రైల్లో రచ్చ చేసిన యువతులు.. కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో గ్రూప్‌ డ్యాన్స్‌

ఈ మధ్య కాలంలో ఏం జరిగినా క్షణాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మెట్రో సహా ఇతర ప్రాంతాల్లో చేస్తున్న డ్యాన్స్‌ వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ రైళ్లో ప్రయాణిస్తున్న యువతుల బృందం డ్యాన్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట ట్రిండింగ్‌గా మారింది. అనేక మంది నెటిజన్లు ఈ డ్యాన్స్‌పై స్పందిస్తున్నారు.

రైళ్లో వెళ్తున్న కొంత మంది యువతుల్లో పైన సీట్లో ఉన్న యువతి తొలుత డ్యాన్స్‌ ప్రారంభించగా.. దాన్ని అనుసరిస్తూ మరో యువతి కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో డ్యాన్స్‌ చేస్తుంది. అనంతరం అక్కడే ఉన్న మిగిలిన యువతులు ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో మనం చూడొచ్చు. యువతుల బృందం మాత్రం క్రేజీ మూమెంట్స్‌తో ఎంతో రిథమిక్‌గా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. సుమారు 11 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో ఉంది.

group of girls dancing in a train

ఈ వీడియోను whydahi(Himesh's version) అనే ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు. దాంతోపాటు.. నేను, నా సోదరుడు ప్రయాణికుల ముందు ఆహారం కూడా తీసుకోలేమని రాసుకొచ్చింది. దయచేసి నాకు అటువంటి ధైర్యం ఇవ్వు దేవుడా అని కామెంట్‌ చేసింది. అటువంటి ధైర్యం ఎక్కడ దొరుకుతుందని యూజర్లను ప్రశ్నిస్తూ అంటూ మరో కామెంట్‌ చేసింది.

ఇప్పటి వరకు మూడున్నర లక్షలకు పైగా ఈ వీడియోను చూశారు. వేలాది మంది యూజర్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది పాజిటివ్‌గా కామెంట్లు చేయగా.. మరికొందరు నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో ఎటువంటి భయం లేకుండా ఎంతో చక్కగా డ్యాన్స్‌ చేశారంటూ పలువురు అభినందనలు చెబుతున్నారు. యువతుల బృందానికి అభినందనలు చెబుతూనే.. నాలో ఇంత ధైర్యం లేదంటూ కొంతమంది కామెంట్‌ చేశారు.

అదే కంపార్టుమెంట్‌లో తనకు ఓ బెర్త్‌ లభిస్తుందని ఆశిస్తున్నా అంటూ మరో ట్విట్టర్ యాజర్‌ కామెంట్‌ చేశాడు. తనకూ అకస్మాత్తుగా రైలులో ప్రయాణించాలనే కోరిక కలుగుతుందని మరొకరు కామెంట్‌ చేశాడు. అప్పుడు మెట్రోలు, ఇప్పుడు రైళ్లను టార్గెట్‌ చేశారంటూ మరో యూజర్‌ స్పందించాడు. మరికొంత మంది యువతుల వీడియోపై భిన్నంగా స్పందించారు. భారతీయ సంస్కృతిని నాశనం చేస్తున్నారని కామెంట్‌ చేశారు. రైల్వే అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇటీవల ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో యువతి చేసిన డ్యాన్స్‌ వీడియోపై నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందించారు. కొంతమంది సపోర్ట్‌ చేయగా.. మరికొందరు బహిరంగ డ్యాన్స్‌ చేసి ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ విమానంలో యువతి చేసిన డ్యాన్స్‌ సైతం వైరల్‌ అయింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, May 9, 2023, 19:17 [IST]
English summary
A group of girls dancing in a train goes viral
Read more on: #rail
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+