120 కి.మీ వేగంతో ట్రక్కును ఢీకొట్టిన బైక్‌.. ఆ ఫీచర్‌ లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది.!

భారతీయ మార్కెట్‌లో ద్విచక్ర వాహనాలది అతిపెద్ద మార్కెట్‌. యువ రైడర్లు ఖరీదైన, మంచి పనితీరుతో ఉన్న టూ వీలర్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ బైక్‌లలో చాలా వరకు ఇప్పుడు ABS స్టాండర్డ్ ఫీచర్‌గా వస్తోంది. ABS కార్లు, బైక్‌లు రెండింటిలోనూ, ముఖ్యంగా భారతీయ రోడ్లపై డ్రైవింగ్ చేసేటప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది.

ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) నేటి వాహనాలకు చాలా ముఖ్యమైన ఫీచర్‌. ఎందుకంటే వాహనాల్లో బ్రేకింగ్ సిస్టమ్ చాలా వరకు ప్రమాదాల నుంచి తీవ్రమైన నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. అందువల్ల భారతీయ మార్కెట్‌లో విక్రయించబడే చాలా వాహనాల్లో ABS బ్రేక్‌లు ప్రామాణిక ఫీచర్‌గా మారింది.

ABS-Saves-Yamaha-Rider

సాధారణ బ్రేక్‌లతో పోలిస్తే ఏబీఎస్‌ (ABS)చాలా అధునాతనంగా పనిచేస్తుంది. ఈ ABS బ్రేక్‌లు ప్రస్తుత భారతీయ రోడ్ల పరిస్థితులపై ప్రయాణించేటప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయ. అందుకు ఉదాహరణ ఇటీవలి ప్రమాదానికి గురై కెమెరాలో చిక్కుకున్న ఓ బైక్‌ రైడర్ ABS ఫీచర్‌ ద్వారా ప్రాణాలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు ఈ కథనంలో చదవండి.

యమహా ఆర్15 బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ఏబీఎస్‌(ABS) బ్రేక్ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులోని 2 లేన్‌ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి దృశ్యాలు యమహా R15 రైడర్ ధరించిన హెల్మెట్‌పై అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి.

ABS-Saves-Yamaha-Rider

యమహా R15 బైక్ రైడర్ 124 kmph వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌లో మనం గమనించవచ్చు. ఈ వేగంతో ప్రయాణిస్తూ రైడర్ టెంపో ట్రావెలర్‌తో సహా కొన్ని వాహనాలను ఓవర్ టేక్‌ చేశాడు. ఆ తర్వాత టాటా ఏస్ పికప్ ట్రక్కును ఢీకొట్టాడు.

అంతకుముందు, పికప్ ట్రక్ డ్రైవర్ రోడ్డును గమనించకుండా కుడి వైపునకు తిప్పడానికి ప్రయత్నించాడు. ఇండికేటర్‌ను కూడా వేయకపోవడంతో పికప్ ట్రక్కును ఓవర్‌ టేక్‌ చేయాలని భావించిన యమహా R15 రైడర్‌ గందరగోళానికి గురై వెంటనే బ్రేక్ వేశాడు. దీంతో బైక్ వేగం వెంటనే తగ్గింది. కానీ బైకర్‌ టాటా ఏస్ పికప్ ట్రక్కును ఢీకొన్నాడు.

అయితే ఇక్కడ అదృష్టవశాత్తూ బైక్ అదుపు తప్పలేదు. అకస్మాత్తుగా ఢీకొనడంతో బైక్ ముందు భాగం ధ్వంసమైంది. యమహా R15 రైడర్‌కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. యమహా R15 డ్యూయల్ ఛానల్ ABS బ్రేక్‌లతో వస్తుంది. బైక్‌లో ఈ ఫీచర్ లేకుంటే ప్రమాదం ప్రభావం తీవ్రంగా ఉండేది.

అయితే ఈ రోడ్డు ప్రమాదానికి టాటా ఏస్ పికప్ ట్రక్ డ్రైవర్ మాత్రమే కారణమని అనుకోలేం. యమహా R15లో రైడర్ తప్పు కూడా ఉంది. 2 లేన్ హైవేలో అతి వేగంతో ప్రయాణించడం సరైంది కాదు. పరిమిత వేగంతో ప్రయాణిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.

ఆధునిక సాంకేతికత సాయంతో భారతీయ ఆటోమొబైల్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు వాహన తయారీదారులు. అధునాతన ఫీచర్లతో వాహనాలను నవీకరిస్తూ, కొత్తవి ప్రవేశపెడుతూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. డ్యాష్‌ బోర్డ్‌ కెమెరా, ADAS, ABS లాంటి అధునాతన ఫీచర్లు డ్రైవింగ్‌ ఫ్రెండ్లీగా ఉంటున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, July 18, 2023, 10:03 [IST]
English summary
Abs saves yamaha rider after hitting the truck with 120km speed video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+