పునర్జన్మ అంటే ఇదేనేమో.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం, షాక్‌లో ఇండిగో ఎయిర్‌లైన్స్‌

ఢిల్లీ విమానాశ్రయం(Delhi Airport Flights Collision)లో తాజాగా రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొనేంత దగ్గరగా వెళ్లిన సంఘటన సంచలనం రేపింది. అదృష్టవశాత్తు ఇందులో రెండు విమానాలను ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో వందలాది మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో..

భారత్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఢిల్లీ విమానాశ్రయం(Flights Collision Missed) ముందు వరుసలో ఉంటుంది. ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల నిర్వహణ కోసం నాలుగు రకాల రన్‌వేలు.. 27, 28, 29 కుడి మరియు 29 ఎడమ అని పిలువబడే రన్‌వేలు ఉన్నాయి. విమానం టేకాఫ్ మరియు ల్యాండింగ్ ఇక్కడే జరుగుతాయి.

Indigo-Flights-Collision-Delhi-Airport

కాగా ఈ నెల 17వ తేదీన ఇండిగో(Indigo Airlines) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ321 విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. కాగా అదే సమయంలో రాయ్‌పూర్ నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న అదే ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ 320 ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉంది.

ఈ సందర్భంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరే ఎయిర్‌బస్ 321 రన్‌వే నంబర్ 27 నుంచి టేకాఫ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ దీనికి తగిన విధంగా సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ సిగ్నల్ అందినప్పుడే విమానాలు టేకాఫ్‌ అవ్వాల్సి ఉంటుంది.

Indigo-Flights-Collision-Delhi-Airport

ఈ మేరకు సిగ్నల్‌ రాగానే పైలట్ విమానాన్ని రన్‌వేపై నడుపుతూ సరైన వేగంతో ప్రయాణించిన తర్వాత టేకాఫ్ చేశారు. సూచన ప్రకాకరం విమానం టేకాఫ్ అయిన వెంటనే విమానాన్ని నేరుగా ఎడమవైపు తిప్పాడు. కానీ అదే సమయంలో రాయ్‌పూర్ నుంచి ఢిల్లీకి ఎగురుతున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌బస్ A320 రన్‌వే నంబర్ 29 యొక్క కుడి రన్‌వేపై ల్యాండింగ్‌కు అనుమతి లభించింది.

ఈ సమయంలో రాయపూర్‌- ఢిల్లీ విమానం సరిగ్గా ల్యాండింగ్‌ అవ్వాల్సిన రన్‌వే పైకి వెళ్తుండగా.. అదే సమయంలో ఢిల్లీ- హైదరాబాద్ విమానం ఎడమవైపునకు తిరగడంతో సమస్య ఏర్పడింది. అంటే హైదరాబాద్ వెళ్లే విమానం రాయ్‌పూర్ ఫ్లైట్ రన్‌వేకి లంబంగా ఉండగా.. ఈ విషయాన్ని గమనించకుండా ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు సిగ్నల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

దీని ఫలితంగా, ఈ రెండు విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఎగురుతూ ఉన్నాయి. ఇంకాస్త అయితే అతి పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. సాధారణంగా, ఒక విమానం ఎగురుతున్నప్పుడు, విమానం పైన మరియు దిగువన కనీసం 400 అడుగుల క్లియరెన్స్ ఉండాలి ఇంకా సైడ్స్‌.. 1.2 నాటికల్ మైళ్లు ఉండాలి. అప్పుడే ప్రమాదాలు జరగకుండా ఉంటుంది.

కాగా ఈ సంఘటనలో రెండు విమానాల మధ్య ఎత్తు 800 అడుగులు కాగా.. వాటి మధ్య ఉన్న దూరం కేవలం 0.2 నాటికల్ మైళ్లు మాత్రమే. అంటే దీనర్థం రెండు విమానాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా వెళ్లాయి. దీంతో ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యాలయం ఒక్క క్షణం ఉలిక్కిపడి.. వెంటనే అప్రమత్తమైంది.

ఈ సంఘటనలో రెండు విమానాలు ఎటువంటి ప్రమాదానికి గురి కాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే.. ఒక్క సెకను ఆలస్యమైనా లేదా చిన్న తప్పిదమైనా వందల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లేది. ప్రస్తుతం ఈ సంఘటనపై విచారణ జరుగుతోంది.

అదేవిధంగా రెండ్రోజుల క్రితం ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించిన సంఘటన చోటుచోసుకుంది. గాల్లో ఉండగానే విమానం ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు లోనయ్యారు. ఇండిగో విమానం 6ఈ6125 సోమవారం సాయంత్రం 5.25 గంటలకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరగా.. కాసేపటికే భారీ వర్షం కారణంగా విమానం ఊగిపోయింది.

ఓ వైపు విమానం ఊగుతుంటే అందులోని ప్రయాణికులు భయంతో గట్టిగా కుర్చీలను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జమ్మూ కశ్మీర్ సహా నిన్న పలుప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తడంతో పాటు మరో వైపు మంచు భారీగా కురవడంతో.. ఫలితంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రవాణా సేవలకు అంతరాయం ఏర్పడింది.

More from DriveSpark

Article Published On: Thursday, February 22, 2024, 11:10 [IST]
English summary
A narrow escape indigo flights collision missed at delhi airport check full details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+