దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

సాధారణంగా కొంతమంది వాహనప్రియులు అత్యంత ఖరీదైన వాహనాలను ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి లగ్జరీ కార్లు నిజంగానే విలాసవంతమైన లగ్జరీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇలాంటి ఖరీదైన వాహనాలు కూడా కొన్ని సంవత్సరాల ఉపయోగం తరువాత కొన్ని రిపేర్లు రావడం సహజం. కానీ వాహనంలో తరచూ ఎదో ఒక సమస్య ఎదురవుతుంటే వాహనదారులు విసిగిపోతాడు. అంతే కాకుండా ఈ వాహనాల రిపేరికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అటువంటి సమయంలో వాటిని నిరుపయోగంగా వదిలివేస్తారు.

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో నిరుపయోగంగా రోడ్డున పడిఉన్న లగ్జరీ కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 :

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 అనేది ఓల్డ్ వెర్షన్ బెంజ్ కారు. ఇది ఇప్పుడు ముంబై వీధుల్లో నిరుపయోగంగా వదిలివేయబడింది. ఈ ఖరీదైన కారులో ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల, దీనిని మళ్ళీ రిపేర్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. కావున దీని ఓనర్ ఈ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 కారుని రోడ్దు ప్రక్కన వదిలివేసి ఉండాలి.

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఇక్కడ మనం ఈ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 కారుని విరిగిన సస్పెన్షన్‌తో, పూర్తిగా నిరుపయోగంగా ఉన్న దుస్థితిలో చూడవచ్చు. మనం ఇక్కడ ఫొటోలో గమనించినట్లయితే దీనిని చాలా రోజులుగా ఉపయోగించకుండా ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది.

MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఆడి క్యూ 7 :

ఆడి క్యూ 7 కార్ రోడ్డు పక్కన నిరుపయోగంగా పది ఉండటం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఆరేళ్ల ఆడి క్యూ 7 కార్. టి-బిహెచ్‌పిలో పంచుకున్న వివరాల ప్రకారం, కొంతకాలంగా ఈ వాహనాలు ఇక్కడ పడి ఉన్నాయి. ఈ క్యూ 7 అదే ఎయిర్ సస్పెన్షన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ దీనిపై గీతలు లాంటివి కనిపించవు. క్యూ 7 ఆడి యొక్క శక్తివంతమైన వెర్షన్. ఇది 4.2-లీటర్ వి 8 డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 800 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ :

ఇది మరొక మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్, ఇది కేరళలో ఉంది మరియు నెమ్మదిగా తుప్పుపట్టింది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్‌లో కూడా ఎయిర్ సస్పెన్షన్ లోపం ఉందని తెలుస్తుంది. ఈ కారు బాడీపై పాచి పేరుకుపోయింది, అంటే ఇది చాలా కాలంగా నిరుపయోగంగా ఇక్కడ పడి ఉంది.

MOST READ:ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 160 ; ఇంతకీ ఈ పెట్రోల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ?

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

జీప్ చెరోకీ :

కొన్ని సంవత్సరాల క్రితం జీప్ అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయినప్పటికీ ఈ జీప్ బ్రాండెడ్ ఎస్‌యూవీలను భారతదేశంలో ప్రైవేటుగా దిగుమతి చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గుర్తించిన 2 వ తరం జీప్ చెరోకీ ఇది. ఈ వెహికల్ నిరుపయోగంగా వదిలివేయబడింది. ఈ కారణంగా రోడ్డుపక్కన మిగిలిపోయింది. ఈ వాహనం ఏక్సటర్నల్ రోల్ కేజ్, లిఫ్ట్ కిట్ మరియు మరెన్నో మార్పులతో కలిగి ఉంది. ఈ వాహనాన్ని వదిలివేయడానికి ఖచ్చితమైన కారణం తెలియదు.

MOST READ:నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్, చూసారా !

దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?

బిఎండబ్ల్యు 5-సిరీస్ :

ఇది బిఎమ్‌డబ్ల్యూ యొక్క 5-సిరీస్ సెడాన్, ఇది కేరళలోని కొడంగల్లూరులో వదిలివేయబడింది. ఈ కారు పరిస్థితి బాగుంది, కాని ఈ సెడాన్ యొక్క మెకానికల్ ప్రాబ్లమ్స్ గురించి మనకు ఖచ్చితంగా తెలియదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కారు చాలా కాలంగా ఇక్కడే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే దానిపై ఒక చెట్టు కూడా పెరిగింది.

Image Courtesy: Team BHP

Most Read Articles

English summary
5 Rare Exotic Imports ABANDONED On Indian Streets. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X