ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకు అమీర్‌కు జరిమానా

ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, అమీర్ ఖాన్ తన కుటుంబంతో కలిసి ఓ సిల్వర్ కలర్ బిఎమ్‌డబ్ల్యూ కారులో ప్రయాణిస్తూ, రాంగ్ టర్న్ తీసుకొని నో-ఎంట్రీ రోడ్డులోకి ప్రవేశించాడని, అది చూసిన ట్రాఫిక్ పోలీస్ కారును అడ్డుకోగా, కారులో ఉన్న అమీర్ ఖాన్ సెక్యూరిటీ గార్డ్ ట్రాఫిక్ పోలీస్‌తో వాగ్వివాదానికి దిగాడని పేర్కొంది.
ఇదంతా చూసిన అమీర్ ఖాన్ స్వయంగా కలుగజేసుకొని జరిమానా చెల్లించేందుకు అంగీరించాడని సటారా సిటీ ట్రాఫిక్ ఇంచార్జ్ కెన్ పాటిల్‌ను ఉటంకిస్తూ మిడ్-డే పత్రిక ప్రచురించింది. ఏదేమైనప్పటికీ.. చట్టం ముందు అందరూ సమానమే అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ.


Click it and Unblock the Notifications








