ఫెరారీ కార్ ప్లాంట్: అందాల అద్భుతాలను చూడండి

ఫెరారీ అనగానే రయ్ రయ్‌.. మంటూ దూసుకు వెళ్లే ఫార్ములా కార్లు, సూపర్ కార్లు మన కళ్ల ముందు పరుగులు పెడుతాయి. అత్యంత అందమైన, శక్తివంతమైన మరియు సురక్షితమైన కార్లను తయారు చేయటంలో ఫెరారీ పెట్టింది పేరు. మరి ఈ ఫెరారీ పుట్టు పూర్వత్రాల గురించి, అలాగే ఫెరారీ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుందో ఓ లుక్కేందా రండి..!

ఇటలీకు చెందిన ఈ స్పోర్ట్స్ కార్ కంపెనీ ప్రముఖ రేసింగ్ డ్రైవర్ ఎన్జో ఫెరారీ స్థాపించారు. అందుకే ఈ కంపెనీకు ఫెరారీ అని పేరును పెట్టడం జరిగింది. ఎన్జో ఫెరారీ 1919లో తన రేస్ కెరీర్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ఫెరారీ తొలుత రేస్ టీమ్‌లకు మాత్రమే కార్లను విక్రయిుంచేంది. ఫెరారీకు ఇటలీలోని మారనెల్లో పట్టణంలో ఓ కార్ల తయారీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంటును 1940 దశకం ఆరంభంలో ప్రారంభించారు. ఈ ప్లాంటులో రేస్ కార్లు, స్పోర్ట్స్ కార్లు తయారవుతుంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఫెరారీ ఫార్ములా వన్ టీమ్‌కు అనేక మంది అభిమానులు ఉన్నారు. రేస్‌లలో ఈ టీమ్ అనేక అవార్డులను ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం ఈ ఫార్ములా వన్ కార్లను ఫియోరానోలో ఉన్న ఫెరారీ రెండవ ప్లాంటులో తయారు చేస్తున్నారు. ఫెరారీ రోజు మొత్తం మీద గరిష్టంగా 14 కార్లను మాత్రమే తయారు చేస్తుంది. ఈ కార్ల తయారీ యంత్రాల కన్నా ఎక్కువ భాగం కార్మికులనే ఉపయోగిస్తారు. అందుకే ఇవి స్మూత్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటాయి. ఫెరారీ గురించిన మరిన్ని ఆసక్తికర విషయాలను ఈ ఫోటో ఫీచర్‌లో గమనించండి.

ఎన్జో ఫెరారీ

ఎన్జో ఫెరారీ

ఫెరారీ ప్లాంటును ప్రముఖ రేస్ డ్రైవ్ ఎన్జో ఫెరారీ ప్రారంభించారు. 1940 దశకం ఆరంభంలో ఇటలీలోని మారనెల్లో వద్ద ఎన్జో ఫెరారీ ఈ ప్లాంటును ప్రారంభించారు.

ఫెరారీ మారనెల్లో ప్లాంట్

ఫెరారీ మారనెల్లో ప్లాంట్

ఇటలీలో ప్రధాన పట్టణైన మారనెల్లోలో ఎన్జో ఫెరారీ ఈ ప్లాంట్‌ను 1940 ఆరంభంలో ప్రారంభించారు. అప్పట్లో ఈ ప్లాంటులో రేస్ కార్లు ఉత్పత్తి అయ్యేవి.

మారనెల్లో షాప్ ఫ్లోర్

మారనెల్లో షాప్ ఫ్లోర్

అత్యంత అందమైన ఫెరారీ కార్లు రూపుదిద్దుకునేది ఈ ప్రాంతంలోనే.

పరుగులు తీయడానికి సిద్ధం

పరుగులు తీయడానికి సిద్ధం

పూర్తిగా తయారైన ఫెరారీ కార్లను చూడండి. ఇవి రోడ్లపై, ఫార్ములా వన్ ట్రాక్‌లపై పరుగులు తీయటానికి సిద్ధంగా ఉన్నాయి.

