Just In
- 21 hrs ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- 24 hrs ago
మీకు తెలుసా.. ఇది ప్రపంచంలో అత్యంత వేగవంతమైన ట్రైన్ కానుంది
- 1 day ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 1 day ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
Don't Miss
- Lifestyle
సోమవారం దినఫలాలు : ఉద్యోగులు ఈరోజు పనిని సకాలంలో పూర్తి చేయడంలో విఫలమవుతారు...!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Movies
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దుర్భర స్థితిలో పడిఉన్న ఖరీదైన లగ్జరీ కార్స్.. ఎక్కడో తెలుసా ?
సాధారణంగా కొంతమంది వాహనప్రియులు అత్యంత ఖరీదైన వాహనాలను ఉపయోగించడానికి ఇష్టపడుతుంటారు. ఇలాంటి లగ్జరీ కార్లు నిజంగానే విలాసవంతమైన లగ్జరీ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇలాంటి ఖరీదైన వాహనాలు కూడా కొన్ని సంవత్సరాల ఉపయోగం తరువాత కొన్ని రిపేర్లు రావడం సహజం. కానీ వాహనంలో తరచూ ఎదో ఒక సమస్య ఎదురవుతుంటే వాహనదారులు విసిగిపోతాడు. అంతే కాకుండా ఈ వాహనాల రిపేరికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సివస్తుంది. అటువంటి సమయంలో వాటిని నిరుపయోగంగా వదిలివేస్తారు.

ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో నిరుపయోగంగా రోడ్డున పడిఉన్న లగ్జరీ కార్లను గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 :
మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 అనేది ఓల్డ్ వెర్షన్ బెంజ్ కారు. ఇది ఇప్పుడు ముంబై వీధుల్లో నిరుపయోగంగా వదిలివేయబడింది. ఈ ఖరీదైన కారులో ఎయిర్ సస్పెన్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల, దీనిని మళ్ళీ రిపేర్ చేయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయవలసి వస్తుంది. కావున దీని ఓనర్ ఈ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 కారుని రోడ్దు ప్రక్కన వదిలివేసి ఉండాలి.

ఇక్కడ మనం ఈ బెంజ్ ఎస్-క్లాస్ ఎస్320 కారుని విరిగిన సస్పెన్షన్‌తో, పూర్తిగా నిరుపయోగంగా ఉన్న దుస్థితిలో చూడవచ్చు. మనం ఇక్కడ ఫొటోలో గమనించినట్లయితే దీనిని చాలా రోజులుగా ఉపయోగించకుండా ఉంది అని మనకు స్పష్టంగా తెలుస్తుంది.
MOST READ:బెంగళూరులో అమలుకానున్న కొత్త పార్కింగ్ విధానం : పూర్తి వివరాలు

ఆడి క్యూ 7 :
ఆడి క్యూ 7 కార్ రోడ్డు పక్కన నిరుపయోగంగా పది ఉండటం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఆరేళ్ల ఆడి క్యూ 7 కార్. టి-బిహెచ్పిలో పంచుకున్న వివరాల ప్రకారం, కొంతకాలంగా ఈ వాహనాలు ఇక్కడ పడి ఉన్నాయి. ఈ క్యూ 7 అదే ఎయిర్ సస్పెన్షన్ సమస్యను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ దీనిపై గీతలు లాంటివి కనిపించవు. క్యూ 7 ఆడి యొక్క శక్తివంతమైన వెర్షన్. ఇది 4.2-లీటర్ వి 8 డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది, ఇది 800 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ :
ఇది మరొక మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్, ఇది కేరళలో ఉంది మరియు నెమ్మదిగా తుప్పుపట్టింది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్‌లో కూడా ఎయిర్ సస్పెన్షన్ లోపం ఉందని తెలుస్తుంది. ఈ కారు బాడీపై పాచి పేరుకుపోయింది, అంటే ఇది చాలా కాలంగా నిరుపయోగంగా ఇక్కడ పడి ఉంది.
MOST READ:ఒక లీటర్ పెట్రోల్ ధర రూ. 160 ; ఇంతకీ ఈ పెట్రోల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా ?

జీప్ చెరోకీ :
కొన్ని సంవత్సరాల క్రితం జీప్ అధికారికంగా భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయినప్పటికీ ఈ జీప్ బ్రాండెడ్ ఎస్‌యూవీలను భారతదేశంలో ప్రైవేటుగా దిగుమతి చేసుకున్న వారు చాలా మంది ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో గుర్తించిన 2 వ తరం జీప్ చెరోకీ ఇది. ఈ వెహికల్ నిరుపయోగంగా వదిలివేయబడింది. ఈ కారణంగా రోడ్డుపక్కన మిగిలిపోయింది. ఈ వాహనం ఏక్సటర్నల్ రోల్ కేజ్, లిఫ్ట్ కిట్ మరియు మరెన్నో మార్పులతో కలిగి ఉంది. ఈ వాహనాన్ని వదిలివేయడానికి ఖచ్చితమైన కారణం తెలియదు.
MOST READ:నవంబర్ అమ్మకాల నివేదికను రిలీజ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్, చూసారా !

బిఎండబ్ల్యు 5-సిరీస్ :
ఇది బిఎమ్‌డబ్ల్యూ యొక్క 5-సిరీస్ సెడాన్, ఇది కేరళలోని కొడంగల్లూరులో వదిలివేయబడింది. ఈ కారు పరిస్థితి బాగుంది, కాని ఈ సెడాన్ యొక్క మెకానికల్ ప్రాబ్లమ్స్ గురించి మనకు ఖచ్చితంగా తెలియదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కారు చాలా కాలంగా ఇక్కడే ఉందని తెలుస్తుంది. ఎందుకంటే దానిపై ఒక చెట్టు కూడా పెరిగింది.
Image Courtesy: Team BHP