ధూమ్ 3 చిత్రంలో 'ధూమ్ ధామ్' చేయనున్న అమీర్!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్, హాట్ హీరోయిన్ కట్రీనా కైఫ్ జంటగా నటిస్తున్న 'ధూమ్ 3' చిత్రం భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవలే ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ కోసం దర్శక నిర్మాతలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. సాధారణంగా హాలీవుడ్ సూపర్ హీరోస్ చిత్రాలను మాత్రమే ఈ తరహా ఫార్మాట్లో విడుదల చేస్తుంటారు.
బాలీవుడ్‌లో ఇప్పటికే సూపర్ హిట్ అయిన ధూమ్ 1, ధూమ్ 2 సినిమాలకు సీక్వెల్‌గా వస్తున్న ధూమ్ 3 చిత్రంలో అనేక అద్భుతాలను, సాహసాలను, విన్యాసాలను ప్రేక్షకులు చూడనున్నారు. ధూమ్ 1 చిత్రంలో జాన్ అబ్రహామ్, ధూమ్ 2లో హృతిక్ రోషన్ నటించి ప్రేక్షకులను మెప్పించగా, తాజాగా ధూమ్ 3 చిత్రంలో అమీర్ ఖాన్ ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఈ చిత్రంలో అమీర్ ఖాన్ సూపర్‌బైక్‌లతో సందడి చేయనున్నాడు. ఈ సూపర్‌బైక్‌లతో ఛేజ్‌లు, వాటిపై ఫైట్లు మరియు వళ్లు గగుర్పొడిచే స్టంట్స్ ఉన్నట్లు ఈ ట్రైలర్ చూస్తనే అర్థమవుతుంది. బైక్ చేజ్‌లు, కార్ చేజ్‌లు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ చిత్రంలో పవర్‌ఫుల్ బిఎమ్‌డబ్ల్యూ కె1300ఆర్ సూపర్‌బైక్‌ను అమీర్ ఖాన్ రైడ్ చేస్తూ కనిపిస్తాడు. మరిన్ని వివరాలను ఫొటో ఫీచర్‌ను పరిశీలించండి.

ముందుగా ధూమ్ 3 చిత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం రండి..! చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు. పోలీసులు అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.

ఈచిత్రంలో కట్రీనా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ.... కట్రీనా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు. సినిమాలో కట్రీనా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి.

ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్, ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది. వీరి పాత్రలు కూడా సినిమాలో ఎంతో కీలకంగా ఉండనున్నాయి.

భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ఈచిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ నెలాఖరులో ఈ చిత్రం విడుదల కావచ్చని అంచనా.

ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్ నడిపిన బిఎమ్‌డబ్ల్యూ సూపర్‌బైక్ గురించి తెలుసుకుందాం రండి..!

జర్మన్ లగ్జరీ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూకు చెందిన లగ్జరీ బైక్‌ల తయారీ యూనిట్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ సూపర్‌బైక్‌లను తయారు చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1300ఆర్ సూపర్‌బైక్ మంచి స్టయిలిష్ లుక్‌ని కలిగి ఉండి పవర్‌ఫుల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఇందులో 1293సీసీ వాటర్-కూల్డ్, 4-స్ట్రోక్ ఇన్-లైన్ ఫోర్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఈ ఇంజన్ గరిష్టంగా 173 బిహెచ్‌పిల శక్తిని, 140 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి ఇంచు మించు 2లీటర్ ఇంజన్ కలిగిన కారు శక్తితో సమానం.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఇండియన్ మార్కెట్లో తమ సూపర్‌బైక్‌లను సిబియూ (కంప్లీట్లీ బిల్డ్ యూనిట్) రూట్లో దిగుమతి చేసుకొని విక్రయిస్తుంది. ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు ఈ బైక్‌ను స్పెషల్‌గా ఆర్డర్ ఇచ్చి దిగుమతి చేసుకోవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఈ మోడల్‌ను భారత మార్కెట్లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దేశీయ విపణిలో బిఎమ్‌డబ్ల్యూ కె1300ఆర్ సూపర్‌బైక్ ధర సుమారు రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా.

దూమ్ 2 సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న దూమ్ 3 చిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అమీర్ ఖాన్‌తో పాటుగా అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, కట్రీనా కైఫ్, జాకీష్రాఫ్ తదితరులు నటిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రంలో ఉదయ్ చోప్రా నడిపే రూ.25 లక్షల ఖరీదు చేసే బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్‌బైక్‌ను సుమారు రూ.1 లక్ష ఖరీదు చేసే యమహా ఆర్15 స్పోర్ట్స్ బైక్‌ను ఆధారంగా చేసుకొని కస్టమైజ్ చేసినట్లు సమాచారం.

సినిమా బడ్జెట్‌ను తగ్గించేందుకు యమహా ఆర్15 స్పోర్ట్స్ బైక్‌లను బిఎమ్‌డబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్ సూపర్‌బైక్‌లు ఎడిటింగ్‌తో మాయ చేసినట్లు అనిపిస్తుంది.

ధూమ్ 3 చిత్రంలో అమీర్ ఖాన్ స్టంట్ బైకింగ్.

ధూమ్ 3 చిత్రంలో అమీర్ ఖాన్ స్టంట్ బైకింగ్.

ధూమ్ 3 చిత్రంలో అమీర్ ఖాన్ స్టంట్ బైకింగ్.
ధూమ్ 3 ట్రైలర్ కోసమే దర్శక నిర్మాతలు రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను మీరు కూడా ఈ స్లైడ్‌లో వీక్షించండి.


Click it and Unblock the Notifications