ఫెరారీ ఫియోరానో ప్లాంట్

ఫెరారీ ఫియోరానో ప్లాంట్

ప్రస్తుతం ఫెరారీ తమ రేస్/ఫార్ములా వన్ కార్లను ఇటలీలో ఏర్పాటు చేసిన రెండవ ప్లాంట్ (ఫియోరానో ప్లాంట్)లో ఉత్పత్తి చేసింది. రేస్ ట్రాక్‌పై పొగలు చిమ్మేందుకు సిద్ధమైన ఈ ఫార్ములా వన్ కార్ల అందాన్ని చూడండి.

మారనెల్లో ప్లాంట్

మారనెల్లో ప్లాంట్

ఫెరారీ తమ మారనెల్లో ప్లాంట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ ప్లాంటులో స్పోర్ట్స్ కార్లు, సూపర్ కార్లు ఉత్పత్తి అవుతున్నాయి.

ఫెరారీ 50వ వార్షికోత్సవం

ఫెరారీ 50వ వార్షికోత్సవం

ఫెరారీ తన 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లిమిటెడ్ ఎడిషన్ ఎఫ్50 అనే స్పోర్ట్స్ కారును ఉత్పత్తి చేసింది. ఇలాంటివి కేవలం 349 కార్లను మాత్రమే ఫెరారీ తయారు చేసింది.

ఫెరారీ 458 ఇటాలియా

ఫెరారీ 458 ఇటాలియా

అత్యంత పాపులర్ అయిన ఫెరారీ 458 ఇటాలియా స్పోర్ట్స్ కారును అసెంబ్లింగ్ చేస్తున్న వర్కర్లు.

ఫెరారీ బాస్

ఫెరారీ బాస్

ప్రస్తుత ఫెరారీ బాస్ లుకా డి మోంటెజెమోలో.

అత్యంత ఖరీదైన ఫెరారీ కారు

అత్యంత ఖరీదైన ఫెరారీ కారు

ఫెరారీ తయారు చేసిన కార్లలో కెల్లా 250 జిటిఓ అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది. వేలంలో ఈ కారు 12 లక్షల డాలర్ల వెల పలికింది.

ఫెరారీ కార్పోరేట్ ఆఫీస్

ఫెరారీ కార్పోరేట్ ఆఫీస్

బయటి వైపు నుంచి ఫెరారీ కార్పోరేట్ ఆఫీస్‌.

ఫెరారీ ఫ్యాక్టరీ

ఫెరారీ ఫ్యాక్టరీ

ఫెరారీ ఫ్యాక్టరీ టాప్ వ్యూ

ఫెరారీ లోగో

ఫెరారీ లోగో

వేగానికి చిహ్నమైన గుర్రాన్ని ఫెరారీ తమ లోగోగా నిర్ణయించింది. రెండు కాళ్లను పైకెత్తి పరుగులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్న ఈ గుర్రాన్ని చూడండి. ఫెరారీ కార్లు కూడా ఇదే జోరును కనబరుస్తాయని కంపెనీ ఈ లోగోను ఎంచుకుంది.

ఫెరారీ ఎఫ్ఎఫ్ - మోడల్స్

ఫెరారీ ఎఫ్ఎఫ్ - మోడల్స్

ఫెరారీ స్పెషల్ ఎడిషన్ ఎఫ్ఎఫ్ కారుతో ఫోటోలకు ఫోజిలిస్తున్న హాట్ బ్యూటిఫుల్ మోడల్స్.


More from DriveSpark

Article Published On: Friday, January 25, 2013, 12:13 [IST]
English summary
Ferrari is probably one of the most famous car brands in the world. The Italian sports car maker has had a great history not only for building exciting sports cars but also for its rich racing heritage. Ferrari has a manufacturing plant in the small Italian town of Maranello where it hand builds its famed sports cars.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+