వెదురు బొంగులతో సైకిల్‌ను రూపొందించిన ఔత్సాహిక డిజైనర్

పూర్తిగా చేతుల్తో బ్యాంబూ(వెదురు బొగుల)లను ఉపయోగించి డిజైన్ చేసిన ఈ 'బ్యామ్‌బైక్'ను తయారు చేయడానికి శర్మకు దాదాపు 10 రోజుల సమయం పట్టిందట. నాణ్యమైన, దృఢమైన వెదురు బొంగులను సేకరించి ఈ బైక్‌ను రూపొందించాడు. దీన్ని తయారు చేయడానికి ఆయనకు దాదాపు రూ. 30,000 ఖర్చయిందట. బొంగుల్తో చేసినదానికి ఇంత ఖర్చా..? అని శర్మను అడిగితే.. ఆయన చెప్పే సమాధానమేంటో తెల్సా... సైకిల్‌ను రూపొందించడమంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని అని, ఇందుకు ఎక్కువ సమయాన్ని, శక్తిని వెచ్చించాల్సి వస్తుందని ఆయన చెబుతున్నాడు. మరి వెదురు బొంగులతో చేసిన ఈ బ్యామ్‌బైక్ గట్టిందా ఉంటుందా అనే కదా మీ అనుమానం. భద్రత విషయంలో ఎలాంటి ఢోకా లేదని, ఏప్రిల్ 2009 నుంచి తాను బైక్‌ని ఉపయోగిస్తున్నానని శర్మ చెబుతున్నాడు. అంతా బాగానే ఉంది కాని.. ధరే కాస్తంత ఎక్కువగా అనిపిస్తుంది కదూ..!


Click it and Unblock the Notifications