చలి కాచుకోవడం కోసం బైక్‌కి నిప్పంటించిన వ్యక్తి.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

చలిని తట్టుకోలేక ఓ వ్యక్తి స్ప్లెండర్‌ బైక్‌కి నిప్పంటించాడు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. మంటలు వ్యాపించడంతో చుట్టు పక్కల వారు బయటకు వచ్చి సదరు వ్యక్తిని పట్టుకున్నారు.

ఢిల్లీలో చలి విజృంభిస్తోంది. చలి తీవ్రతను తట్టుకునేందుకు చాలామంది ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే ఓ వ్యక్తి చేసిన వింత ఘటనతో దేశ రాజధాని నగరంలోని పుల్ ప్రహ్లాద్‌పూర్ ప్రాంతం ఒక్కసారిగా ఉలికి పడింది. ఉదయం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బైక్‌ పక్కన నిల్చుని చలి కాచుకుంటున్న వ్యక్తిని చూసి వారు ఒక్కసారిగా అవక్కాయ్యారు. ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది.

Delhi-Man-Sets-Fire-To-Bike

చలి నుంచి ఉపశమనం పొందడం కోసం ఈ ఆకతాయి చేసిన పనికి జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు ఆ వ్యక్తి కావాలనే నిప్పంటిచాడని లేదా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంత కోసం ఈ పని చేశారా అని పలు ప్రశ్నలు ఉత్ఫన్నమవుతున్నాయి. దీని వెనక ఏదైన కోణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు. చలి సాకుతో బైక్‌కి నిప్పంటించడం ఏంటని ఇరుగు పొరుగు వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జనవరి 25 ఉదయం 3 గంటల సమయంలో, కుమార్ అనే వ్యక్తి ఢిల్లిలోని పుల్‌ ప్రహ్లాద్‌పూర్‌లోని ఓ కాలనీలో ఇంటి ముందు పార్కింగ్‌లో ఉంచిన హీరో స్ప్లెండర్ మోటార్‌సైకిల్‌కి నిప్పంటించాడు. ఆ బైక్‌పై తనతో తెచ్చుకున్న గోనె సంచిని పెట్టి నిప్పంటించాడు. దీనిపై స్థానికులు వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందిచారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరా ఆధారంగా సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.

Delhi-Man-Sets-Fire-To-Bike

బైక్‌ కాలిపోతున్నట్లు ఉదయం 4.37 గంటలకు మాకు కాల్ వచ్చిందని.. వెంటనే అక్కడతు తమ బృందాన్ని పంపించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వెంటనే అగ్నిమాపక శాఖ సహాయంతో మంటలను అదుపు చేసినట్లు అయితే అప్పటికి మోటారుసైకిల్ పూర్తిగా దగ్ధమైందని వారు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీ సహాయంతో కుమార్‌ను గుర్తించామని, అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డావని ప్రశ్నించగా.. చలిగా ఉండటంతో మోటార్‌సైకిల్‌కు నిప్పంటించాడని కుమార్ పోలీసులకు చెప్పాడు. దీంతో వారు అవాక్కయ్యారు. వెంటనే అతనిపై IPC సెక్షన్ 435 (నష్టం కలిగించే ఉద్దేశ్యంతో అగ్నిప్రమాదం లేదా పేలుడు పదార్థాలను వినియోగించడం) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన కథనం ప్రకారం ఘటనకు ముందు అతను సంఘటనా స్థలం సమీపంలో ఆగి ఉన్న ఆటో రిక్షాలో కూర్చున్నాడని దీనిని కొందరు గమనించారని తెలిపారు.

తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న కుమార్.. సంఘటన జరిగిన అదే బ్లాక్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడా లేక మత్తులో ఉన్నాడా అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు అతడికి వైద్య పరీక్షలు చేశారు. బైక్‌లకు నిప్పంటించే కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా హైలట్‌ అవుతుండటం గమనార్హం. అయితే కొన్ని సంఘటనలు దేశవ్యాప్తంగా వైరల్‌ అవుతున్నాయి.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, January 28, 2024, 13:50 [IST]
English summary
A man sets fire splendor bike to beat cold visuals gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+