ఫేస్‌బుక్ వీడియో: అనేక కార్లను మింగేసిన రోడ్డు
యజమాని కళ్ల ముందే కారు భూమిలో కూరుకుపోతుంటే, ఆ బాధ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అదే రోడ్డుకు పక్కగా పార్క్ చేసిన అనేక కార్లు ఒక్కసారిగా ఉన్నట్టుండి భూమిలోకి వెళ్లిపోతే, తలచుకోవటానికి గుండె ఝల్లుమంటోంది కదూ..!
అలాంటి ఓ సంఘటననే ఈనాటి మన ఫేస్‌బుక్ వీడియో శీర్షికలో వీక్షిద్దాం రండి. బల్టిమోర్ అనే ప్రాంతంలో రోడ్డుకు పక్కగా పార్క్ చేసిన ఉన్న చాలా కార్లు ఒక్కసారిగా నేలలోకి కూరుకుపోయాయి. రోడ్డుకు అవతలివైపు లోయ ఉండటం, పైగా భారీ వర్షం పడి ఉండటం వలన రోడ్డు బాగా తడిసిపోయి, మెత్తబడటంతో రోడ్డులో కొంత భాగం అవతలివైపుకు ఒరిగిపోయింది.
తొలుత రోడ్డు కొద్దిగా ఒరిగి ఉన్నప్పుడు అంతా సజావుగా సాగిపోతుందని అందరూ భావించారు. వాలిపోయి ఉన్న తమ కార్లను ఎలా పైకి తెచ్చుకోవాలని ఆలోచిస్తుండగా, క్షణాల్లోనే రోడ్డు పూర్తిగా కరిగిపోయి, లోయలోకి ఒరిగి పోయింది. దీంతో చాలా కార్లు కూడా లోయలో పడిపోయాయి. మరి ఆ రోడ్డు కార్లను ఎలా మింగేసిందే మీరు కూడా ఈ వీడియోలో వీక్షించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీ స్నేహితులతో షేర్ చేసుకోండి.


Click it and Unblock the Notifications








