డబ్బుల కంటే దోస్త్‌కే విలువిచ్చాడు డ్యూడ్.. ఫ్రెండ్‌కు కారు గిఫ్టుగా ఇచ్చిన హ్యాట్రిక్ హిట్స్ హీరో
కోలీవుడ్‌లో కేవలం తన టాలెంట్, కష్టంతో అతి తక్కువ సమయంలోనే యూత్ సెన్సేషన్‌గా మారిన స్టార్ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan). దర్శకుడిగా కోమాలి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన ప్రదీప్, ఆ తర్వాత లవ్ టుడే, డ్రాగన్, ఇటీవల దీపావళికి విడుదలైన డ్యూడ్ (Dude) వంటి సినిమాలతో నటుడిగా కూడా మెప్పించారు.
తాజాగా విడుదలైన డ్యూడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించింది. ప్రదీప్ నటించిన వరుసగా మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరడం అనేది భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా చెబుతున్నారు. కోలీవుడ్ లోనే కాకుండా తక్కువ కాలంలోనే టాలీవుడ్‌లో సంచలనంగా మారిపోయాడు ప్రదీప్.

డ్యూడ్ సినిమా సక్సెస్ అయిన వెంటనే, ప్రదీప్ రంగనాథన్ తన మొదటి చిత్రం కోమాలి నుంచి తనతో పాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆప్తమిత్రుడు రమేష్‌కు ఒక విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. ప్రదీప్ వృత్తి జీవితంలోనే కాకుండా, వ్యక్తిగత జీవితంలో కూడా రమేష్ చాలా అండగా ఉన్నారు.
స్నేహితుడికి కృతజ్ఞతగా ప్రదీప్ రెనో క్విడ్ (Renault Kwid) హ్యాచ్‌బ్యాక్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ బహుమతిని అందజేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారు ఇచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసి, కొత్త కారులో సరదాగా రైడ్ కూడా వెళ్లారు.

ప్రదీప్ బహుమతిగా ఇచ్చిన రెనో క్విడ్, భారతీయ మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ కార్లలో ఒకటి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర ప్రస్తుతం రూ.4.30 లక్షల నుంచి రూ.5.99 లక్షల మధ్య ఉంది.
ఇందులో 1.0 లీటర్, 3 సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 67 బీహెచ్‌పీ పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఏఎమ్టీ (AMT) గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

క్విడ్ లీటరుకు 21.7 నుంచి 22 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 184 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉన్న ఈ కారులో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ పార్కింగ్ కెమెరా, కీ-లెస్ ఎంట్రీ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉన్నాయి.
డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీ (EBD), ఏబీఎస్ (ABS) వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. దీని ఇంజన్‌లో లో-ఎండ్ టార్క్ ఉండటం వల్ల రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో డ్రైవింగ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
సినిమా రంగంలో ప్రదీప్, రమేష్‌ల స్నేహం చాలా అరుదుగా కనిపిస్తుంది. విజయం అనేది కేవలం వ్యక్తిగత లాభం కాకుండా, ఆ విజయానికి వెనుక ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేయాలని ప్రదీప్ చేసిన ఈ పని గుర్తు చేస్తుంది.
ప్రస్తుతం ప్రదీప్, విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న 'LIK' అనే కొత్త సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ కారు గిఫ్ట్ ఇవ్వడం ద్వారా తన చుట్టూ ఉన్నవారిని ప్రేమించే ప్రదీప్ తీరు అభిమానుల మధ్య గొప్ప ఆదరణ పొందింది.


Click it and Unblock the Notifications








