ఇలా ఉన్నారేంట్రా బాబు.. రీల్స్‌ కోసం స్పైడర్‌ మ్యాన్‌ అవతారం.. కట్‌ చేస్తే దిమ్మతిరిగే ఝలక్!

సోషల్ మీడియాలో లైక్స్ కోసం యువత బరితెగిస్తున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో రీల్స్‌ చేస్తూ చివరకు కటకటాల పాలవుతున్నారు. ప్రస్తుతం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రీల్స్‌ (Instagram Reels) ట్రెండింగ్‌ నడుస్తోంది. ప్రతీ ఒక్కరూ రోజులో కనీసం 30 నిమిషాలు అయినా సరే రీల్స్‌ చూస్తున్నట్లు నివేదికలు కూడా సూచిస్తాన్నాయి. అయితే కొందరు దీనికి బానిసైనట్లు కూడా వెల్లడైంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో పాపులర్ అయ్యే ప్రయత్నంలో చాలా మంది వివిధ రకాల పిచ్చి పనులు చేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా యువతరంలో కొందరు లైక్స్ కోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ విధంగా స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఉన్న ఓ యువకుడు పలువురికి షాక్ ఇచ్చాడు. అసలు ఏమి జరిగింది? దాని గురించి మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హాలీవుడ్ సినిమా క్యారెక్టర్ స్పైడర్ మ్యాన్ గురించి అందరికీ తెలుసు. స్పైడర్ మ్యాన్ అనేది ఒక కల్పిత (Created) చలనచిత్ర పాత్ర, స్పైడర్‌ మ్యాన్‌కి అనితర సాధ్యమైన శక్తి ఉంటుందని అంటారు. అతను ఓ బిల్డింగ్‌ నుంచి మరో బిల్డింగ్‌కి అలవోకగా దూకగలడు. ప్రమాదంలో ఉన్న ప్రజలను రక్షించడానికి సాలెపురుగు (Spider) వంటి దారాన్ని ఉపయోగిస్తాడు. ఈ సూపర్ హీరో పాత్రకు ప్రపంచవ్యాప్తంగా, మన ఇండియాలో కూడా అభిమానులు ఉన్నారు.

Spiderman-Reels-Delhi-Police-Arrested

ఢిల్లీలో ఓ యువకుడు స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించి వాహనాల్లో ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించాడు. ఆ వీడియోలను ఆ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా చివరికి పోలీసులు కంట పడ్డాయి. దీంతో ఆ వీడియో ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన ఆదిత్య అనే 20 ఏళ్ల యువకుడు.. స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్స్‌లో వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటాడు.

ఈ క్రమంలో తాజాగా ఆయన పోస్ట్ చేసిన వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్ అయ్యింది. ఆదిత్య మహీంద్రా స్కార్పియో-ఎన్ SUV బానెట్‌పై స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ ధరించి ప్రమాదకరంగా కనిపించాడు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను పలువురు ఖండించారు. ఈ చర్య అతడికి ప్రమాదమే కాకుండా ఇతర వాహనాలకు కూడా ప్రమాదం కలిగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Spiderman-Sat-On-Moving-Mahindra-Scorpio-N

దీంతో ఆదిత్యకు సంబంధించిన ఈ వీడియోపై పలువురు పోలీసులను ట్యాగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ సంఘటన సమయంలో మహీంద్రా స్కార్పియో-ఎన్ నడుపుతున్న ఆదిత్యతో పాటు మరో యువకుడు గౌరవ్ సింగ్‌ని ద్వారకా నగర పోలీసులు అరెస్టు చేశారు. ఈ రీల్‌ కోసం వారు ఉపయోగించిన స్కార్పియో-ఎన్ కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేశారు.

ర్యాష్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, కారుకు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకెళ్లకపోవడం వంటి పలు సెక్షన్ల కింద ఆదిత్య, గౌరవ్ సింగ్లపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు అయ్యింది. ఈ చర్యకు గాను వారికి రూ.26,000 జరిమానా విధించారు. ఇద్దరు యువకులకు జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉందని సమాచారం. కారు బానెట్‌పై ప్రయాణించడం అనేది చాలా ప్రమాదకరం.

నిజం చెప్పాలంటే కొన్ని కార్లలో బానెట్ మీద అస్సలు కూర్చోలేరు. ఎందుకంటే బానెట్‌ కొన్ని సార్లు ఏటవాలు డిజైన్‌తో వస్తాయి. మహీంద్రా స్కార్పియో-ఎన్ ఎన్ వంటి పెద్ద కారు బానెట్ పై ఇలా ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే, రోడ్డులో చిన్న గుంత కూడా బానెట్ మీద కూర్చున్న వ్యక్తి కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే, బానెట్‌పై కూర్చోవడం వల్ల డ్రైవర్ రోడ్డును పూర్తిగా చూడలేడు.

ముఖ్యంగా మూల మలుపుల వద్ద బానెట్‌పై ఎవరైనా కూర్చుంటే డ్రైవర్‌ ఏకాగ్రతకు భంగం కలగడమే కాకుండా ప్రమాదానికి దారితీస్తుంది. మరీ ముఖ్యంగా ప్రమాదం జరిగితే రోడ్డుపై ఉన్న ఇతర వాహనదారులకు సైతం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్స్‌ కోసం ఇంటువంటి చర్యలకు ఎవ్వరూ ప్రయత్నం చేయవద్దు. ఈ ప్రమాదకర రీల్స్‌ మీకు హాని చేయడమే కాకుండా ఇతరులకు సైతం ప్రమాదానికి గురి చేసే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Friday, July 26, 2024, 10:15 [IST]
English summary
A man dressed in a spiderman costume sat on the bonnet of a moving mahindra scorpio
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+