టెస్ట్ డ్రైవ్‌లో అపశృతి: చెవర్లే కమారో కారు యాక్సిడెంట్
ప్రముఖ ఆటోమొబైల్ మ్యాగజైన్ టాప్ గేర్ అమెరికాకు చెందిన కన్సల్టింగ్ ప్రొడ్యూసర్ ఆరాన్ గోల్డ్ ఈ స్పోర్ట్స్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపుతప్పి యాక్సిడెంట్‌కు గురై కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయిపోయింది. అదృష్టవశాత్తు కారులో ఉన్న ఆరాన్ గోల్డ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఈ ప్రమాదానికి తానే పూర్తి బాధ్యతను వహిస్తున్నానని, హై పెర్ఫామెన్స్ కలిగిన ఇలాంటి స్పోర్ట్స్ కార్లను కంట్రోల్ చేయటం అంత సులువైన విషయం కాదని, అందుకు ప్రత్యేక నైపుణ్యం కావాలని ఆయన తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. ఇలాంటి స్పోర్ట్స్ కార్లను నడిపేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చాడు.
చెవర్లే కమారో జెడ్ఎల్1లో 6.2 లీటర్ వీ8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 580 బిహెచ్‌పిల శక్తిని, 754 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి, స్పోర్ట్స్ కార్లతో చెలగాటాలేడటప్పుడు కాస్తం వళ్లు దగ్గరపెట్టుకొని డ్రైవ్ చేయటం ఉత్తమం. మీరేమంటారు..?


Click it and Unblock the Notifications
