిపెద్ద వాహన మార్కెట్‌గా ఈ ఏడాది ప్రారంభంలో అవతరించింది. జపాన్‌ను అదిగమించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 ప్రకారం దేశంలోని 50 శాతం కుటుంబాలు బైక్‌లు, స్కూటర్లు లేదా కనీసం సైకిల్‌ను కలిగి ఉన్నారు.

వెలుగులోకి షాకింగ్‌ విషయాలు: అయితే తాజాగా బిహార్ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనలో షాకింగ్‌ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో మెజారిటి ప్రజలకు సొంత వాహనాలు లేవని ఈ కుల గణనలో వెల్లడైంది. ఇప్పటికీ బిహార్‌లో చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారని ఇదివరకే వెల్లడైంది.

bihar caste survey latest news

తాజా కుల గణన లెక్కల ప్రకారం.. బిహార్‌లో ఉన్న ప్రజల్లో 95.49 శాతం ప్రజలకు సొంత వాహనాలు లేవని వెల్లడైంది. అంటే కేవలం 4.51 శాతం మంది ప్రజలు మాత్రమే సొంత వాహనాలు కలిగి ఉన్నారని ఇటీవల నిర్వహించి కులాల వారీగా నిర్వహించిన సర్వేలో తెలిసింది.

ఇప్పటికీ నడుచుకుంటూ వెళ్తున్నారు : బిహార్‌లో చాలా మంది ప్రజలు బస్సులు, రైళ్లు వంటి ప్రజా రవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగిస్తున్నారని తెలిసింది. అక్కడున్న ప్రజల్లో ఇప్పటికీ చాలా మంది ఎక్కడికెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్తున్నారని కులగణన సర్వే షాకింగ్ గణాంకాలను వెల్లడించింది.

over 95 percentage of bihar population do not have own vehicle

కేవలం 60 లక్షల మందికి మాత్రమే : బిహార్‌ మొత్తం జనాబా 13.07 కోట్లుగా ఉంది. అయితే తాజాగా నిర్వహించిన కుల గణన సర్వేలో 12.48 కోట్ల మందికి సొంత వాహనాలే లేవని ఈ సర్వేలో వెల్లడైంది. అంటే బిహార్‌లో కేవలం 60 లక్షల మందికి మాత్రమే సొంత వాహనం ఉందని, వారిలో 49.69 లక్షల మందికి ద్విచక్ర వాహనాలు మాత్రమే ఉన్నారని తేలింది.

బిహార్‌లో కేవలం 5.72 లక్షల మంది మాత్రమే కారు యాజమానులు ఉన్నారని సర్వేలో తేలింది. దీంతోపాటు ఆ రాష్ట్రంలో 1.67 లక్షల మంది కనీసం ఒక ట్రాక్టర్‌ను కలిగి ఉన్నారు. అయితే వాహనాల సంఖ్య తక్కువగా ఉంటే ట్రాఫిక్‌ జామ్‌ ఇబ్బందులు సహా రోడ్డు ప్రమాదాలు కూడా తక్కువగా జరుగుతాయి.

bihar caste survey news

జనరల్‌ కేటగిరిలో : కులగణనకు సంబంధించిన సర్వే నివేదికను బిహార్ ఉభయ సభలకు సమర్పించింది. జనరల్‌ కేటగిరికి చెందిన 2.01 కోట్ల మంది జనాభాలో 11.99 లక్షల మంది ద్విచక్ర వాహనాలు కలిగి ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే భారత జనాభాతో పోలిస్తే వాహనాల సంఖ్య తక్కువగా ఉంది.

గోవాలో మాత్రం : ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గత సంవత్సరం చివర్లో నిర్వహించిన సర్వే నుంచి మొత్తం దేశంలోని 12 కుటుంబాల్లో ఒక కుటుంబం మాత్రమే కారును కలిగి ఉంది. గోవాలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఒక్క ఇంటికి అత్యధిక కారు యాజమాన్యం ఉన్న రాష్ట్రంగా నిలిచింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Thursday, November 9, 2023, 15:17 [IST]
English summary
95 percentage of bihar do not possess any own vehicle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+