ఆమ్ ఆద్మీ అరవింద్ కేజ్రీవాల్.. అతని మారుతి వ్యాగన్ఆర్
సామాన్యుడి శక్తి ఏంటో ఢిల్లీ సర్కారు రుచి చూపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరికొద్ది రోజుల్లో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించనున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసులు జడ్ కేటగిరీ భద్రతను కల్పించేందుకు ముందుకు రాగా ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారు. తనకు ఎలాంటి ప్రత్యేక పోలీసుల భద్రత అవసరం లేదని, ఆ భగవంతుడే తనకు రక్షణగా ఉంటాడని వ్యాఖ్యానించారు.
మరి ఈ సామాన్యుడు ఉపయోగించే ఆ సామాన్యమైన కార్ ఏంటో తెలుసా..? దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధింగా అమ్ముడుపోతున్న పెట్రోల్ కార్లలో ఒకటైన వ్యాగన్ఆర్. సిఎం అయిన తర్వాత కూడా ఆయన ఇదే కారునే ఉపయోగించనున్నట్లు సమాచారం.
అయితే, సాధారణంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతటి సామాన్యుడికైనా ఆ రాష్ట్ర సర్కారు అత్యున్నత భద్రను కల్పించడం పరిపాటి. మరి తన చీపురుతో అవినీతిని ఊడ్చేస్తానంటున్న ఈ సామాన్యుడు, సిఎంగా మారిన తర్వాత కూడా సామాన్యుడుగా ఉంటాడో లేక అందరు రాజకీయ నాయకుల మాదిరిగానే మారిపోతాడో వేచి చూడాలి..!

మరి ఈ సామాన్యుడు ఉపయోగించే మన సామాన్య మారుతి సుజుకి వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్ గురించిన సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం రండి..! మరిన్ని వివరాల కోసం తర్వాతి స్లైడ్‌లను పరిశీలించండి.

మారుతి సుజుకి అందిస్తున్న పాపులర్ 1.0 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌ను వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఉపయోగించారు. ఇది గరిష్టంగా 67.1 బిహెచ్‌పిల శక్తిని, 90 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో జతచేయబడి ఉంటుంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ పెట్రోల్, సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభ్యమవుతుంది. పెట్రోల్ వెర్షన్ లీటరుకు 20.51 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుండగా, సిఎన్‌జి వెర్షన్ కేజీకి 26.6 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

సన్నటి ఫ్రంట్ గ్రిల్, పెద్ద ఎయిర్ డ్యామ్, రీడిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, సరికొత్త ఫ్రంట్ బంపర్‌లు, ఎల్ఎక్స్ఐ మరియు విఎక్స్ఐ వేరియంట్లలో మరింత అధనపు క్రోమ్ ఫినిషింగ్లను ఈ కొత్త వ్యాగన్ఆర్ కారులో గమనించవచ్చు. వ్యాగన్ఆర్ ఇంటీరియర్స్ డ్యూయెల్ కలర్ (రెండు రంగుల కలయిక) ఆప్షన్‌తో లభిస్తోంది. ఇందులో డ్యాష్‌బోర్డును పైవైపు అర్థ భాగాన్ని బీజ్ కలర్‌తోను, క్రింది వైపు అర్థ భాగాన్ని నలుపు రంగుతోను తీర్చిదిద్దారు.

స్మార్ట్ పీపుల్ కోసం స్మార్ట్ కార్ అంటూ మారుతి సుజుకి తమ వ్యాగన్ఆర్ కారు కోసం ప్రచారం చేస్తుంది. ఇందులోని ఫీచర్లు కూడా స్మార్ట్‌గానే ఉంటాయి. టాప్-ఎండ్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది.

ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో యూఎస్‌బి కనెక్టివిటీతో కూడిన సరికొత్త 'ఈగల్ వింగ్స్' ఆడియో సిస్టమ్, ఆల్ పవర్ విండోస్, ఏసి విత్ హీటర్, రియర్ వైపర్ అండ్ వాషర్, ఆటో డౌన్ డ్రైవర్ సైడ్ పవర్ విండో స్విచ్, ఎలక్ట్రిక్ సైడ్ సైడ్ మిర్రర్స్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ వంటి అనేక స్మార్ట్ ఫీచర్లతో లభిస్తుంది.

రాష్ట్ర మార్కెట్లో కొత్త వ్యాగన్ఆర్ ప్రారంభ ధర కేవలం రూ.3.83 లక్షలు (ఎక్స్-షోరూమ్, హైదరాబాద్) మాత్రమే.


Click it and Unblock the Notifications








