అమీర్ ఖాన్ రోల్స్ రాయిస్ కారు ఖరీదు ఎంతో తెలుసా..!

Aamir Khan
బాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ అమీర్ ఖాన్‌కు నెంబర్ వన్ అంకె లభించింది. ఎందులో అనుకుంటున్నారా.. అదేనండీ, అమీర్ ఖాన్ రోల్స్ రాయిస్ కారుకు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అధికారులు '1' (MH 11 AX 1) అనే రిజిస్ట్రేషన్ నెంబర్‌ను కేటాయించారు. మెటాలిక్ సిల్వర్ రంగులో తళుక్కుమంటున్న రోల్స్ రాయిస్ కారు సటారా ఆర్టీఓ ఆఫీసు వద్దకు రాగానే అక్కడున్న వారంతా ఆ కారును చుట్టిముట్టేశారు. అయితే, ఆ కారులో అమీర్ ఖాన్ లేడు, ఓ ఏజెంట్ ఆ కారును డ్రైవ్ చేసుకొని వచ్చారు. ఆ కారు అమీర్ ఖాన్‌కు చెందినదని, రిజిస్ట్రేషన్ నెంబర్ 1 కోసం ఆయన అభ్యర్థించాడని డిప్యూటీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వి.ఆర్. గుజరాతి స్పష్టం చేసారు.

రోల్స్ రాయిస్ కారుపై రూ. 47 లక్షల పన్ను (టాక్స్)ను మరియు రూ. 3 లక్షలు ఈ ప్రత్యేక నెంబర్ కోసం ఆర్టీఓ వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఫోర్-వీలర్ సిరీస్‌లో ఈ ప్రత్యేక నెంబర్ అందుబాటులో లేకపోవడంతో దీన్ని టూ-వీలర్ సిరీస్ నుంచి కేటాయించామని గుజరాతి చెప్పారు. ఈ కారును అద్వైతల్ పోస్ట్ స్టూడియోస్ లిమిటెడ్ పేరుతో రిజిస్టర్ అయింది. ఆర్టీఓ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కారును ముంబైకు చెందిన నవనీత్ మోటార్స్ బ్రిటన్ నుంచి దిగుమతి చేుకుంది. దీని విలువ రూ.1.22 కోట్లు. కస్టమ్ డ్యూటీ కింద రూ. 1.41 కోట్లు వసూలు చేయగా, ఆర్టీఓ స్పెషల్ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పన్ను కింద 50.57 లక్షలు వసూలు చేసింది. ఇవన్నీ కలుపుకొంటే మొత్తం కారు విలువ రూ. 3.11 కోట్లు.

ఈ కారు 12-సిలిండర్, 6,592 సీసీ ఇంజన్‌తో గరిష్టంగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కారు బోనెట్‌పై బంగారు వర్ణంలో ఉండే "R" అనే కంపెనీ ట్రేడ్‌మార్క్ ఉంటుంది. ఇంకా ఇందులో టచ్ సెన్సార్స్, కెమరాలు, రెండు సైలెన్సర్లు (ఎగ్జాస్ట్)లు వంటి విలాసవంతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆర్టీఓ వర్గాల సమాచారం ప్రకారం.. సటారా ఆర్టీఓలో ఇప్పటివరకూ రిజిస్టర్ అయిన కార్లలో ఇదే అత్యంత ఖరీదైనదని తెలుస్తోంది. మరి అమీర్ ఖానా మజాకానా..!

More from DriveSpark

Article Published On: Sunday, July 17, 2011, 11:58 [IST]
English summary
Bollywood actor Aamir Khan got No. 1 for his brand new Rolls-Royce car. He registered the car from the Satara regional transport office in Maharashtra. RTO alloted a special number registration MH 11 AX 1 for his new Rolls-Royce.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+