కొడుకుని రైలు ఎక్కించేందుకు వచ్చిన తండ్రికి భారీ ఫైన్‌ వేసిన TC.. కాన్పూరులో వింత ఘటన.. అసలేం జరిగిందంటే?

దేశంలో ఎక్కువ మంది జనాలు రైల్వే ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. వీటిలో ప్రయాణం చాలా తక్కువతో కూడుకున్నది. ఎక్కువగా మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు దూర ప్రయాణాల కోసం ట్రైన్‌ మార్గాన్ని ఎంచుకుంటారు. అయితే రోజులు మారుతున్న కొద్ది రైల్వే ప్రయాణం కూడా మరింత వేగవంత సర్వీస్‌ని అందిస్తుంది. ప్రస్తుతం దేశంలో వందేభారత్‌ ట్రైన్స్ దేశంలోనే ముఖ్య నగరాలను కలుపుతున్నాయి. దీని ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గుతోంది. అయితే వీటి ఖర్చు కాస్త ఎక్కువే అని చెప్పాలి. అయితే వేగంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇదొక వేగవంతమైన రవాణా మార్గంగా ఉంది. అయితే సామాన్యులకు అందుబాటులో ధరలు ఉంటే బాగుండేది అని ప్రతీ ఒక్కరూ భావిస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే వందేభారత్‌ రైలులో కొడుకును దింపేందుకు వచ్చిన తండ్రికి భారీ జరిమానా పడింది. ఈ ఘటన ఇప్పుడు ఇంటర్‌నెట్‌ని షేక్‌ చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన రామ్ విలాస్ యాదవ్ కొడుకు వారణాసి-న్యూఢిల్లీ వెళ్తున్న వందే భారత్ రైలులో కాన్పూర్ నుంచి ఢిల్లీకి టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ రైలులో సీ6 బోగీలో అతడికి సీటు రిజర్వ్‌ అయ్యింది.

Vande Bharat Automatic Door Lock

అయితే రామ్ విలాస్ యాదవ్ తన కుమారుడిని స్టేషన్‌లో దిగబెట్టేందుకు రైల్వేస్టేషన్‌కి వచ్చాడు. ఈ సమయంలో వారణాసి నుంచి రైలు కాన్పూర్ రైల్వే స్టేషన్‌కి చేరుకున్న క్రమంలో కొడుకు దగ్గర లగేజీ ఎక్కువగా ఉండటంతో తండ్రి కూడా రైలు ఎక్కి లగేజీని తన సీటు వరకు చేర్చాడు. అయితే రామ్ విలాస్ యాదవ్ రైలు దిగేలోపే రైలు ఆటోమేటిక్ డోర్లు పడిపోయాయి.

దీంతో రామ్ విలాస్ యాదవ్ రైలు దిగే లోపే ఆటోమేటిక్‌ డోర్లు పడిపోవడంతో కాన్పూర్ రైల్వే స్టేషన్ నుంచి రైలు ఢిల్లీకి బయలుదేరింది. ఇది ఆటోమేటిక్‌ కావడంతో రైలును దిగేందుకు యాదవ్‌కి అవకాశం లేకుండా పోయింది. మొత్తానికి రైలులోని అన్ని డోర్లు మూసుకుపోవడంతో రైలు లోనే చిక్కుకుపోయాడు.

Man Struck in Vande Bharat fined by Railway

ఈ క్రమంలో తన వద్ద టికెట్ లేదని తెలుసుకున్న టికెట్ చెకర్‌ యాదవ్‌ వద్ద టికెట్ లేకపోవడంతో టికెట్ ఛార్జీలకు రెట్టింపు జరిమానా విధించాడు. కాన్పూర్ నుంచి న్యూఢిల్లీకి వందే భారత్ రైలు ఛార్జీ రూ.1830 కాగా.. అతడిగి రూ. 2,870 జరిమానా విధించాడు. అంటే టికెట్‌ దరకంటే అతడికి పాటు అదనంగా రూ.1,039 జరిమానా పడింది.

జరిమానా చెల్లించి అదే రైలులో ఢిల్లీ వెళ్లడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వందేభారత్‌ రైళ్లలో ఆటోమేటిక్ డోర్లు పడిపోవడం వల్ల ప్రయాణికులు రైలు లోపల ఇరుక్కుపోయిన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వందే భారత్ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే యంత్రాంగం అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహిస్తోంది.

Vande Bharat Automatic Door Locks

ప్రయాణికులు తప్ప రైలు ఎక్కొద్దని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు. కానీ ఇది పూర్తిగా అవగాహనా రాహిత్యం కావడంతో జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఇది తెలియక చాలా మంది వందేభారత్ రైలులో ప్రయాణికులతో పాటు రైలుని ఎక్కి ఆ తర్వాత అందులో ఇరుక్కుపోతున్నారు. దీంతో అనవసరంగా జరిమానాల బారిన పడాల్సి వస్తోంది. ఈ ఆటోమేటిక్ డోర్ల వల్ల కొన్ని సార్లు ప్రయాణికులకు తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి.

ఎందుకంటే వారు ఏదైనా స్టేషన్‌లో దిగి తమకు అవసరమైన వస్తువును కొనుగోలు చేసి ప్లాట్‌ఫామ్‌కి చేరుకునే సమయానికి రైలు ఆరంభమై డోర్లు పడిపోతున్నాయి. దీనివల్ల కొందరు ట్రైన్‌ కూడా మిస్‌ అవుతున్నారు. ఇక చివరగా వందే భారత్ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు మినహా రైలులో ఇతరలు రైలులోకి ప్రవేశించకపోవడం ఉత్తమం. ప్రయాణికులు కూడా లాస్ట్‌ స్టాప్‌లో దిగాల్సి స్టాప్‌ వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు.

More from DriveSpark

Article Published On: Wednesday, November 20, 2024, 18:01 [IST]
English summary
A man struck in the vande bharat train while trying to assist his son fined by railway
Read more on: #india #fine
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+