రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం.. అతి వేగంతో దూసుకొచ్చి ముగ్గురిని ఢీకొట్టిన కారు
చెన్నైలో బీఎండబ్ల్యూ(BMW Car Accident) కారును అతివేగంతో నడిపి ముగ్గురిపైకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి పాల్పడిన వ్యక్తిపై పోలీసులు మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువకుడు తన స్నేహితులతో కలిసి పబ్లిక్ రోడ్డుపై కార్ రేస్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమని తేలింది.
రోడ్డు ప్రమాదాల నివారణపై ట్రాఫిక్ పోలీసులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. పరిమితికి మించిన వేగంతో డ్రైవ్ చేయడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతూ కొందరు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. అంతేకాకుండా పబ్లిక్ రోడ్లపై స్టంట్లు, అభ్యంతకర సీన్లు క్రియేట్ చేస్తూ ప్రాణాలమీదకు తెస్తున్నారు.

అతివేగం అత్యంత ప్రమాదకరం.. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్.. అతివేగం కారణంగా ఎన్ని రోడ్డు యాక్సిడెంట్లు జరుగుతున్నాయో, ఎంతమంది చనిపోతున్నారో మనం రోజూ వార్తల్లో చూస్తునే ఉన్నాం. అయినా కొందరు వాహనదారుల్లో మార్పు రావడం లేదు. అత్యంత వేగంగా వాహనాలు నడిపి ఘోర ప్రమాదాలకు కారణం అవుతున్నారు. వీళ్లు చేసే తప్పులకు అమాయకులకు శిక్ష పడుతోంది. ఏ తప్పూ చేయకపోయినా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
చెన్నై(Chennai Road Accident)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఎండబ్ల్యూ కారును నడిపింది అక్కడి ప్రముఖ సూపర్ శరవణ స్టోర్స్ యజమాని కుమారుడు యోగేశ్ శ్రీ రత్నంగా పోలీసులు గుర్తించారు. 27 ఏళ్ల ఈ యువకుడికి BMW కారు ఉంది. చెన్నైలోని పలు ప్రాంతాలకు అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి కారులో షికార్లకు వెళ్తుండేవాడు.

కేవలం బీఎండబ్ల్యూ కారు మాత్రమే కాకుండా ఇంకా అతను తన స్నేహితులతో కలిసి ఓ రెండు మూడు కార్లలో తిరిగేవాడని సమాచారం. గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి చెన్నైలోని అన్నా రోడ్డుపై యోగేస్ కారులో హై స్పీడ్‌లో డ్రైవ్ చేశాడు. ఒకరితో ఒకరు పోటీపడి రోడ్డుపై అతివేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో యోగేస్ శ్రీ రత్నం తన స్నేహితులను ఓవర్‌టేక్ చేయాలనే ఉద్దేశ్యంతో తన బీఎండబ్ల్యూలో అత్యంత వేగంతో ప్రయాణించినట్లు సమాచారం.
ఈ సమయంలో కారు చెన్నై టీఎంఎస్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే.. అదుపు తప్పి సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన నిలబడి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులపైకి దూసుకెళ్లింది. తర్వాత పేవ్‌మెంట్‌ను ఢీకొట్టి ఆగిపోయినట్లు అక్కడి ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.

ప్రమాదంలో బెంగళూరుకు చెందిన T ప్రభు(38) తలకు గాయం కాగా అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. జాఫర్‌ఖాన్‌పేటకు చెందిన డి కార్తీక్ (30) ఎడమ తొడ ఫ్రాక్చర్ అయింది. సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తున్న థౌజండ్ లైట్స్ సెక్యూరిటీ గార్డు ఎస్ రమేష్ బాబు (50) రెండు మోకాళ్లకు గాయాలయ్యాయి.
ఘటనపై పాండిబజార్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పేవ్‌మెంట్‌పై ఇరుక్కుపోయిన కారును బయటకు తీశారు. ప్రమాదానికి కారణమైన యోగేష్ శ్రీరత్నంపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో BMW కారు చాలా డ్యామేజ్ అయింది. చాలా చోట్ల ముందు భాగం ధ్వంసం కావడంతో కారును నడపడానికి వీలు లేకుండా ఉంది.

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. యోగేష్ శ్రీ రత్నం తన స్నేహితులతో కలిసి పబ్లిక్ రోడ్డుపై కారు రేసింగ్‌కు పాల్పడటమే ఇందుకు కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఏదేమైనా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఇంకా కఠినంగా వ ్యవహరించాల్సి ఉందేమో..


Click it and Unblock the Notifications








