విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ విండో తెరిచిన ప్రయాణికుడు.. వీడియో వైరల్‌

ఆసియానా ఎయిర్‌లైన్స్‌ విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ విండో తెరిచాడు. దీంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటనలో సుమారు 12 మంది గాయపడ్డారు. పలువురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన శుక్రవారం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది.

ఆసియానా ఎయిర్‌లైన్స్ విమానం దక్షిణ కొరియాలోని జెజు నుంచి డేగు నగరంలోని విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. విమానం సుమారు గంట ప్రయాణం చేసిన తర్వాత కొద్ది నిమిషాల్లో డేగు విమానాశ్రయానికి చేరుతుందనగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ విండో తెరిచాడు. ఘటన జరిగిన సమయంలో విమానం సుమారు 600 అడుగుల ఎత్తులో ఉందని తెలుస్తోంది. అయితే విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని అధికారులు ప్రకటించారు.

passenger opened emergency door in asiana airlines flight

ఎమర్జెన్సీ విండో తెరిచాడని భావిస్తున్న 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు తన నేరం అంగీకరించాడని, కానీ ఎందుకు అలా చేశాడో చెప్పలేదని పోలీసులు వెల్లడించారు. దక్షిణ కొరియా ఏవియేషన్‌ చట్టాల ప్రకారం విమానాల్లో అనుమతి లేకుండా విండో, డోర్‌ తెరవడం సహా ఇతర ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా పది సంవత్సరాల వరకు శిక్ష పడవచ్చు.

passenger opened emergency door in asiana airlines flight

ఈ ఘటనపై విమానం లోపలి ప్రయాణికులు తీవ్ర ఆందోళకు గురయ్యారు. విమానం పేలిపోతుందని తాను భావించానని, ఎమర్జెన్సీ విండో సమీపంలో ఉన్న ప్రయాణికులు మూర్చపోతున్నట్లు కనిపించారని ఓ ప్రయాణికుడు తెలిపాడు. ప్రస్తుతం ఈ విమానానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

విమానంలోని ఎమర్జెన్సీ తలుపులు తెరవడం కొంచెం కష్టంతో కూడుకున్న పనని. అయినా అవి గణనీయమైన ప్రెజర్‌ను తట్టుకొనే విధంగా తయారుచేయబడతాయని ఏవియేషన్‌ నిపుణుడు నిక్‌ విల్సన్ తెలిపాడు. విమానాల్లోని సాధారణ మరియు అత్యవసర తలుపులు క్యాబిన్‌లో ప్రెజర్‌ను సరిగ్గా ఉండేలా చూస్తాయి.

సరైన ప్రెజర్‌ లేకుంటే విమానాల్లోని ప్రయాణికులకు ఆక్సిజన్ అందకపోయే ప్రమాదం ఉంటుందన్నారు. మరియు స్పృహ కోల్పోవచ్చని విల్సన్ తెలిపారు. తక్కువ ఎత్తులో విమానం ఉన్నప్పుడు ప్రెజర్ తక్కువ ఉంటుందని.. ఫలితంగానే ఎమర్జెన్సీ విండో తెరవగలిగి ఉంచవచ్చని విల్సన్‌ తెలిపారు.

నిందితుడు ఎమర్జెన్సీ విండో తెరిచేందుకు ప్రయత్నించిన అక్కడున్న ఫ్లైట్‌ అటెండెంట్లు అతన్ని నిలువరించేందుకు ప్రయత్నం చేశారు. అయినా నిందితుడు నిలువరించలేకపోయారు. విమానంలోని పురుష ప్రయాణికుల సాయం కోసం ఫ్లైట్‌ అటెండెంట్లు కోరినట్లు తెలుస్తుంది. నిందితుడిని నిలువరించేందుకు సమీపంలో ఉన్నవారు కూడా ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో సుమారు 200 మంది ప్రయాణిస్తున్నారు.

ఈ మధ్య కాలంలో విమానాల్లో అసభ్యకర ఘటనలు సైతం ఎక్కువగానే జరుగుతున్నాయి. దీనిపై మద్యం తాగి తోటి ప్రయాణికులపై దాడి చేయడం సహా కొన్ని తాజాగా వెలుగులోకి వచ్చాయి. పలువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Sunday, May 28, 2023, 9:01 [IST]
English summary
A man who opened emergency door in asiana airlines flight in south korea was arrested
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+