బ్రిడ్జికి చివర్లో చిక్కుకున్న ఇన్నోవా.. బయటకు తీస్తుండగా త్రాడు తెగి లోయలోకి పల్టీలు..
వంతెన వద్ద చిక్కుకున్న ఓ టయోటా ఇన్నోవా కారు లోయలోకి పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. వంతెన చివర్లో చిక్కుకున్న ఈ కారును ట్రక్కు సాయంతో పైకి లాగుతుండగా ఒక్కసారిగా త్రాడు తెగిపోయింది. దీంతో అది లోయలోకి జారిపోయింది.దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
ఓ టయోటా ఇన్నోవా కారు ప్రమాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి వంతెన అంచు వద్ద ఇరుక్కుపోయింది. ప్రమాదపు అంచుల్లో చిక్కుకున్న వాహనాన్ని బయటకు లాగడానికి కొందరు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ట్రక్కు త్రాడుతో లాగడానికి ప్రయత్నించగా అది కాస్త బెడిసి కొట్టింది.

అయితే ఈ ఘటన జరిగిన తీరును కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ విజువల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ట్రక్కుకు కట్టిన సన్నని త్రాడు ఎంపీవీని బయటకు తీసుకురాలేక పోయింది. క్షణాల్లోనే కారు లోయలోకి పడిపోయిన తీరు అక్కడి వారిని ఆశ్ఛర్యానికి గురిచేసింది.
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు. అదృష్టవశాత్తు ఈ రెస్క్యూలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఇలాంటి రెస్క్యూలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపాటి తప్పిదాలతో భారీ నష్టాలు జరుగుతాయని తెలిపారు. రిస్క్యూ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకోసం..

రెస్క్యూ మిషన్‌లో తీసుకోవలసిన జాగ్రత్తలు: వాహన రెస్క్యూ మిషన్లను చేపట్టడంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే దారుణాలు జరగవచ్చు. ముఖ్యంగా ప్రమాదకరమైన పరిస్థితులలో వాహనం చిక్కుకున్నప్పుడు లేదా ప్రమాదకర లోయలో పడినప్పుడు సరైన ప్రణాళిక, పరికరాలు లేదా నైపుణ్యం లేని వారితో ప్రజలను రక్షించడానికి ప్రయత్నించవద్దు. ఇది పరిస్థితిని మరింత తీవ్రతరం చేేసే అవకాశం ఉంటుంది.
సేఫ్టీ ఫస్ట్: వాహనంలో ఎవరైనా చిక్కుకుంటే రెస్క్యూ సిబ్బంది వారి భద్రతకు ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రమాద తీవ్రతను బట్టి రెస్క్యూ ఆపరేషన్‌కు దిగాలి. ఓ అంచనాకు వచ్చిన తర్వాతే ఆపరేషన్‌లోకి దిగాలి లేదంటే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం పొంచి ఉంటుంది.

పరిస్థితిని అంచనా వేయడం: వాహనం యొక్క స్థానం మరియు చుట్టుపక్కల వాతావరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం ముఖ్యం. సురక్షితమైన రెస్క్యూ ప్లాన్ రూపొందించడానికి భూభాగం, వాతావరణ పరిస్థితులు మరియు వాహనానికి జరిగిన నష్టం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బేరీజు వేసుకున్నాకే రిస్క్యూ ప్రారంభించడం ఉత్తమం.
ప్రొఫెషనల్ సహాయం: సవాలుతో కూడిన రెస్క్యూ సందర్భాల్లో, ట్రక్ ఆపరేటర్లు లేదా శిక్షణ పొందిన అత్యవసర రిస్క్యూ బృందాలకు చెందిన నిపుణుల సహాయం పొందాలి. వారి వద్ద ఉండే అత్యాధునిక పరికరాలు రెస్క్యూ ఆపరేషన్ విజయ అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. ప్రొఫెషనల్స్ సాయం లేకుండా రిస్క్ చేయవద్దు అది ప్రమాదకరం.
తగిన ఎక్విప్ మెంట్: ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ కోసం సరైన టూల్స్ మరియు ఎక్విప్ మెంట్ ఉపయోగించడం చాలా ముఖ్యం. వాహన రికవరీ కోసం రూపొందించిన బలమైన తాళ్లు, హార్నెస్ లు, వించ్ లు మరియు ఇతర ప్రత్యేక గేర్ లు ఈ ప్రక్రియలో ప్రమాదాలను నిరోధించగలవు.
కమ్యూనికేషన్ మరియు సమన్వయం: రెస్క్యూ టీమ్ సభ్యుల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు సమన్వయం కీలకం. రిస్క్యూలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి పాత్రల గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా కీలక సమయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. రెప్పపాటులోనే ఘోరం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన ప్రణాళిక అవసరం.
మీ పరిమితులను తెలుసుకోండి: రెస్క్యూ సిబ్బంది పరిమితులను మరియు ఉపయోగించే పరికరాలను గుర్తించడం చాలా అవసరం. పరిస్థితి చేయిదాటి పోయే సమయంలో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సామర్థ్యాలకు మించి అనిపిస్తే ఓపికగా వెయిట్ చేయాలి. రిస్క్ ఎక్కువగా ఉంటే ప్రమాదం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే బదులుగా సహాయం కోసం వేచి ఉండటం తెలివైన చర్యగా భావించాలి.


Click it and Unblock the Notifications








