రూ. 70,000లకే ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్.. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు అనే దానికి చక్కటి ఉదాహరణ!!
దేశంలో ఎక్కువ మంది యువత ఇష్టపడే బైక్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలిస్థానంలో ఉంటుంది. ఈ బైక్‌ని కొనేందుకు యువత ఎక్కువగా ఇష్టపడతారు. సరదాగా ఎవరినైనా మీరు ఏ బైక్ కొనాలని చెప్తే టక్కున దీనిపేరే చెబుతారు. అంతలా ఈ బైక్ యువత మనసుని గెలుచుకుంది. డిజైన్‌లో బెస్ట్, అదిరిపోయే ఫీచర్లు ఉండటంతో బైక్‌ని కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఎగబడుతున్నారు. తాజాగా హర్యానాకు చెందిన ఓ యువకుడు తన వద్ద ఉన్న కొన్ని టూల్స్‌తో ఎలక్ట్రిక్ బుల్లెట్ బైక్‌ని తయారు చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా దీనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కొద్ది రోజుల మోడిఫైడ్ చేయబడిన ఈ బైక్‌కి సంబంధించిన విజువల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా5.7 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 లక్షల మందికి పైగా లైక్ చేయగా, వందలాది మంది కామెంట్ చేశారు. ఆ యువకుడు మార్పు చేసిన పోస్ట్ చేస్తూ మద్దతు ఇద్దాం అనే క్యాప్షన్ ఉండటంతో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. కొంతమంది దీనిని 'బడ్జెట్లో బుల్లెట్' అంటూ మరొకరు కామెంట్ చేశారు.

ఈ బైక్ తయారీకి సుమారు రూ.70 వేలు ఖర్చు చేశాడు. కలపను ఉపయోగించి, దీని ఇంధన ట్యాంకులో సౌండ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశాడు. ఇది అచ్చం బుల్లెట్ లాంటి ధ్వని వస్తుంది. బ్యాటరీతో నడుస్తున్నట్లు దీనిని ఎవరూ గుర్తించలేరు. సైలెన్సర్ లోపల స్పీకర్ (లౌడ్ స్పీకర్) జతచేయబడి ఉంటుంది. ఛార్జర్లు, వాటర్ బాటిల్స్, ఇతర వస్తువుల కోం సీటు దిగువన పెద్ద బూట్ స్పేస్ కూడా ఉంది.
ఈ ఎలక్ట్రిక్ బుల్లెట్‌కి శక్తిని ఇచ్చేందుకు 4 బ్యాటరీలను అందిచారు. దీనిని సులభంగా ఛార్జింగ్ చేయడానికి ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఆప్షన్‌ని అందించాడు. మోటార్ సైకిల్ తయారీకి పాత బుల్లెట్ లోని కొన్ని భాగాలను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ధర రూ .1.74 లక్షల-రూ .2.16 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మధ్య ఉంది.

ప్రస్తుతం బుల్లెట్స్ మిలిటరీ సిల్వర్ రెడ్ & మిలిటరీ సిల్వర్ బ్లాక్, బ్లాక్ గోల్డ్, స్టాండర్డ్ మెరూన్ & స్టాండర్డ్ బ్లాక్, మిలిటరీ రెడ్ & మిలిటరీ బ్లాక్ ఆప్షన్‌లో వస్తుంది. కొత్త బుల్లెట్ 350లో 349 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ జె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇది 20.4 PS గరిష్ట శక్తిని మరియు 27nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ బుల్లెట్ 5-స్పీడ్ గేర్ బాక్స్ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ బైక్ సుమారు లీటరుకు 37 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. హాలోజెన్ హెడ్ లైట్, టెయిల్ లైట్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బరువు 195 కిలోలు మరియు 13 లీటర్ల కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ కలదు. డిస్క్ బ్రేక్స్ ఇతర స్మార్ట్ ఫీచర్లతో సరికొత్తగా వస్తున్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








