బుల్లెట్ మోటార్‌సైకిల్ కోసం గుడి కట్టిన గ్రామస్తులు

రాముడికి గుడి ఉండటం చూశాం, శివుడికి గుడి ఉండటం చూశాం. అలాగే సచిన్ గుడి, అమితాబ్ బచ్చన్ గుడి గురించి కూడా విన్నాం. కానీ, బైక్ కోసం గుడి కట్టడాన్ని మీరు ఎక్కడైనా చూశారా? పోనీ కనీసం విన్నారా? ఆశ్చర్యపోకండి, మీరు ఈ బైక్ గుడిని చూడాలాంటే ఓసారి రాజస్థాన్ వరకు వెళ్లిరావాలి.

రాజస్థాన్‌లోని పాలీలో ఉన్న 65వ జాతీయ రహదారిపై ఈ గుడి ఉంది. ఇందులో ఓ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్ మోటార్‌సైకిల్ ఉంటుంది. ఈ గుడిలో ఆ పాత బైక్‌నే దేవుడిగా కొలుస్తారు. కొబ్బరి కాయలు కొట్టి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజలు కూడా చేస్తారు. ఈ గుడిని సంరక్షించేందుకు ఈ పూజారి కూడా ఉన్నాడండోయ్. ఈ గుడికి దాదాపు రెండు దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉంది.

బుల్లెట్ బైక్ కోసం గుడి

రాజస్థాన్‌లోని పాలీలో ఉన్న 65వ జాతీయ రహదారిపై ఈ గుడి ఉంది. ఇందులో ఓ పాత రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 బుల్లెట్ మోటార్‌సైకిల్ ఉంటుంది. ఈ గుడిలో ఆ పాత బైక్‌నే దేవుడిగా కొలుస్తారు.

బుల్లెట్ బైక్ కోసం గుడి

కొబ్బరి కాయలు కొట్టి, ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజలు కూడా చేస్తారు. ఈ గుడిని సంరక్షించేందుకు ఈ పూజారి కూడా ఉన్నాడండోయ్. ఈ గుడికి దాదాపు రెండు దశాబ్దాలుకు పైగా చరిత్ర ఉంది.

బుల్లెట్ బైక్ కోసం గుడి

బుల్లెట్ బాబా గుడి పరిసర ప్రాంతాలు

బుల్లెట్ బైక్ కోసం గుడి

గుడిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్

బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి
బుల్లెట్ బైక్ కోసం గుడి

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గుడి వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేంటంటే..
1980 దశకంలో పాలీ గ్రామానికి పెద్దగా వ్యవహరిస్తున్న ఓ వ్యక్తి కుమారుడు ఓమ్ సింగ్ రాథోడ్ (ఇప్పుడు ఓం బానా లేదా బుల్లెట్ బాబా అని పిలుస్తారు) ఓ కొత్త బుల్లెట్ 350సీసీ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేశాడు. విచిత్రంగా, ఆ బైక్‌తో రాథోడ్ ప్రేమలో పడ్డాడట. సాధారణంగా బైక్‌లంటే అందిరికీ ప్రేమ ఉంటుంది. కానీ ఈ ప్రేమ మాత్రం చాలా విచిత్రమైనది. డిసెంబర్ 8, 1988లో ఓం బానా తన మోటార్‌సైకిల్‌పై పాలీ గ్రామానికి తిరిగి వస్తుండగా, బైక్ జారిపోయి చెట్టుకు గుద్దుకొని స్పాట్‌లోనే ఆయన మృతి చెందాడట. దీంతో పోలీసులు విచారణ కోసం ఓం బానా బాడీని, బైక్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లారు.

అయితే, తర్వాతి రోజు పోలీస్ స్టేషన్‌లో చూస్తే, వారు తీసుకువచ్చిన బైక్ మాయమైపోయింది. అది తిరిగి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగి రాథోడ్ చనిపోయాడో అక్కడ కనిపించింది. పోలీసులు మళ్లీ ఆ బైక్‌ను తీసుకెళ్లి స్టేషన్ వద్ద ఉంచారు. మళ్లీ అదే తంతు. పోలీసులు బైక్‌‍‌ను తీసుకురావటం, ఎవ్వరూ తీసుకెళ్లకుండానే అది తిరిగి మళ్లీ ఆ చెట్టు వద్ద కనిపించడం చేస్తుండేంది. దీంతో పోలీసులు బైక్‌ను గట్టి చైన్‌తో కట్టేసి, పెట్రోల్ ట్యాంక్‌ను ఖాలీ చేసి స్టేషన్‌లో ఉంచారు. అయినప్పటికీ అది తిరిగి చెట్టు వద్దే ప్రత్యక్షమయ్యేది.

దీంతో పాలీ గ్రామస్తులంతా రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్‌సైకిల్‌ను, ఓం సింగ్ రాథోడ్‌ను దేవుడిగా పూజించడం మొదలు పెట్టారు. అంతేకాదు, ఎవరైనా గ్రామస్తులు ఊరి వదలి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ బుల్లెట్ బాబా దేవాలయానికి వచ్చి దీవెనలు పొంది వెళ్తారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఎవ్వరికీ తెలియకపోయినప్పటికీ ఈ గుడి మాత్రం పాలీలో బాగా పాపులర్ అయిపోయింది. మరి ఈ బుల్లెట్ బాబాకు మనం కూడా జై కొడదామా..!

More from DriveSpark

Article Published On: Thursday, June 27, 2013, 16:40 [IST]
English summary
There are people who love motorcycles and then there are people who worship them, literally. While we have heard about temples where famous personalities like Sachin and Amitabh Bachan are worshiped, there is a temple in Rajasthan where the deity is a Royal Enfield Bullet 350 motorcycle. Its not just the Bullet 350 that is worshiped here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+